కర్నూలు : కర్నూలు జిల్లాలో ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. లక్ష రూపాయిల లంచం తీసుకుంటూ ట్రాన్స్కో ఏఈ బుధవారం ఉదయం రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే ఎమ్మిగనూరు ట్రాన్స్కోలో ఏఈగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రశేఖర్...ఓ కాంట్రాక్టర్ నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
గత కొన్నిరోజులుగా తన పని త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ వెంకటస్వామి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. పెడచెవిన పెట్టిన ఏఈ లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళిక ప్రకారం ఈ రోజు ఉదయం ఏడీ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఏఈని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
'లక్ష' తీసుకుంటూ దొరికిపోయాడు..
Published Wed, Mar 4 2015 11:08 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM