
ఉత్తమ్ ధిల్లాన్
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వంలో మరో భారత సంతతి న్యాయ వాదికి కీలక పదవి దక్కింది. మాదక ద్రవ్యాల రవాణా, వాడకం కట్టడికి కృషి చేస్తున్న డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ నూతన యాక్టింగ్ అడ్మినిస్ట్రేటర్‌గా ఇండో–అమెరికన్ ఉత్తమ్ ధిల్లాన్ ఎంపికయ్యారు. ఇటీవలే ఆ పదవి నుంచి విరమణ పొందిన రాబర్ట్ ప్యాటర్సన్ స్థానంలో ఆయన మంగళవారం బాధ్యతలు చేపట్టారు.
గతంలో ధిల్లాన్ శ్వేతసౌధంలో అధ్యక్షుడు ట్రంప్‌కు డిప్యూటీ కౌన్సెల్, డిప్యూటీ అసిస్టెంట్‌గా పనిచేశారు. న్యాయ విభాగం, హోంల్యాండ్ సెక్యూరిటీ, కాంగ్రెస్‌లలో వేర్వేరు హోదాల్లో విధులు నిర్వర్తించారు. ఉన్నత స్థాయిలో డ్రగ్స్ అక్రమ రవాణాదారులకు వ్యతిరేకంగా వాదించారు. 2006లో డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్)లోని కౌంటర్ నార్కోటిక్స్ కార్యాలయానికి తొలి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ హోదాలో నార్కో టిక్స్ సమస్య పరిష్కారానికి కీలక వ్యూహాలు రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment