
సాక్షి, వైఎస్సార్ జిల్లా: నీటిపారుదలశాఖలో ఏఈఈగా పనిచేస్తున్న పల్లా సుబ్బయ్య ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేశారు. ప్రొద్దుటూరులోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు.. సుమారు రూ. రెండుకోట్ల విలువైన స్థలాల పత్రాలను, 560 గ్రాముల బంగారాన్ని, రూ. లక్ష నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉండటంతో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మైలవరం ఇరిగేషన్ కార్యాయలంలో ఏఈఈగా పల్లా సుబ్బయ్య విధులు నిర్వర్తిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment