రైతు సంక్షేమానికి పెద్దపీట
మంత్రి టి.హరీశ్‌రావు
జహీరాబాద్: రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఆదివారం రాత్రి సీడీసీ చైర్మన్ ఉమా కాంత్ పాటిల్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అన్నదాతకు ఎక రాకు రూ.4 వేల వంతున ఎరువుల కింద అందించేందుకు నిర్ణయించిందని గుర్తు చేశా రు. పండ్ల తోటలు సాగు చేస్తున్న రైతులకు సైతం ఈ పథకం వర్తిస్తుందన్నారు. వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన కరెం టును పగటి పూటే అందిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో 24 గంటల పాటు నిరంత రాయ విద్యుత్ సరఫరాకు సీఎం ప్రయత్ని స్తున్నారన్నారు. ఈ సమావేశంలో జహీరా బాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ ఎం.డి.ఫరీ దుద్దీన్, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే సి.బాగన్న తదితరులు పాల్గొన్నారు.
ఇక బాలురకూ కేజీబీవీలు
సిద్దిపేట జోన్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఇకపై బాలుర కోసం కూడా నెలకొల్పుతామని మంత్రి హరీశ్‌రావు అన్నా రు. ఆదివారం ఆయన సిద్దిపేటలో విలేకరు లతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 29 జిల్లా కేంద్రాల్లో అర్బన్ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.