development activities
-
Year Ender 2024: విద్యారంగంలో నూతన అధ్యాయం
2024లో దేశంలోని విద్యావ్యవస్థలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. పలు విశ్వవిద్యాలయాలు ప్రపంచ వేదికపై ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాయి. మరోవైపు ఈ ఏడాదిలో జరిగిన వివిధ పరీక్షల పేపర్ లీక్ కేసులు ప్రభుత్వాన్ని పలు ఇబ్బందులకు గురిచేశాయి. ఇదిలావుంటే విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక కొత్త కార్యక్రమాలను కూడా చేపట్టింది. 2024లో విద్యా రంగంలో చోటుచేసుకున్న నూతన మార్పులను ఒకసారి గుర్తుచేసుకుందాం.వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్దేశంలో విద్య, పరిశోధనలకు నూతన దిశను అందించడానికి కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్(One Nation One Subscription) పథకాన్ని ప్రారంభించింది. ఇది విద్యార్థులు, పరిశోధకులకు జాతీయ స్థాయిలో అకడమిక్ జర్నల్స్, ఈ-బుక్స్, పరిశోధన డేటాబేస్లను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ పథకానికి రూ.6,000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలకు ఇది డిజిటల్ విప్లవంగా మారింది.పీఎం విద్యా లక్ష్మి యోజన2024లో కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి విద్యా లక్ష్మి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తారు. ఈ పథకం ముఖ్యంగా దేశంలోని 860 ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లలో అడ్మిషన్ తీసుకునే విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు కనీస వడ్డీ రేట్ల(Minimum interest rates)కు విద్యా రుణాలు లభిస్తాయి. ఏటా 22 లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే ఈ పథకానికి ప్రభుత్వం వచ్చే ఏడేళ్లలో రూ.3,600 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.పీఎంశ్రీజాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)2020 కింద పీఎం శ్రీ విద్యాలయాలను నెలకొల్పారు. వీటిని సమగ్ర విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించారు. విద్యార్థులను అకడమిక్ పరిజ్ఞానం వైపు మాత్రమే కాకుండా సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, క్యారెక్టర్ బిల్డింగ్ వైపు ప్రేరేపించడం దిశగా ఈ విద్యా విధానం ముందుకుసాగనుంది.పీఎం ఇంటర్న్‌షిప్ పథకంకేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌షిప్(PM Internship) పథకాన్ని కూడా ఈ ఏడాదే ప్రారంభించింది. దీనిలో విద్యార్థులు, ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారు ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం పొందగలుగుతారు. విద్యను పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్న యువతకు ఈ పథకం ఒక వేదికను అందిస్తుంది. విద్యార్థులు ఈ పథకం ద్వారా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడమే కాకుండా వివిధ రంగాలలో పనిచేసిన అనుభవాన్ని కూడా సంపాదించవచ్చు.ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎన్నటికీ మరువలేని రెండు దుర్ఘటనలు -
అమెరికాలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీట్ అండ్ గ్రీట్ గ్రాండ్ సక్సెస్
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీట్ అండ్ గ్రీట్ విజయవంత మైంది. అమెరికాలో వైయస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు బాణాసంచాతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి స్వాగతం పలికారు. మే 07న హొటల్ పారడైస్ ఇండియన్ కుసిన్ లో నిర్వహించిన ఈ సభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు 275 మందికి పైగా పాల్గొన్నారు. తొలుత దివంగత నేత, తెలుగు ప్రజల స్ఫూర్తి ప్రదాత, మహానేత రాజశేఖర రెడ్డికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రమేష్ రెడ్డి వల్లూరు, వెంకట్ రెడ్డి కల్లూరి, పార్థ బైరెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన, పుష్ప గుచ్చాలతో అంజలి ఘటించారు. వివిధ జాతీయ తెలుగు సంఘాల ప్రతినిధులు - రిపబ్లిక్ పార్టీ లీడర్ వర్జీనియా ఆసియన్ అడ్విసోరీ బోర్డు మెంబెర్ శ్రీమతి శ్రీలేఖ పల్లె, ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వెట) నుంచి శ్రీమతి శైలజ, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట) నుంచి శ్రీ సతీష్ రెడ్డి నరాల, కాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ (కాట్స్) నుంచి శ్రీ అనిల్ రెడ్డి నందికొండ, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) నుంచి సౌర్య ప్రసాద్ కొచ్చెర్ల, ఇతర ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. వైస్సార్సీపీ మిడ్ అట్లాంటిక్ ఇంచార్జి పార్థ బైరెడ్డి ముఖ్య అతిధులను వేదికకు ఆహ్వానించారు. రమేష్ రెడ్డి వల్లూరు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమెరికా అడ్వైసర్ అండ్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ (ఈవెంట్ ఆర్గనైజర్) వ్యాఖ్యాతగా వ్యవహరించి సభను దిగ్విజయంగా నడిపారు. మేరీల్యాండ్ స్టేట్ 10th డిస్ట్రిక్ట్ సెనెటర్ బెంజమిన్ బ్రూక్స్ మరియు అతని ప్రతినిధి కెన్నీ బ్రౌన్ తమ రాష్ట్రానికి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాకను సాదరముగా ఆహ్వానించారు. వర్జీనియా డెమొక్రాట్ లీడర్ శ్రీ శ్రీధర్ నాగిరెడ్డి.. మంత్రిని వాషింగ్టన్ డల్లాస్ ఎయిర్ పోర్ట్ లో సాదరముగా అమెరికా రాకను ఆహ్వానించారు. స్థానిక YSRCP సభ్యులు ప్రసంగిస్తూ.. శ్రీ రాజశేఖర రెడ్డి ఆశయాలను, ప్రవేశపెట్టిన పధకాలను కొనియాడుతూ, ప్రస్తుత ముఖ్య మంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పని తీరు తెన్నులను మనస్ఫూర్తిగా పొగిడారు. శివ రెడ్డి మాట్లాడుతూ ఈ 4 సంవత్సరాల మన పరిపాలనలో గ్రామ, వార్డు సచివాలయం. ప్రతి 2000 జనాభాకు ఒక సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ వ్యవస్థ, ఎవరికీ ఏ సమస్య వచ్చినా చెయ్యి పట్టుకొని నడిపించే పరిస్థితి. ఏకంగా లబ్ధిదారుల జాబితాను సోషల్ ఆడిట్ కోసం సచివాలయాల్లో ప్రదర్శించడం, లంచాలకు లేకుండా, వివక్షకు తావులేకుండా ఇవ్వగలిగే గొప్ప వ్యవస్థను గ్రామస్థాయికి తీసుకు రావడం చాల గొప్ప విషయమన్నారు. రమేష్ రెడ్డి ప్రసంగిస్తూ తరాలు మారినా రాజశేఖరుడిలాంటి గొప్ప రాజకీయవేత్త, పేదలపాలిటి పెన్నిధి మనకు కానరారని ,కులమత ప్రాంతాలకు అతీతంగా అజన్మాంతం సామాన్యుడి మదిలో నిలిచిపోయారని ,అలాంటి మహనీయుని ఆశయాలకు వారసుడుగా ఆశయ సాధనలో ధీరుడిగా "రాజన్న సువర్ణ రాజ్యం" కొరకు గత నాలుగు సంవత్సరాలుగా అహర్నిశలు పాటుపడుతూ ప్రతి పక్షం గుండెల్లో రైల్లు పరిగెత్తిస్తున్న వై యస్ జగన్ రాష్టానికి మళ్లీ ముఖ్యమంత్రిగా వచ్చే 2024 ఎన్నికల్లో గెలుపొందేవిధంగా నవతరం పాటుపడాలన్నారు. దివంగత నేత రాజశేఖరుడి తనయుడు పెద్దాయన ఏర్పరచిన దారిలో నడుస్తున్న నేటి తరం జన నేత జగన్ కి మన సంపూర్ణ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. మాట నిలబెట్టుకుంటూ, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను నాలుగేళ్ల పరిపాలనలో 98 శాతానికి పైగా నెరవేర్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంపూర్ణ ప్రజా మద్దతు నిలువెత్తు నిదర్శనమన్నారు. గత 48 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా చేస్తున్న మేలును ఇంటింటా వివరించి.. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైయస్ఆర్సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం మంచి పరిమాణం అన్నారు. జార్జ్ ఉపన్యసిస్తూ మారిన కాలానికి అనుగుణంగా మన దేశ ఆర్థిక పరిస్థితులు మారాలని,యువతరం ముందుకు రావాలని,ఇపుడున్న ప్రభుత్వం ఎలా సామాన్య ప్రజల కనీస అవసరాలు తీరుస్తున్నారో అందరూ చూస్తున్నారని సెలవిచ్చారు. అలాగే నిన్నటి రాజన్న పరిపాలనలో కాంచిన పేదవారి చిరునవ్వులు నేడు మల్లీ జగన్ లాంటి నాయకుడు రాష్ట్రానికి రధ సారధిగా వచ్చి వీరభూస్తున్నారని పునరుధ్ఘాటించారు. నేటి ఆర్ధిక మంత్రి బుగ్గన, సీఎం జగన్ మధ్య సఖ్యత నాటి ఆర్ధిక మంత్రి కొణజేటి రోశయ్య, ,డాక్టర్ వైఎస్ సఖ్యతను తలపిస్తున్నారని పొగిడారు. అనంతరం సౌర్య ప్రసాద్ కొచ్చెర్ల మాట్లాడుతూ NRI YSRCP అంతా ఒక్కటై ఒకేమాటగా ఒకే బాటగా YSRCP పార్టీని 2024 లో తిరిగి అధికారంలోకి తీసుకురావాలని అందుకు అందరి సహాయ సహకారాలు చాలా అవసరమని పేర్కొన్నారు. గోరంట్ల వాసు బాబు విద్య యెక్క ఆవశ్యకతను తెలియచేస్తూ తాను ఎలా పేద విద్యార్థులకు భోధనాభ్యసన పరికరములు, భోధన సామాగ్రి సాయం చేస్తున్నారో తెలిపారు. ఈ సభలో ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి బుగ్గన మాట్లాడుతూ ఏపీ రాష్ట్రం పరిశ్రమలు, మౌలిక సదుపాయల అభివృద్ధి ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపడమే కాక, వివిధ రంగాలలో ఉత్పాదక సామర్థ్యాలను వెలికితీస్తూ, ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుందన్నారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా ప్రజల మనస్సులో నిలిచిన నేత వైఎస్సార్ అని, దివంగత మహానేత అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాల రూపంలో ఆయన ఇప్పటికీ మనందరి గుండెల్లో నిలిచి ఉన్నారని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే సంక్షేమం, అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతిలో ఏపీ దూసుకుపోతోంది. పెద్ద ఎత్తున జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, రెవిన్యూ జనరేషన్, యువతకు ఉపాధి, స్కిల్ విషయాలు ఏవీ పచ్చమీడియా పట్టించు కోదు. 192 స్కిల్ హబ్‌ల ద్వారా పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తున్నాం. 95 వేల మందికి శిక్షణ ఇస్తే వారిలో 85 శాతం మందికి ఉద్యోగాలు ఇప్పించిన పరిస్థితి. మంత్రి మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చే శక్తి విద్య ఒక్కటే ...రాష్ట్రంలో పేదల తలరాతలు మారాలంటే విద్య ఒక్కటే సరైన మార్గం అని నమ్మి రాష్ట్రంలో ప్రతి విధ్యార్ధి ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షిస్తూ దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.యస్. జగన్ గారు విద్య ,ఉద్యోగం పై ప్రత్యేక దృష్టి పెట్టి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అమెరికాలో ఉండే ప్రవాసాంధ్రులందరినీ సంఘటితపరచి వచ్చే ఎన్నికలలలో మన పార్టీని బలోపేతం చేయాలనీ, పేదలకు ఆలంబనగా నిరంతరాయంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, జనాభాలో దాదాపు 90 శాతం మందికి నేరుగా అందుతున్న నగదు, అవినీతికి తావులేని స్వచ్ఛమైన పారదర్శక పాలన.. జనాదరణను సోషల్ మీడియా ద్వారా తెలియచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. మేం ఏది చెప్పినా ప్రజలు నమ్ముతున్నారనుకుంటున్నారు. అందుకే చెప్పిన అబద్ధాన్నే పది సార్లు చెబుదాం అనే సిద్ధాంతాన్ని నమ్ముకుని చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా బతుకుతోందని దుయ్యబట్టారు. కొంతకాలంగా రాష్ట్రంలోని ప్రగతి, రాష్ట్రానికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తున్నాయని, వారి రాతలు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా, ప్రజల ఆలోచన విధానాన్ని మార్చాలనే ప్రయత్నంలా కనిపిస్తోందని అన్నారు. వారు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా తిరిగి 2024 లో రాజన్న రాజ్యం తథ్యం అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్రం ప్రతిష్టను పెంచి గౌరవంగా తల ఎత్తుకునే విధంగా చేయగల నాయకుడు జన నేత శ్రీ వైయస్ జగన్ ఒక్కరే అని వారు ధీమాగా పేర్కొన్నారు. తమకు క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసు కాబట్టే ‘వైనాట్ 175’ అంటున్నామని అన్నారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కోన సాగిస్తూ ముఖ్యమంత్రి శ్రీ జగన్ నవరత్నాలు రూపంలో చేస్తున్న సుపరిపాలన భేషుగా ఉందని ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు వక్తలు అన్నారు. పేదల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేసిన మహానేత డాక్టర్ వైయస్ఆర్ అడుగుజాడల్లోనే నడుస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమర్థవంతమైన నాయకుడిగా మంచి చేయడాన్ని భారత దేశం మొత్తం ఒక కొలమానం గ చూడడాన్ని చాల గొప్పగా ఉందని ప్రసంశించారు. రానున్న 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుని, మళ్ళి శ్రీ జగన్ గారు ముఖ్యమంత్రి కావడం తథ్యమన్న ధీమాను వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మేరీల్యాండ్, వర్జీనియా, న్యూ జెర్సీ, డెలావేర్, నార్త్ కరోలినా రాష్ట్రముల వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటి సభ్యులు, ఇతర ప్రాంతాల నుండి అనేకులు పాల్గొన్నారు. రామ్ (RAAM) నాయకులు న్యూజెర్సీ నుంచి రామ్మోహన్ రెడ్డి ఎల్లంపల్లి , వర్జీనియా నుంచి శ్రీధర్ నాగిరెడ్డి ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. కళ్యాణి , శ్రీధర్ వన్నెంరెడ్డి తమ హొటల్ పారడైస్ ఇండియన్ కుసిన్ లో అందరికి పసందైన విందు భోజనంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆత్మీయ సమ్మెళనా కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. చివరగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రమేష్ రెడ్డి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. -
దేశ పర్యాటకానికి కేరళ ఎంతో కీలకం: మోదీ
-
గన్ షాట్ : అతనే ఒక ఆదర్శం
-
ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుని.. సిక్కోలుకు స్నేహితుడయ్యాడు!
దశాబ్దాలుగా ఉద్దానం నేలలో ఇంకిన కన్నీరే.. దాహార్తి తీర్చే జలధార కాబోతోంది. పలాసలో నిర్మితమవుతున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, హిరమండలం నుంచి వచ్చేందుకు ఉరకలేస్తున్న వంశధార ఉద్యానవనానికి కొత్త ఊపిరి పోస్తున్నాయి. బిడ్డల్ని దేశాలకు పంపి తీరంలో ఎదురుచూస్తున్న తల్లుల నిరీక్షణ ఆగనుంది. భావనపాడు పోర్టు, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ ఆ బతుకులను మార్చే సాధనాలుగా కనిపిస్తున్నాయి. బతుకంతా అద్దెలు కడుతున్న సామాన్యులకు ఆ యాతన తప్పనుంది. వేలాదిగా నిర్మితమవుతున్న జగనన్న ఇళ్లు వారికి కొత్త చిరునామా అందిస్తున్నాయి. అంతేనా.. వీధి బడి అమ్మ ఒడిలా కనిపిస్తోంది. ఆస్పత్రి ఆధునిక సదుపాయాలతో ఆదుకుంటోంది. పరిహారంలో పరిహాసాలు మాయమయ్యాయి. సంక్షేమాల్లో దళారులు పోయారు. మూడేళ్ల స్వల్ప కాలంలో కనిపించిన మార్పులివి. వేసిన ప్రతి ఓటుకు న్యాయం చేసేలా.. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేలా.. వచ్చిన ప్రతి విమర్శను తిప్పి కొట్టేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన దిగ్విజయంగా సాగుతోంది. అందుకు సిక్కోలే సాక్షి. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఏళ్లకు ఏళ్లు వెనుకబడిన జిల్లా అనే ముద్రను మోసిన సిక్కోలు ఇన్నాళ్లకు ప్రగతికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతంపై చూపిన ప్రేమ దశాబ్దాల నాటి ముద్రను చెరిపేస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం ఇలా అన్ని రంగాల్లో సిక్కోలును ముందుకు నడిపిస్తున్న సీఎం సోమవారం జిల్లాకు రానున్నారు. ఇక్కడ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 43.96 లక్షల మంది తల్లుల ఖాతాలకు అమ్మ ఒడి పథకంలో డీబీటీ ద్వారా బటన్ నొక్కి సుమారు రూ.6,594.6 కోట్లను జమ చేయనున్నారు. సీఎం జిల్లా పర్యటనకు ఇప్పటికే కోడి రామ్మూర్తి స్టేడియం వేదికగా నిలిచింది. జిల్లా అంతా ఆయన రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. వెనుకబాటుకు సరైన చికిత్స.. శ్రీకాకుళంలో వైద్యం అంటే వైజాగ్ వెళ్లాల్సిందే అనేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. నాడు–నేడు కింద 83 ఆస్పత్రులను రూ. 47కోట్లతో అభివృద్ధి చేశారు. పాతపట్నం 50 పడకల సామాజిక ఆస్పత్రిని రూ.4.2 కోట్లతో జొన్నవలస ఆస్పత్రిని 2.45కోట్లతో, లావేరులో రూ.1.2 కోట్లతో, సోంపేట సామాజిక ఆస్పత్రిని రూ.4.60కోట్లతో, బారువ సామాజిక ఆస్పత్రిని రూ. 5.60కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. జిల్లాలో కొత్తగా 1200 పోస్టులను భర్తీ చేశారు. రిమ్స్‌లోనూ ఆధునిక సదుపాయాలు కల్పించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద 2019–20లో 33,5855 మందికి రూ. 85.50కోట్లు, 2020–21లో 34,813 మందికి రూ.78.47కోట్లతో, 2021–22లో 39,306 మందికి రూ. 87.89కోట్లతో, 2022–23లో ఇప్పటివరకు 4,544మంది రూ.11.03 కోట్లతో వైద్య సేవలందించారు. నరసన్నపేట ఆస్పత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. గంగపుత్రుల బెంగ తీరేలా.. 193 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం నుంచి మత్స్యకారులు ఏటా వలస వెళ్తుంటారు. ఈ పరిస్థితిని రూపుమాపేందుకు ప్రభుత్వం జిల్లాలోనే ప లు ప్రాజెక్టులు నిర్మిస్తోంది. భావనపాడులో రూ. 3200కోట్లతో పోర్టు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. బుడగట్లపాలెంలో రూ.332 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపడుతున్నారు. మంచినీళ్లపేటలో జెట్టీ నిర్మాణం చేపడుతున్నారు. అన్నదాతకు వెన్నుదన్ను.. వ్యవసాయాధారిత జిల్లా అయిన శ్రీకాకుళానికి సాగునీటి వనరులకు కొదవ లేదు. కానీ వాటిని సమర్థంగా వినియోగించుకోవడంలోనే ఉంది చిక్కంతా. ఈ సమస్యలను పరిష్కరిస్తూ వంశధార, నాగావళి నీళ్లను ఉరకలెత్తిస్తున్నారు. నేరడీ బ్యారేజీ వివాదాన్ని కొలిక్కి తెచ్చారు. దీని కోసం ఒడిశా సీఎంతోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. మడ్డువలస రెండో దశ పనులకు రూ.26.65కోట్లు మంజూరు చేశారు. దీని ద్వారా అదనంగా 12,500 ఎకరాలకు ప్రధాన కుడి కాలువ ద్వారా సాగునీరు అందనుంది. వంశధార రిజర్వాయర్ నింపేందుకు గొట్టా బ్యారేజీ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఆ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అన్న మాట ప్రకారం.. తిత్లీ తుఫాన్ తర్వాత పరిహారం పంపిణీలో చాలా మంది అర్హులకు అన్యాయం జరిగింది. దీనిపై అప్పట్లోనే వైఎస్ జగన్ అదనపు సాయం చేస్తానని మాట ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకుంటూ తిత్లీ తుపానులో నష్టపోయిన వారికి ఏకంగా ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.3000, జీడి తోట హెక్టార్‌కు రూ.50 వేలు మంజూరు చేశారు. దీంతో జిల్లాలో 90,789 మందికి రూ.182.60 కోట్ల అదనపు పరిహారం అందించారు. అలాగే వంశధార నిర్వాసితులకు కూడా హామీ ఇచ్చినట్లుగా అదనంగా రూ.216.71 కోట్ల పరిహారాన్ని తాజాగా అందజేశారు. చదవండి: తొలుత డిమాండ్ చేసి.. ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించి శాశ్వత చిరునామా.. జిల్లాలో 1,10,825 మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలు అందజేశారు. వాటిలో మొదటి విడతగా 83,456 ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఊళ్లకు ఊళ్లనే కడుతున్నారు. శాశ్వతంగా నిలిచేలా.. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలతో ఇప్పటికే విద్యకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చిన సీఎం జిల్లాలోనూ శాశ్వతంగా నిలిచిపోయేలా పలు ప్రాజెక్టులు ప్రకటించారు. పొందూరులో డిగ్రీ కళాశాల, ఆమదాలవలస మండలం తొగరాంలో డిగ్రీ కళాశాల, సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలో వెటర్నరీ పాలిటెక్నికల్ కళాశాల, ఆమదాలవలస మండలం తొగరాంలో అగ్రికల్చరల్ పాలిటెక్నికల్ కాలేజీ ఏర్పాటు, ఆమదాలవలస కేజీబీబీ బాలికల పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేయడం, పొందూరులో బీసీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు, పలాసకు డిగ్రీ కళాశాల మంజూరు, పలాసలో ఫిషరీస్ కళాశాల అండ్ రీసెర్చ్ సెంటర్ మంజూరు, నరసన్నపేటలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణం వంటివి సీఎం జిల్లాపై చూపిస్తున్న అభిమానానికి తార్కాణాలు. నాడు–నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు పూర్తిగా మార్చేశారు. 2019–20లో 1247 పాఠశాలలను రూ.286.26 కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 2020–21లో 884 పాఠశాలలను రూ.258.70కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే 597 పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి. గ్రామ స్వరాజ్యం.. సిక్కోలులో గ్రామ స్వరాజ్యానికి నిలువెత్తు నిదర్శనాలుగా కొన్ని భవనాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో 833 సచివాలయాలతో పాటు 3154 కొత్త కార్యాలయ భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. రూ.810.32 కోట్లతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. 834 రైతు భరోసా కేంద్రాలు, 685 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, 802 అంగన్వాడీ భవనాలు, 2556 సీసీ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇటీవలే జిల్లాలో ఐదువేల మందికిపైగా సచివాలయ ఉద్యోగులు శాశ్వత ఉద్యోగులయ్యారు. ప్రగతి దారులు.. జిల్లాలో 480 కిలోమీటర్ల పొడవునా 79 ఆర్అండ్బీ రహదారులను రూ.129కోట్లతో నిర్మిస్తున్నారు. ఇందులో స్టేట్ హైవే 178.92 కిలోమీటర్లు, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు 302 కిలోమీటర్లు ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 890 కిలోమీటర్ల పొడవునా రూ.527కోట్లతో 436 పనులు చేపడుతున్నారు. ప్రత్యేక మరమ్మతుల కింద 275 కిలోమీటర్ల పొడవున రూ.73.25కోట్లతో 54 రోడ్లు బాగు చేస్తున్నారు. ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు వర్క్స్ కింద రూ.350 కోట్లతో 480 కిలోమీటర్ల పొడవున 312 రోడ్లను నిర్మిస్తున్నారు. ఏపీ గ్రామీణ రహదారుల రెన్యువల్ వర్క్స్ కింద రూ.50 కోట్లతో 200 కిలోమీటర్ల పొడవున 83 పనులు చేపడుతున్నారు. శ్రీకాకుళం నగరంలో రూ.5కోట్లతో 72 రహదారులు వేస్తున్నారు. చదవండి: నగదు డ్రా చేయడం రాని అమాయకులే టార్గెట్...ఏకంగా 14 ఏటీఎం కార్డులు.. -
అంబరం.. మూడేళ్ల సంబరం
అనంతపురం సప్తగిరి సర్కిల్: పాలనలో సమానత్వం.. ఇంటింటా నవరత్న వికాసం.. పల్లెల్లో ప్రగతి మంత్రం... మహిళల జీవితాల్లో ఆర్థిక వెలుగులు.. అర్హతే ప్రామాణికంగా పథకాల అమలు... సచివాలయ వ్యవస్థతో ఇంటి ముగింటకే సంక్షేమ పథకాలు... నాడు–నేడు అనేలా మారిన బడుల రూపురేఖలు.. అన్నదాతకు భరోసాతో వ్యవ‘సాయం’... విద్యారంగంలో సంస్కరణల విప్లవం... పారిశామ్రిక పురోగతి దిశగా అడుగులు.. ఇలా ఒకటేమిటి మూడేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో సంక్షేమ, అభివృద్ధి మైలు రాళ్లు ఎన్నో కనిపిస్తాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం సంబరాలు మిన్నంటాయి. కళ్యాణదుర్గం మండలం చాపిరిలో మంత్రి ఉషశ్రీచరణ్ కేక్‌కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అంతకు ముందు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. రాయదుర్గంలోని వినాయక్ సర్కిల్లో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, బ్రెడ్డు పంపిణీ చేశారు. అనంతపురంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ మహమ్మద్ వసీంసలీం తదితరులు పాల్గొన్నారు. శింగనమల నియోజకవర్గం నార్పల మండలం మద్దలపల్లిలో వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి పంచారు. రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో వైస్ ఎంపీపీ రామాంజినేయులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తాడిపత్రిలోని పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్ కేతిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. (చదవండి: సామాజిక న్యాయం 'దశ దిశలా'.. ) -
‘111’ మాస్టర్ ప్లాన్ ఎలా ఉండాలంటే?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ తాగు నీటి అవసరాల కోసం ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గింది. అలాగే నగర అభివృద్ధి ఫలాలు 111 జీవో పరిధిలోని గ్రామస్తులూ కోరుకోవటం న్యాయమైన హక్కే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ జీవోను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో 111 జీవో పరిధిలోని 84 గ్రామాలకు ప్రత్యేక మాస్టర్‌ను రూపొందిస్తామని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ మాస్టర్ ప్లాన్ ఎలా ఉండాలి? ఏ తరహా నిర్మాణాలు ఉండాలనే అంశంపై తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జీవీ రావు ‘సాక్షి రియల్టీ’తో మాట్లాడారు. ∙ 217 చదరపు కిలో మీటర్ల హైదరాబాద్ విస్తీర్ణానికి రెండున్నర రెట్లు అధికంగా 538 చ.కి.మీ మేర 111 జీవో పరిధి విస్తరించి ఉంది. సుమారు 1.32 లక్షల ఎకరాల భూమి అదనంగా అందుబాటులోకి రానుంది. భవిష్యత్తు తరాల కోసం జంట జలాశయాలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా 111 జీవో మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలి. ఆ తర్వాతే పర్యావరణానికి హానీ కలిగించని నిర్మాణాలకు చోటు కల్పించాలి. తక్కువ సాంద్రత కలిగిన నివాస, సంస్థాగత, వినోదాత్మక కేంద్రాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఉండాలి. వర్షపు నీరు, జలచరాల అధ్యయన నివేదికను పరిగణనలోకి తీసుకోవాలి. 111 జీవో మాస్టర్ ప్లాన్‌లో ఆయా అధ్యయన ఫలితాలకు కూడా అవకాశం కల్పిం చాలి. 111 జీవో మాస్టర్ ప్లాన్‌లో నెట్ జీరో సీవరేజ్ పాలసీని అవలంభించాలి. అంటే ప్రతి ఇంటికి తప్పనిసరిగా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) ఉండాల్సిందే. తద్వారా మురుగు నీరు బయటికి వెళ్లదు. జంట జలాశయాలు కలుషితం కావు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్విరాన్మెంటల్ సెన్సిటివ్ జోన్లను అధ్యయనం చేయాలి. అక్కడ స్టీల్, సిమెంట్ వంటి భవన సామగ్రి స్థానంలో ప్రత్యామ్నాయం వినియోగిస్తారు. కలప ఇళ్లు ఉంటాయి. ఉష్ణోగ్రతలు పెరగకుండా ఉంటాయి. ఈ తరహా జోన్లను సందర్శించి ఆ ప్రకారం చేయాలి. కాంప్లిమెంటరీ డెవలప్మెంట్.. హైదరాబాద్ అభివృద్ధికి 111 జీవో కాంప్లిమెంటరీగా ఉండాలి. ఆకాశహర్మ్యాలకు, ఐటీ భవనాలకు అనుమతి ఇచ్చి ఇప్పుడున్న ప్రాంతాలకు పోటీగా కాకుండా నగరానికి కొత్త ప్రాంతం కాంప్లిమెంటరీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పోటీగా ఉంటే మాత్రం ఇప్పుడున్న ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ తగ్గే అవకాశాలున్నాయి. ఆయా గ్రామాలలో చాలా వరకు భూములు కొనుగోలు చేసి ఫామ్‌హౌస్‌లను నిర్మించడం వల్ల హైదరాబాద్ స్థిరాస్తి వ్యాపారంపై పరిమిత స్థాయిలో ప్రభావం ఉంటుంది. ఒకవేళ 111 జీవో పరిధిలో హైరైజ్ భవనాలకు అనుమతి ఇస్తే గనక.. హైదరాబాద్ ఉష్ణోగ్రతపై ప్రతికూల ప్రభావం చూపించడంతో పాటూ కాలుష్యం పెరుగుతుంది. జంట జలాశయాలు మరో హుస్సేన్‌సాగర్ లాగా మారే ప్రమాదం ఉంది. స్వయం సమృద్ధితో కూడిన సౌకర్యాలతో పారిశుధ్యం, రోడ్లను మెరుగుపరచాలి. లేకపోతే అవి మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లాగా తయారవుతాయి. నగరంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా గ్రామీణ వాతావరణాన్ని కల్పించవచ్చు. దేశంలోనే ఉత్తమ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చు. హెచ్ఎండీఏ ఏరియాలో విలీనం కావటానికి ఇప్పటికే ఉన్న భవనాలను ఒకేసారి క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంటుంది. ఐదు జోన్లతో అద్భుతం.. ► జంట జలాశయాల నుంచి కొన్ని కి.మీ మేర బఫర్ జోన్. ఇక్కడ రిసార్ట్‌లకు అనుమతి ఉండాలి. ► రెండోది స్పోర్ట్స్ జోన్. ఇక్కడ ఆట స్థలాలు, క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ► స్టీల్, సిమెంట్ వంటి వాటితో కాకుండా ప్రత్యామ్నాయ నిర్మాణ సామగ్రితో కూడిన నిర్మాణాలు మూడో జోన్. ఉదాహరణ: విద్యా సంస్థలు. ► ఫోర్త్ జోన్లో తక్కువ సాంద్రత కలిగిన గృహ నిర్మాణాలు, వినోద కేంద్రాలు. ఇవి కూడా ప్రత్యామ్నాయ నిర్మాణ సామగ్రితో నిర్మితమైనవై ఉండాలి. ► ఐదో జోన్లో మాత్రమే ఐటీ, బహుళ అంతస్తులకు అనుమతి ఉండాలి. దీంతో అన్ని జోన్లలో కార్యకలాపాలు జరుగుతాయి. ఆయా గ్రామస్తులు పెరిగిన భూముల రేట్ల ప్రయోజనాన్ని పొందుతారు. -
YS Jagan: అభివృద్ధిలో టాప్‌గేర్
సాక్షి, కడప: వెనుకబడిన ప్రాంతమైన వైఎస్సార్ జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని, వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులతో బద్వేలు, కడప రూపురేఖలు మారుస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన వైఎస్సార్ జిల్లా బద్వేలు, కడపలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తొలుత బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో వెనుకబడిన నియోజకవర్గాల్లో బద్వేలు ఒకటన్నారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు, దివంగత ప్రియతమ నేత నాన్న గారి హయాంలో మాత్రమే ఈ నియోజకవర్గానికి మంచి జరిగిన పరిస్థితి కనిపించిందని చెప్పారు. అప్పట్లో బ్రహ్మంసాగర్‌లో 14 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేశారన్నారు. ఆ తర్వాత నాలుగైదు టీఎంసీలకు మించి నీళ్లు నిల్వ చేయలేదన్నారు. పాలకుల్లో చిత్తశుద్ధి లోపించడం, మంచి చేయాలనే తపన లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. బ్యాట్ పట్టి.. షాట్ కొట్టి.. కడప అర్బన్ / స్పోర్ట్స్: తాత వైఎస్ రాజారెడ్డి పేరుతో తండ్రి నిర్మించిన స్టేడియంలో మనవడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బ్యాట్ పట్టుకుని బరిలోకి దిగారు. చూడముచ్చటైన షాట్లతో అలరించారు. ఈ అద్భుతమైన సన్నివేశం కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో చోటుచేసుకుంది. ఈ మైదానంలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల ఆవిష్కరణ, రూ.4 కోట్లతో ఫ్లడ్‌లైట్ల నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం సీఎం జగన్ బ్యాట్ పట్టుకుని క్రీజ్‌లో నిలుచున్నారు. తొలుత కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి బంతిని తిన్నగా వేయగా.. నిబంధనల మేరకు వికెట్ వైపు నుంచే బంతిని వేయాలని సూచించారు. దీంతో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడిన వేణుగోపాల్, మధుసూదన్‌లు బౌలింగ్ చేయడంతో సీఎం జగన్ బ్యాట్ ఝుళిపించారు. అనంతరం ఆంధ్రా క్రికెట్ సంఘం ప్రతినిధులతో గ్రూప్ ఫొటో దిగారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. బ్రహ్మంసాగర్ ఎప్పుడూ నిండుకుండలా ఉండాలి దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో రెండేళ్లుగా ఇదే బ్రహ్మంసాగర్ నిండు కుండలా ఉందని సీఎం జగన్ అన్నారు. ఎప్పుడూ ఇలానే ఉండాలనే ఉద్దేశంతో ప్రాజెక్టుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు, చిక్కుముడులను తీర్చేలా అడుగులు వేస్తున్నామని తెలిపారు. గత పాలకుల హయాంలో వెలుగోడు ప్రాజెక్టు 0–18 కిలోమీటర్ల వరకు కెనాల్ లైనింగ్ పనులను పట్టించుకోలేదన్నారు. దీంతో నీళ్లు కిందకు రాని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఈ పరిస్థితి మారిస్తే తప్ప బ్రహ్మంసాగర్‌కు సెక్యూరిటీ ఉండదని భావించి రూ.300 కోట్లు మంజూరు చేసి, లైనింగ్ పనులు ప్రారంభించి దాదాపు 80 శాతం పూర్తి చేశామన్నారు. దేవుడు ఆశీర్వదిస్తే అక్టోబర్ నాటికి లైనింగ్ పూర్తయి, నీళ్లు నేరుగా బ్రహ్మంసాగర్‌కు వచ్చేలా చూస్తామని చెప్పారు. బ్రహ్మంసాగర్ ఎప్పుడూ నిండు కుండలా ఉండాలని భావించి, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే కుందూ నది మీద లిఫ్ట్ ప్రాజెక్టు పనులకు రూ.564.60 కోట్లతో శ్రీకారం చుట్టామని తెలిపారు. రెండేళ్లలో పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పోరుమామిళ్ల బైపాస్ రోడ్డులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ..500 కోట్లతో అభివృద్ధి పనులు బద్వేలు నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించి రూ.500 కోట్లతో పనులు చేస్తున్నాం. దీంతో నియోజకవర్గం రూపురేఖలు మారతాయి. బద్వేలు పట్టణంలో రూ.130.60 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు శ్రీకారం చుట్టాం. పట్టణంలో సుమారు 140 కిలోమీటర్ల పొడవుతో కొత్త సీసీ రోడ్లతో పాటు మూడు పార్కులు, కూరగాయలు.. చేపల మార్కెట్, మూడు వాణిజ్య సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. ఆరు శ్మశాన వాటికల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాం. ►రూ.79.67 కోట్లతో దిగువ సగిలేరు ఎడమ ప్రధాన కాలువను 23 కిలోమీటర్ల మేర వెడల్పు చేసే పనులకు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం. దీని ద్వారా బద్వేలు, బి.