సాక్షి, కరీంనగర్: జిల్లాకు స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్‌దేనని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకొని నగరాభివృద్ధికి కృషి చేస్తున్న ఆయనకు ప్రత్యేక అభినంద తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయంతో విప్లవాత్మకమైన రెవెన్యూ చట్టాన్ని తెచ్చారు. సీఎం కేసిఆర్ ఎలాంటి చట్టాన్ని ప్రవేశ పెట్టిన ప్రజల శ్రేయస్సు కోసమే. భూమి తగాదాలను నివారించడం కోసం కేసీఆర్ ఈ చట్టన్ని రూపొందించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తుంది. ఎన్నో ఏళ్ళనాటి భూ సమస్యలకు ఈ చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుంది. కరీంనగర్ జిల్లా అధికార యంత్రాంగం, రాజకీయ యంత్రాంగం కలిసి టీమ్ వర్క్‌గా పని చేస్తున్నాం. ఈ టీమ్‌ను ప్రజల సేవ కోసం సీఎం కేసీఆర్ తయారు చేశారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ది బాటలో తీర్చిదిద్దడమే టీం ప్రధాన లక్ష్యం. (బీజేపీకి తెలంగాణలో భవిష్యత్ లేదు)
కరీంనగర్ నగర ప్రజలకు సాగు, త్రాగు నీటికి ఎలాంటి ఇబ్పంది లేదు. ఇది శుభ పరిణామం. గతంలో అడవులకు పుట్టినిల్లు కరీంనగర్ జిల్లా. జిల్లాల విభజనతో కరీంనగర్‌కు అడవుల శాతం తగ్గింది. 33 జిల్లాల్లో అతి తక్కువ అడవులు ఉన్న జిల్లాగా మారింది. కాంక్రీట్ జంగల్‌గా మారిన జిల్లాలో యుద్ద ప్రాతిపదిక మొక్కలు నాటుతున్నాం. జిల్లా వ్యాప్తంగా 6వ విడుతలో 55 లక్షల మొక్కలు నాటడానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 43.85 లక్షల మొక్కలను నాటాం. 15 రోజుల సమయంలో మిగిలిన మొక్కలు నాటి టార్గెట్ పూర్తి చేస్తాం. రానున్న రెండు సంవత్సరాల్లో వనాలకు పుట్టినిల్లుగా కరీంనగర్‌ను మారుస్తాం. సీఎం చొరవతో అందమైన రోడ్లు వేశాం.
చిరకాల వాంఛ అయిన మంచి నీటిని ప్రతి రోజూ అందిస్తున్నాం. రానున్న రోజుల్లో 24/7 అందిస్తాం. నగరంలో పారిశుధ్యాన్ని మెరుగు పరిచాం. ప్రజల కోసం 15 ఈ-టాయిలెట్లను అందుబాటులోకి తెస్తున్నాం. ఈ రోజు రెండు ప్రారంభించాం. నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం. నగరంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను కూడా ప్రజలకు త్వరలో అందుబాటులోకి తెస్తాం. ఇప్పటికే వాటికి సంబంధించిన డీపీఆర్ తయారు చేశాం. త్వరలోనే కేబుల్ బ్రిడ్జ్‌ను ప్రారంభించేందుకు ఆలోచన చేస్తున్నాం. దసరాలోగా ముఖ్యమంత్రి అనుమతి మేరకు ప్రారంభించి అందుబాటులోకి తెస్తాం. ప్రజల సహకారంతో రానున్న రోజుల్లో ఉత్తర తెలంగాణలో ఆదర్శమైన జిల్లాగా కరీంనగర్‌ను అభివృద్ధి చేస్తాం' అని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment