భారమంతా బ్యాంకు రుణాలపైనే
- పెద్ద నోట్ల రద్దుతో ప్రాజెక్టులకు ఆగిన రూ. 2,200 కోట్ల చెల్లింపులు
- ఈ అంశంపై సీఎంతో మంత్రి హరీశ్‌రావు సమాలోచన
సాక్షి. హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో దీన్నుంచి బయటపడే మార్గాలపై నీటిపారుదల శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రాజెక్టుల పరిధిలో చేసిన పనులకు రూ. 2 వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండటం, మున్ముందు భారీగా నిధుల అవసరాలు ఉండటంతో ఆర్థిక భారాన్ని తట్టుకునేందుకు బ్యాంకు రుణాల వైపు అడుగులు వేస్తోంది. నోట్ల రద్దుతో భారీగా డిపాజిట్‌లు బ్యాంకులకు చేరుతున్న నేపథ్యంలో రుణాలు ఇచ్చేందుకు సానుకూలత ఉంటుందని అంచనా వేస్తోంది. నీటిపారుదల శాఖకు సర్కారు రూ. 25 వేల కోట్ల బడ్జెట్ కేటారుుంచినా ఇప్పటివరకు జరిగిన చెల్లింపులు కేవలం రూ.8,650 కోట్లు మాత్రమే. ఈ నెలలో ఇంకా వివిధ ప్రాజెక్టుల కింద చేసిన పనులకు రూ.1,385 కోట్ల మేర కాంట్రాక్టు ఏజెన్సీలకు చెల్లించాల్సి ఉంది.
భూసేకరణ నిమిత్తం రూ.400 కోట్లు అవసరమని వివిధ ప్రాజెక్టుల నుంచి ప్రతిపాదనలు రాగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో సబ్‌స్టేషన్ల నిర్మాణానికి మరో రూ. 400 కోట్లు చెల్లించాలని ట్రాన్‌సకో నుంచి వినతులు వచ్చారుు. మొత్తంగా వీటికే దాదాపు రూ. 2,200 కోట్ల మేర బిల్లులు పెండింగ్ ఉండగా నెలాఖరుకి ఇవి రూ. 2,500 కోట్లకు చేరుతాయని నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. అరుుతే ఇప్పటికే పలు ప్రాజెక్టుల పరిధిలో పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ఇంధనం, లేబర్ చార్జీలు చెల్లించలేక ఏజెన్సీలు పనులు నిలిపేశారుు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి కనీసం 8 నుంచి 10 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బ్యాంకు రుణాలవైపు నీటిపారుదల శాఖ దృష్టి సారించింది. ప్రధానమంత్రి కృషి సించారుు యోజన కింద గుర్తించిన 11 పెండింగ్ ప్రాజెక్టులకు నాబార్డు ద్వారా రూ.7,900 కోట్ల మేర రుణాలిప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సుమారు రూ. 6 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఆంధ్రా బ్యాంకు ముందుకొచ్చింది. కాగా, సాగునీటి బడ్జెట్ అవసరాలు, ప్రస్తుత పరిస్థితులపై మంత్రి హరీశ్‌రావు ఆదివారం సీఎం కేసీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలసి చర్చించారు. ప్రాజెక్టులకు బ్యాంకు రుణాల అంశంపైనే వారు చర్చించినట్లు తెలిసింది.