గాలిలో మేడలు కడుతున్నారు
- కేసీఆర్ కుటుంబ సభ్యులపై భట్టి ధ్వజం
- కేటీఆర్ ఓ కుర్రకుంక: సర్వే
సాక్షి, హైదరాబాద్: రాబోయే 20ఏళ్లు అధికారంలో ఉం టామని సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు, మంత్రి హరీశ్ రావు గాలిలో మేడలు కడుతున్నారని టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఎన్‌ఎస్‌యూఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆది వారం గాంధీభవన్‌లో జెండా ఆవిష్కరించారు. భట్టి మాట్లాడుతూ.. మరో 20ఏళ్లపాటు సీఎంగా కేసీఆర్ ఉంటారన్న మంత్రి హరీశ్ మాటలు చూస్తుంటే కేసీఆర్ సీఎంగా లేకుంటే తానే ఉండాలని భావిస్తున్నట్టుగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ పోరాటాల చరిత్ర ఉందని, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ లాంటివారిని పార్టీ చాలామం దిని చూసిందన్నారు.
2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నం తకాలం విద్యావ్యవస్థను పటిష్టం చేసిందని, టీఆర్‌ఎస్ దానిని నాశనం చేస్తున్నదని విమర్శించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి నాలుగు బడ్జెట్ లు ప్రవేశపెట్టినా కేజీ టు పీజీకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. తెలంగాణను కార్పొ రేట్ విద్యాసంస్థలు పీక్కుతింటున్నా యని, వాటిని తెలంగాణ నుంచి తరిమేస్తానని ఉద్యమ సమయంలో ప్రకటించిన కేసీఆర్ అదే సంస్థలకు దాసోహమయ్యారన్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ హరీశ్ రావును సీఎం కేసీఆర్ కుటుంబం ఏకాకిని చేసిందన్నారు.
కాంగ్రెస్ గెలవదని హరీశ్ మాట్లాడటానికి వేరే కారణముందన్నారు. తనను కాంగ్రెస్‌లోకి తీసుకుంటే బాగుం టుందని హరీశ్‌రావు పరోక్షంగా చెబుతున్నారన్నా రు. మంత్రి కేటీఆర్ ఓ కుర్రకుంక అని, ఆయన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. పార్టీలో మహిళా కాంగ్రెస్ ‘నామ్‌కే వాస్తే’గా పనిచేస్తున్నట్టు ఉన్నదన్నారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్ పాల్గొన్నారు.