Irrigation branch
-
దేవినేని ఉమా, ఎమ్మెల్యే వసంత కృష్ణ వర్గీయులు రచ్చ రచ్చ
-
భలే దొంగలు...ఏకంగా 60 అడుగుల బ్రిడ్జినే...
Thieves Stolen 60 Feet Steel Bridge: ఇటీవల దొంగతనానికి వచ్చి గోడ కన్నంలో ఇరుక్కుపోయిన ఘటన గురించి విన్నాం. బంగారం, డబ్బులు, ఇంట్లో ఫర్నిచర్ వంటివి ఎత్తుకుపోవడం గురించి విన్నాం. కానీ అసాధ్యమైనవి, అలాంటివి కూడా ఎత్తుకుపోతారా అనిపించే వాటిని ఒక దొంగల ముఠా పక్కా ప్లాన్‌తో ఎత్తుకుపోయింది. పైగా స్థానికుల సాయంతో దర్జాగా పట్టుకెళ్లిపోయింది. వివరాల్లోకెళ్తే...బిహార్‌లోని రోహతాస్ జిల్లాలో పట్టపగలు 60 అడుగుల వంతెనను దొంగలించారు. అసలెవరూ ఊహించని విధంగా అసాధారణమైన దాన్ని ఎత్తుకెళ్లిపోయారు. పోలీసుల కథనం ప్రకారం...అమియావర్ గ్రామం వద్ద 1972లో అర్రా కాలువపై వంతెన నిర్మించారు. ఇది ఇప్పుడూ చాలా పాతది మాత్రమే కాదు, ప్రమాదకరమైనది కూడా. అయితే స్థానిక గ్రామస్తులు ప్రస్తుతం ఈ వంతెనను వినియోగించడంలేదు. ఈ మేరకు ఒక దొంగల ముఠా నీటి పారుదల శాఖ అధికారులుగా ఆ గ్రామంలోని స్థానికులకు పరిచయం చేసుకున్నారు. ఆ వంతెనను కూల్చివేస్తున్నామని చెప్పడమే కాకుండా గ్రామస్తుల సాయం కూడా తీసుకున్నారు. ఆ వంతెన ఉక్కుతో కూడిన నిర్మాణం. ఆ ముఠా గ్యాస్ కట్టర్లు, ఎర్త్‌మూవర్ యంత్రాలను ఉపయోగించి వంతెనను కూల్చివేసి, మూడు రోజుల్లో మొత్తం మెటల్ని స్వాహా చేశారు. దీంతో నీటి పారుదల శాఖ అధికారుల అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ పై ఫిర్యాదు అందడంతో పోలీసులు ఘటనస్థలికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వంతెన 60 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తు ఉంటుందని చెబుతున్నారు పోలీసులు. గతంలో ఇలాంటి ఘటనలు చెక్ రిపబ్లిక్, యూఎస్‌లోని పెన్సిల్వేనియా, ఉక్రెయిన్ వంటి దేశాల్లో చోటు చేసుకున్నాయి. ఏదిఏమైన దొంగలకు కూడా రొటిన్‌గా చేసే దొంగతనాలు పై బోర్ కొట్టిందో ఏమో ఇలా వైరైటీగా దొంగతనం చేయాలనుకున్నారు కాబోలు. Bihar |60-feet long-abandoned steel bridge stolen by thieves in Rohtas district Villagers informed some people pretending as mechanical dept officials uprooted bridge using machines like JCB & gas-cutters. We've filed the FIR:Arshad Kamal Shamshi, Junior Engineer,Irrigation dept pic.twitter.com/o4ZWVDkWie — ANI (@ANI) April 9, 2022 (చదవండి: ఏ క్షణంలోనైనా మీ ప్రాణాలు పోవచ్చు.. మాజీ సీఎంలకు వార్నింగ్) -
ఇరిగేషన్ అధికారిపై ఏసీబీ దాడులు.. భారీగా ఆస్తులు!
సాక్షి, వైఎస్సార్ జిల్లా: నీటిపారుదలశాఖలో ఏఈఈగా పనిచేస్తున్న పల్లా సుబ్బయ్య ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేశారు. ప్రొద్దుటూరులోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు.. సుమారు రూ. రెండుకోట్ల విలువైన స్థలాల పత్రాలను, 560 గ్రాముల బంగారాన్ని, రూ. లక్ష నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉండటంతో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మైలవరం ఇరిగేషన్ కార్యాయలంలో ఏఈఈగా పల్లా సుబ్బయ్య విధులు నిర్వర్తిస్తున్నారు. -
భారమంతా బ్యాంకు రుణాలపైనే
- పెద్ద నోట్ల రద్దుతో ప్రాజెక్టులకు ఆగిన రూ. 2,200 కోట్ల చెల్లింపులు - ఈ అంశంపై సీఎంతో మంత్రి హరీశ్‌రావు సమాలోచన సాక్షి. హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో దీన్నుంచి బయటపడే మార్గాలపై నీటిపారుదల శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రాజెక్టుల పరిధిలో చేసిన పనులకు రూ. 2 వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండటం, మున్ముందు భారీగా నిధుల అవసరాలు ఉండటంతో ఆర్థిక భారాన్ని తట్టుకునేందుకు బ్యాంకు రుణాల వైపు అడుగులు వేస్తోంది. నోట్ల రద్దుతో భారీగా డిపాజిట్లు బ్యాంకులకు చేరుతున్న నేపథ్యంలో రుణాలు ఇచ్చేందుకు సానుకూలత ఉంటుందని అంచనా వేస్తోంది. నీటిపారుదల శాఖకు సర్కారు రూ. 25 వేల కోట్ల బడ్జెట్ కేటారుుంచినా ఇప్పటివరకు జరిగిన చెల్లింపులు కేవలం రూ.8,650 కోట్లు మాత్రమే. ఈ నెలలో ఇంకా వివిధ ప్రాజెక్టుల కింద చేసిన పనులకు రూ.1,385 కోట్ల మేర కాంట్రాక్టు ఏజెన్సీలకు చెల్లించాల్సి ఉంది. భూసేకరణ నిమిత్తం రూ.400 కోట్లు అవసరమని వివిధ ప్రాజెక్టుల నుంచి ప్రతిపాదనలు రాగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో సబ్స్టేషన్ల నిర్మాణానికి మరో రూ. 400 కోట్లు చెల్లించాలని ట్రాన్సకో నుంచి వినతులు వచ్చారుు. మొత్తంగా వీటికే దాదాపు రూ. 2,200 కోట్ల మేర బిల్లులు పెండింగ్ ఉండగా నెలాఖరుకి ఇవి రూ. 2,500 కోట్లకు చేరుతాయని నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. అరుుతే ఇప్పటికే పలు ప్రాజెక్టుల పరిధిలో పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ఇంధనం, లేబర్ చార్జీలు చెల్లించలేక ఏజెన్సీలు పనులు నిలిపేశారుు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి కనీసం 8 నుంచి 10 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు రుణాలవైపు నీటిపారుదల శాఖ దృష్టి సారించింది. ప్రధానమంత్రి కృషి సించారుు యోజన కింద గుర్తించిన 11 పెండింగ్ ప్రాజెక్టులకు నాబార్డు ద్వారా రూ.7,900 కోట్ల మేర రుణాలిప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సుమారు రూ. 6 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఆంధ్రా బ్యాంకు ముందుకొచ్చింది. కాగా, సాగునీటి బడ్జెట్ అవసరాలు, ప్రస్తుత పరిస్థితులపై మంత్రి హరీశ్‌రావు ఆదివారం సీఎం కేసీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలసి చర్చించారు. ప్రాజెక్టులకు బ్యాంకు రుణాల అంశంపైనే వారు చర్చించినట్లు తెలిసింది. -
ఎట్టకేలకు ‘నీటి’ఎన్నికలు
చేతులెత్తే పద్ధతిలో ఏకాభిప్రాయం వచ్చే నెలాఖరులోగా ప్రక్రియ ముగింపు ఏర్పాట్లలో ఇరిగేషన్ అధికారులు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న నీటి సంఘాలకు ఎట్టకేలకు ఎన్నికలు జరుగనున్నాయి. ప్రభుత్వం ఈ మేరకు జీవో జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు ఇరిగేషన్ శాఖాధికారులు కసరత్తు మొదలు పెట్టారు. గ్రామాల్లో అప్పుడే సందడి సంతరించుకుంది. విశాఖపట్నం : ఆయకట్టు స్థిరీకరణలో సాగునీటి సంఘాలదే క్రియాశీలక పాత్ర. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వీటి బలోపేతానికి విరివిగా నిధులుకేటాయించడమే కాకుండా సకాలంలో ఎన్నికలుకూడా నిర్వహించారు. 2008లో పదవీకాలం ముగియగానే వీటికి ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత ఈ సంఘాలను పట్టించుకునే వారే కరువయ్యారు. 2013తో వీటి పదవీకాలం ముగియగానే..ఆర్నెళ్లకోసారి చొప్పున వీటి కాలపరిమితిని పొడిగిస్తూ రెండేళ్లుగా ఎన్నికలు వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు ఎన్నికల నిర్వహణకు సర్కార్ గ్రీన్‌సిగ్నెల్ ఇవ్వడంతో పల్లెల్లో సందడి మొదలైంది. జిల్లాలో ఒక్క తాండవ ప్రాజెక్టు పరిధిలో మాత్రమే ఐదు డిస్ట్రిబ్యూటరీ కమిటీ(డీసీ)లు ఉన్నాయి. మిగిలిన ప్రాజెక్టులకు డీసీలులేవు. కాగా తాండవ పరిధిలో 24, రైవాడ పరిధిలో 10,కోనాం పరిధిలో ఎనిమిది సాగునీటి సంఘాలుండగా, మైనర్ ఇరిగేషన్ వనరుల పరిధిలో మరో 304 సాగునీటి సంఘాలున్నాయి. వచ్చే నెలాఖరులోగా ఈ సంఘాల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఎన్నికల నిర్వహణ కోసం సర్కార్ తనదైన విధానాన్ని రూపొందించింది. తొలుత అర్హుల నిర్ధారణ తొలుత గత ఎన్నికల్లో ఓటుహక్కు కలిగిన వారి జాబితాలను సిద్ధం చేస్తారు. వీరిలో ఎంతమంది ఓటు వేసేందుకు అర్హులో తొలుత నిర్ధారిస్తారు. ఆ తర్వాత ఆయకట్టు వారీగా రైతుమహా జనసభలు ఏర్పాటు చేస్తారు. ఆ సభల్లో రైతులందరి ఏకాభిప్రాయంతో కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు నలుగురు సభ్యులు ఎంపిక చేస్తారు. గతంలో ఈ కమిటీల ఎన్నికల సమయంలోగ్రామాల్లో రైతుల మధ్య తీవ్ర పోటీ ఉండేది. పార్టీ రహితంగానే ఈఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ గ్రామాల్లో పార్టీల వారీగా వేరుపడి తలపడే వారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో సాగునీటి సంఘాలకు కూడా తీవ్ర పోటీ ఉండేది. రైతుల మధ్య విభేదాలకు దారితీసేవి. ఈ సమస్యలకు పుల్‌స్టాప్ పెట్టేందుకే చేతులెత్తే పద్ధతిలో ఏకాభి ప్రాయ సాధనతోనే ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ స్పష్టం చేసింది. టీడీపీ వారికి కట్టబెట్టేందుకే.. టీడీపీ సానుభూతి పరులైన వారికి మాత్రమే పగ్గాలు వచ్చేలా పథకరచన చేస్తున్నారు. ఈదఫా ఎన్నికల విధానంలో ప్రభుత్వం పలు మార్పులు చేసింది. రైతువారీగా ఏకాభిప్రాయంతో మాత్రమే కమిటీలను ఎన్ను కోవాలని సూచించింది. ఈ నూతన విధానం ద్వారా ఆయకట్టులో 20 సెంట్లకుపైగా భూములున్న రైతులు మాత్రమే సాగునీటి సంఘాల్లో సభ్యులుగా ఉంటారు. ముందుగా ఓటుహక్కు కలిగిన రైతులు మాత్రమే సాగునీటి సంఘాల పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిఉంటుంది. ఆ తర్వాత డీసీ ఎన్నికలను కూడా ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏకాభిప్రాయం కుదరకపోతే అధికారులే ఆయా సంఘాలకు పర్శన్ ఇన్చార్జిలుగా వ్యవహరిస్తారు. దిగువ, మధ్య స్థాయి కమిటీల ఎంపిక పూర్తయ్యాక ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు జరుగుతాయి.