అసైన్డ్‌ భూమిని ఆక్రమించడం తప్పు కాదా..? | Captain Laxmikantha Rao Fires On Etela Rajender Over Illegal Land | Sakshi
Sakshi News home page

అసైన్డ్‌ భూమిని ఆక్రమించడం తప్పు కాదా..?

Published Thu, May 6 2021 9:01 AM | Last Updated on Thu, May 6 2021 9:03 AM

Captain Laxmikantha Rao Fires On Etela Rajender Over Illegal Land - Sakshi

హుజూరాబాద్‌: బాధ్యత గల మంత్రిగా ఉంటూ ఈటల రాజేందర్‌ 66 ఎకరాల అసైన్డ్‌ భూములను ఆక్రమించడం తప్పు కాదా?’ అని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు ప్రశ్నించారు. బుధవారం హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌లోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. హుజూ రాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలను ఈటల ప్రోత్సహించారని ఆరోపించారు.  

కమలాపూర్‌ నియోజకవర్గంలో 2001లోనే బలమైన పార్టీగా అవతరించిందని, 2004లో ఈటల టీఆర్‌ఎస్‌లోకి వచ్చారన్నారు. ఈటలను సీఎం సొంత తమ్ముడిలా చూసుకున్నారని, పార్టీలో అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.  ‘రైతుబంధు’ను కేసీఆర్‌ ఇక్కడే ప్రారంభించారని.. అయినా పథకాలపై వ్యతిరేక ధోరణితో ఈటల మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
చదవండి: ‘కేసీఆర్‌ బయటకు రా.. ప్రజల కష్టాలు చూడు’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement