ఏసీబీ చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ
Published Fri, Nov 25 2016 1:53 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
రాయదుర్గం: కొత్తగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ ఏఈ ఏసీబీ వలకు చిక్కాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం ఏఈగా పని చేస్తున్న మహబూబ్‌బీపీరా ఓ రైతుకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించి లంచం తీసుకుంటున్న ఏఈతో పాటు అతని అసిస్టెంట్ బాబాను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.
Advertisement
Advertisement