వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతికి చెందిన కుష్ దేశాయ్‌ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించారు. ఈ మేరకు శుక్రవారం వైట్‌హౌస్ ఒక ప్రకటన చేసింది. కుష్ గతంలో, అయోవా రిపబ్లికన్ పార్టీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గాను ,2024 రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు డిప్యూటీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గాను బాధ్యతలు నిర్వర్తించారు.
పెన్సిల్వేనియా వంటి కీలక రాష్ట్రాలకు ఎన్నికల సమయంలో రిపబ్లికన్ పార్టీ తరఫున కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈయన సారథ్యం వహించిన ఏడు రాష్ట్రాల్లో ట్రంప్ ఘన విజయం సాధించడం గమనార్హం. వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ వ్యవహారాలను డిప్యూటీ వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, కేబినెట్ సెక్రటరీ టేలర్ బుడోవిక్ చూస్తున్నారు.వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా కరోలిన్ లీవిట్ ఇప్పటికే నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment