
‘కేసీఆర్ గాల్లో మేడలు కట్టుకుంటున్నారు’
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ గాల్లో మేడలు కట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్, హరీష్‌రావులాంటి వారిని చాలామందిని కాంగ్రెస్ పార్టీ చూసిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ పరిపాలనను వెల్లగొడతారని, కాంగ్రెస్‌కు పట్టం కడతారని వివ్వాసం వ్యక్తం చేశారు.