ప్రొద్దుటూరు : అభిలాష్ అనే వ్యక్తి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు డ్రగ్ ఇన్స్పెక్టర్ (డీఐ) రమేష్ రెడ్డి బుధవారం ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా చిక్కాడు. దాంతో అతడిని అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్ జిల్లాలోని బద్వేల్కు చెందిన అభిలాష్ అనే వ్యక్తి మెడికల్ షాప్ పెట్టాలని నిర్ణయించాడు.
అందుకు అనుమతి కోసం డీఐ రమేష్ రెడ్డిని సంప్రదించారు. అయితే రూ. 20 వేలు లంచం ఇస్తే వెంటనే అనుమతి మంజూరు చేస్తానని రమేష్రెడ్డి... అభిలాష్కు తెలిపారు. దాంతో అతడు ఏసీబీని ఆశ్రయించి... విషయాన్ని వివరించాడు. దీంతో వల పన్ని బుధవారం డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో అభిలాష్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా రమేష్రెడ్డిని అరెస్ట్ చేశారు.