గుమ్మడిలో డ్రగ్స్ అధికారుల దాడులు
-
రూ.2 లక్షలు విలువ చేసే మందులు స్వాధీనం
కోవూరు: కోవూరు మందబయలు సెంటర్‌లో ఉన్న గుమ్మడి హాస్పిటల్‌లో మంగళవారం అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ సురేష్‌బాబు ఆకస్మికంగా దాడులు చేశా రు. ఈ దాడుల్లో రూ.2 లక్షలు విలువ చేసే మందులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో అనుమతులు లేకుండా మందులు ఉన్నాయన్న విషయంపై ఫిర్యాదులు రావడతో దాడులు నిర్వహించామన్నారు. దాడులు జరిగి న సమయంలో విలువైన మందులు ఉండటంతో వాటిని పరిశీలిస్తున్నామన్నారు. ఇటీవల కోవూరులోని సెయింట్ పాల్స్ పాఠశాలలో ఆదివారం ఉచిత వైద్యశిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరంలో మిగిలిన మందులను గుమ్మడి హాస్పిటల్‌లో నిల్వ ఉంచడం జరిగిందని ఉచిత వైద్యశిబిరం నిర్వహించిన యూకో ఆర్గనైజేషన్ నిర్వాహకులు డ్రగ్ అధికారులకు లిఖితపూర్వకంగా తెలియచేశారు. తరచుగా మా ఆర్గనైజేషన్‌లో ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో ఉచిత వైద్యశిబిరాలునిర్వహిస్తుంటామని అందులో భాగంగానే ఈ మందులను కొనుగోలు చేసి తెచ్చామని యూకో నిర్వాహకులు తెలిపారు. ఆదివా రం మెగా వైద్యశిబిరం రాత్రి వరకు జరగడంతో ఈ మందులను గుమ్మడి హాస్పిటల్ ఆవరణలో ఖాళీగా ఉన్న ఓ గదిలో నిల్వ ఉంచామని డ్రగ్ అధికారులకు లిఖితపూర్వకంగా ఇచ్చారు. నిర్వాహకులు చెప్పిన వివరాలను నమోదు చేసుకొని నివేదికలు తయారుచేశామని డ్రగ్ అధికారి సురేష్‌బాబు తెలిపారు. దాడుల్లో కావలి, గూడూరు, నెల్లూరు డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు సుభాషిణి, ప్రశాంతి, మురళీ పాల్గొన్నారు.