కోడూరు మండలాల్లో 35 చెరువులకు ఏటా నీళ్లు నింపుకునే వెసులుబాటు కలుగుతుంది. ►బ్రహ్మంసాగర్ ఎడమ, కుడి కాలువలకు సంబంధించి రూ.37.452 కోట్లతో పెండింగ్ పనులు చేపడుతున్నాం. తద్వారా 30 వేల ఎకరాల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందించొచ్చు. మరోవైపు బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ ఆనకట్టకు ప్లాస్టిక్ కాంక్రీట్ డయాఫ్రం కటాఫ్ వాల్ నిర్మాణ పనులకు రూ.46.68 కోట్లతో శంకుస్థాపన చేస్తున్నాం. ఇవన్నీ పూర్తయితే జలాశయాన్ని పూర్తి స్థాయిలో నింపొచ్చు. ►మనం వచ్చాక పూర్తి స్థాయిలో నీటిని పెట్టడంతో అక్కడక్కడ కొద్దిగా లీకేజీలు కనిపించాయి. వీటిని అరికట్టేందుకు రూ.46.68 కోట్లతో మరమ్మతులు చేస్తున్నాం. దీంతో 17 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఏర్పడుతుంది. సభకు హాజరైన ప్రజలు మూడు ఎత్తిపోతల పథకాలు ►రూ.35.90 కోట్లతో బ్రహ్మంసాగర్ ఎడమ కాలువలో మూడు ఎత్తిపొతల పథకాలను ఏర్పాటు చేస్తున్నాం. వీటి ద్వారా 8,268 క్యూబిక్ మీటర్ల నీటిని సముద్ర మట్టానికి 278 మీటర్ల ఎత్తున ఉన్న ఇటుకలపాడు, సావిశెట్టిపల్లె, కొండ్రాజుపల్లె, వరికుంట్ల, గంగన్నపల్లె చెరువులకు తరలించొచ్చు. తద్వారా కాశినాయన మండలంలోని పలు గ్రామాల్లో 3,500 ఎకరాల ఆయకట్టును సాగులోకి తీసుకురాబోతున్నాం. ►రూ.పది కోట్ల వ్యయంతో ఐదు గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సంబంధించి ఐదు సబ్స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం. పోరుమామిళ్ల పట్టణ పరిధిలో 3.6 కిలోమీటర్ల మేర రెండు లేన్ల రోడ్లను నాలుగు లేన్ల రోడ్డుగా రూ.25 కోట్లతో విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తున్నాం. ►రూ.20 కోట్లతో సగిలేరు నది మీద వేమలూరు వద్ద వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం. దీంతో 30 గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుంది. బ్రహ్మణపల్లె సమీపంలో సగిలేరు నదిపై రూ.9.50 కోట్లతో మరో వంతెన నిర్మిస్తున్నాం. దీనివల్ల కలసపాడు మండలంలోని నాలుగు గ్రామాలతో పాటు ప్రకాశం జిల్లాకు కూడా రవాణా మెరుగవుతుంది. ►బద్వేలు మార్కెట్ యార్డులో బద్వేలు, పోరుమామిళ్లలో రెండు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రైతుల కోసం రెండు గోదాములను నిర్మించే పనులకు శంకుస్థాపన చేస్తున్నాం. ►బద్వేలులో ప్రసన్నవెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ ఆది చెన్నకేశవ దేవాలయంతో పాటు కాశినాయన మండలంలో మరో ఆరు దేవాలయాల అభివృద్ధి పనులకు రూ.4.70 కోట్లతో శంకుస్థాపనలు చేస్తున్నాం. ఈ నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువే ►బద్వేలు నియోజకవర్గ వాసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆర్డీఓ కార్యాలయాన్ని మంజూరు చేస్తున్నాం. ఇదే విషయాన్ని ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎప్పటి నుంచో అడుగుతున్నారు. వారి కోరిక మేరకు మంజూరు చేస్తున్నాం. ►బద్వేలులో రూ.5 కోట్లతో ఆర్అండ్బీ బంగ్లా, రూ.15 కోట్లతో పంచాయతీ రాజ్ రోడ్లు, ఎంపీడీఓ, తహశీల్దార్, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల కోసం మంజూరు చేస్తున్నాం. బద్వేలు మండలం వీరబల్లి, కొత్త చెరువు ఎత్తిపొతల పథకానికి రూ.50 లక్షలు అందిస్తున్నాం. ►నియోజకవర్గంలో ఇండ్రస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తే ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కల్పించే అవకాశాలు మెరుగవుతాయని మాజీ ఎమ్మెల్సీ కోరారు. ఆయన విన్నపం మేరకు మంజూరు చేస్తున్నాం. ►కడప జిల్లాకు ఎంత చేసినా తక్కువే. జిల్లా ప్రజలు నన్నెప్పుడూ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. మీరిచ్చిన చలువ వల్లనే ఈరోజు నేను రాష్ట్రం వైపు చూడగలుగుతున్నాను. మీ ఆదరణ, ప్రేమ, ఆప్యాయత ఎప్పటికీ మరిచిపోలేను. ప్రతి ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు. కడపలోని వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో వైఎస్సార్, రాజారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం జగన్ ఇక అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలతో ఈ జిల్లాకు మంచి రోజులు వచ్చాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్వేగంగా చెప్పారు. నాన్నగారి మరణం తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ కడపలో అభివృద్ధి పనులు చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఇకపై అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మంచి నగరాల జాబితాలో కచ్చితంగా కడప ఉంటుందని భరోసా ఇచ్చారు. రెండో రోజు జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ఆయన కలెక్టరేట్ సమీపంలోని మహావీర్ సర్కిల్లో రోడ్లను ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభనుద్దేశించి మాట్లాడుతూ.. కడప నగరంలో దాదాపు రూ.459.29 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం సంతోషంగా ఉందన్నారు. గతంలో శంకుస్థాపన చేసిన పనులను కూడా వేగవంతం చేయనున్నట్లు వెల్లడించారు. ఇంకా సీఎం ఏమన్నారంటే.. కడపలో అభివృద్ధి పనులు ఇలా.. ►జిల్లా కేంద్రమైన కడపలో మహావీర్ సర్కిల్ నుంచి పుట్లంపల్లె వరకు ఆరు వరుసలతో 80 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం.. రైల్వేస్టేషన్ నుంచి మహావీర్ సర్కిల్ వరకు నాలుగు లేన్లతో 60 అడుగుల వెడల్పుతో మరో రోడ్డు.. ఈ రెండు రోడ్లను సుమారు రూ.80 కోట్లకు పైగా వెచ్చించి అద్భుతంగా తీర్చిదిద్ది ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ►ఇదే తరహాలో కడప నగరంలో మరికొన్ని రోడ్లను విస్తరించాలని సంకల్పించి శంకుస్థాపనలు చేస్తున్నాం. రూ.101 కోట్లతో కృష్ణా సర్కిల్ నుంచి దేవుని కడప వరకు రోడ్డును విస్తరిస్తున్నాం. అన్నమయ్య సర్కిల్ నుంచి కృష్ణా సర్కిల్ మీదుగా గోకుల్ సర్కిల్ వరకు రూ.74 కోట్లతో రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశాం. ►అంబేడ్కర్ సర్కిల్ నుంచి వై జంక్షన్ వరకు విస్తరణకు రూ.62 కోట్లు కేటాయించాం. ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి పుట్లంపల్లె వరకు రోడ్డు విస్తరణ పనులను రూ.9.90 కోట్లతో చేపట్టనున్నాం. బుగ్గవంక కష్టాలు రాకుండా చర్యలు ►బుగ్గవంక వరద కష్టాలు నాకు తెలుసు. నాన్నగారి హయాంలో బుగ్గవంక నుంచి ప్రమాదం లేకుండా ఉండేందుకు ఐదు హైలెవెల్ బ్రిడ్జిలు, రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. అనంతరం వచ్చిన పాలకులు ఎవరూ పట్టించుకోలేదు. ►మరోసారి బుగ్గవంక వరద పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు రూ. 49.60 కోట్లతో పెండింగ్ పనులు పూర్తి చేస్తాం. చెర్లోపల్లె, పుట్లంపల్లె, బుడ్డాయపల్లె, రామనపల్లె చెరువుల సుందరీకరణ పనులను రూ.5.73 కోట్లతో చేపట్టనున్నాం. ►చిన్నపాటి వర్షాలు కురిసినా నగరంలోని ఆర్కే నగర్, తిలక్‌నగర్, మృత్యుంజయకుంట, ఎస్బీఐ కాలనీ, ఎన్జీఓ కాలనీ, ఏఎస్ఆర్ నగర్, గంజికుంట తదితర కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారంగా వరద నీటి కాలువల (స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్) నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాం. సూపర్ స్పెషాలిటీగా రిమ్స్.. ►రిమ్స్‌ను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చేలా నిర్ణయించి రూ.125 కోట్లతో వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శిలాఫలకం వేశాం. ఆ పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. డాక్టర్ వైఎస్సార్ మానసిక చికిత్సాలయానికి సంబంధించి సుమారు రూ.40 కోట్లతో పనులను యుద్ధ ప్రాతిపదికన చేయించేలా చర్యలు తీసుకుంటున్నాం. ►డాక్టర్ వైఎస్సార్ కేన్సర్ కేర్ సెంటర్‌కు సంబంధించి టెండరు ప్రక్రియ జరుగుతోంది. కడపలో రాజీవ్ మార్గ్ పనులు సుమారు రూ.4 కోట్లతో జోరుగా జరుగుతున్నాయి. దేవుని కడప చెరువు సుందరీకరణకు రూ.55 కోట్లు కేటాయించాం. ప్రస్తుతం రివర్స్ టెండరింగ్ దశలో ఉంది. నెల రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసుకుని అద్భుత నిర్మాణాలకు శ్రీకారం చుడతాం. ►కడప, బద్వేలు కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, కడప నగర మేయర్ సురేష్‌బాబు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, అధికారులు పాల్గొన్నారు. సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో తామ్రపత్రాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదర్శనీయుడు బ్రౌన్ కడప కల్చరల్ : తెలుగు భాషాసాహిత్యాన్ని కాపాడిన ఆంగ్లేయుడు, తెలుగుభాషాభిమాని చార్లెస్ ఫిలిఫ్ బ్రౌన్ తెలుగు భాషాసాహితీ వేత్తలకు ఆదర్శనీయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. యోగివేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ కేంద్రం ఆవరణలో జానమద్ది సాహితీ పీఠం మేనేజింగ్ ట్రస్టీ, బ్రౌన్ గ్రంథాలయ సలహా మండలి సభ్యుడు జానమద్ది విజయభాస్కర్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన బ్రౌన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ బ్రౌన్ లేని తెలుగు సాహిత్యాన్ని ఊహించుకోలేమని, ఆయన బాషా సాహిత్య సేవలు తరతరాలకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. అనంతరం ఛాయా చిత్ర ప్రదర్శన, తాళపత్ర గ్రంథాలు, రాత పరికరాలు, అరుదైన గ్రంథాలను తిలకించారు. ఈ కేంద్రం విస్తరణలో భాగంగా ప్రముఖ ఆడిటర్ సంపత్‌కుమార్ కుమార్తె చిత్రకూటం అమృతవల్లి సౌజన్యంతో రూ.5.50 కోట్లతో నిర్మించ తలపెట్టిన నూతన భవన నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమృతవల్లిని సత్కరించారు. బ్రౌన్ విగ్రహాన్ని రూపొందించిన జిల్లాకు చెందిన ప్రముఖ శిల్పి గొల్లపల్లి జయన్నను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం బ్రౌన్ కేంద్రం బాధ్యులు ముఖ్యమంత్రికి బ్రౌన్ గ్రంథాలయ రజతోత్సవ సంచికలను అందజేశారు. -
పుట్టినగడ్డకూ బాబు 'వెన్నుపోటు'
సాక్షి, అమరావతి: తాను జన్మించిన ప్రాంతమంటే సహజంగానే ఎవరికైనా కాస్తంత ప్రేమ ఉంటుంది. ఎంతదూరంలో ఉన్నా ఆ మమకారం పోదు. వీలైతే సొంతగడ్డకు సేవ చేసి రుణం తీర్చుకోవాలి. పోనీ అది కుదరలేదనుకుంటే కనీసం అపకారం తలపెట్టకూడదు. టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం సొంత జిల్లా చిత్తూరు అభివృద్ధినే అడ్డుకుంటున్నారు. తాను చేయకపోగా ఇతరులు సంకల్పిస్తే సహించలేకపోతున్నారు. లక్ష ఎకరాలకుపైగా సస్యశ్యామలం చేసే ప్రాజెక్టును నిలిపివేయాలంటూ తాజాగా ఎన్జీటీలో ఆ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషనే ఇందుకు నిదర్శనం. ప్రాజెక్టును ఆపాలంటూ టీడీపీ పిటిషన్.. గాలేరు–నగరి, హంద్రీ–నీవాలను అనుసంధానం చేసి దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడు రిజర్వాయర్లతో కూడిన ప్రాజెక్టును నిలుపుదల చేయాలంటూ టీడీపీ నేత, చిత్తూరు జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు జి.గుణశేఖర్‌నాయుడుతోపాటు ఆ పార్టీకే చెందిన 13 మంది నేతలతో జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ), చెన్నై బెంచ్‌లో చంద్రబాబు రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవని, పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన ఈ ప్రాజెక్టును నిలుపుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఎన్జీటీని అభ్యర్థించారు. కేంద్ర జలసంఘానికి, కేంద్ర జల్ శక్తి శాఖకూ ఫిర్యాదులు చేశారు. ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు, పర్యావరణ అనుమతులు లేకున్నా రాష్ట్ర ప్రభుత్వం పనులు చేస్తోందని, వీటిని వెంటనే నిలిపివేసేలా ఆదేశించాలని ఎన్జీటీలో గత నెల 27న రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే చిత్తూరు జిల్లాలోని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాల్లో 1.10 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి. తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది. దుర్భిక్ష పశ్చిమ మండలాల రూపురేఖలను సమూలంగా మార్చేసే ఈ ప్రాజెక్టును అడ్డుకునే యత్నం చేయడం ద్వారా చివరకు సొంత జిల్లా ప్రజలకూ చంద్రబాబు అన్యాయం చేశారనే విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి. అనుసంధానంతో... హంద్రీ– నీవా ద్వారా చిత్తూరు జిల్లాకు నీళ్లు రావడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో గాలేరు–నగరి, హంద్రీ–నీవాలను అనుసంధానం చేయడం ద్వారా ఎనిమిది టీఎంసీలను తరలించి చిత్తూరు జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. కండలేరు నుంచి నీటిని తరలించి చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నారు. తద్వారా జిల్లా మొత్తాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నిస్తుంటే చంద్రబాబు సొంత ప్రాంతం అభివృద్ధినే అడ్డుకుంటూ కేసులు దాఖలు చేయిస్తున్నారు. ఇది పూర్తిగా దిగజారుడుతనానికి నిదర్శనమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ ప్రాజెక్టు.. ►వైఎస్సార్ కడప జిల్లాలో గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం ప్రధాన కాలువలో 56 కి.మీ. నుంచి రోజుకు రెండు వేల క్యూసెక్కుల చొప్పున హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి ఎత్తిపోస్తారు. దీన్ని చక్రాయిపేట ఎత్తిపోతలుగా వ్యవహరిస్తారు. ఇందులో 450 క్యూసెక్కులను రాయచోటి నియోజకవర్గం సాగు, తాగునీటి అవసరాల కోసం సరఫరా చేస్తారు. మిగతా 1,550 క్యూసెక్కుల్లో 800 క్యూసెక్కులను హంద్రీ–నీవా రెండో దశలోని పుంగనూరు బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు, 750 క్యూసెక్కులను అడవిపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తారు. ►అడవిపల్లి రిజర్వాయర్ నుంచి రోజుకు 800 క్యూసెక్కుల చొప్పున 120 రోజుల్లో 8 టీఎంసీలను పీబీసీకి తరలిస్తారు. పీబీసీలో 125.4 కి.మీ వద్ద నుంచి గ్రావిటీ ద్వారా కొత్తగా 2 టీఎంసీల సామర్థ్యంతో చిత్తూరు జిల్లా పశ్చిమాన కురుబలకోట మండలం ముదివేడు వద్ద నిర్మించే రిజర్వాయర్‌ను నింపుతారు. ఈ జలాశయం కింద 20 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందిస్తారు. 15 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిస్తారు. ►పీబీసీలో 180.4 కి.మీ నుంచి నీటిని ఎత్తిపోసి పుంగనూరు మండలం నేతిగుంటపల్లి వద్ద ఒక టీఎంసీ సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్‌ను నింపుతారు. ఈ రిజర్వాయర్ కింద కొత్తగా పది వేల ఎకరాలకు నీళ్లందిస్తారు. ఐదు వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిస్తారు. ►పీబీసీలో 210 కి.మీ నుంచి గ్రావిటీపై నీటిని తరలించి సోమల మండలం ఆవులపల్లి వద్ద 3.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్‌ను నింపుతారు. ఈ రిజర్వాయర్ పనులకు రూ.667.20 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దీనిద్వారా కొత్తగా 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తారు. 20 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ఈ పనులకు ఆగస్టులో టెండర్లు నిర్వహించిన ప్రభుత్వం మూడేళ్లలోగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఆది నుంచి అదే నైజం.. 1995 నుంచి 2004 వరకూ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కృష్ణా బేసిన్లో ఎగువన కర్ణాటక అక్రమంగా ఆల్మట్టి ప్రాజెక్టును నిర్మిస్తుంటే నోరు మెదపకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. కర్ణాటక ప్రభుత్వం చిత్రావతిపై పరగోడు.. పెన్నాపై నాగలమడక బ్యారేజీలను నిర్మిస్తూ దుర్భిక్ష అనంతపురం జిల్లా ప్రజల నోళ్లు కొడుతుంటే నిర్లిప్తంగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన తర్వాత పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల ఎత్తిపోతల సహా ఎనిమిది అక్రమ ప్రాజెక్టులను చేపట్టి 178.93 టీఎంసీల కృష్ణా జలాలను తెలంగాణ అక్రమంగా తరలిస్తుంటే ఓటుకు కోట్లు కేసుల భయంతో నోరు విప్పలేదు. ఇప్పుడు సొంత జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టును స్వాగతించకుండా అడ్డుపుల్లలు వేయడం ద్వారా తన వైఖరిని మరోసారి రుజువు చేసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత వినోద్ కుమార్‌దే: మంత్రి
సాక్షి, కరీంనగర్: జిల్లాకు స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్‌దేనని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకొని నగరాభివృద్ధికి కృషి చేస్తున్న ఆయనకు ప్రత్యేక అభినంద తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయంతో విప్లవాత్మకమైన రెవెన్యూ చట్టాన్ని తెచ్చారు. సీఎం కేసిఆర్ ఎలాంటి చట్టాన్ని ప్రవేశ పెట్టిన ప్రజల శ్రేయస్సు కోసమే. భూమి తగాదాలను నివారించడం కోసం కేసీఆర్ ఈ చట్టన్ని రూపొందించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తుంది. ఎన్నో ఏళ్ళనాటి భూ సమస్యలకు ఈ చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుంది. కరీంనగర్ జిల్లా అధికార యంత్రాంగం, రాజకీయ యంత్రాంగం కలిసి టీమ్ వర్క్‌గా పని చేస్తున్నాం. ఈ టీమ్‌ను ప్రజల సేవ కోసం సీఎం కేసీఆర్ తయారు చేశారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ది బాటలో తీర్చిదిద్దడమే టీం ప్రధాన లక్ష్యం. (బీజేపీకి తెలంగాణలో భవిష్యత్ లేదు) కరీంనగర్ నగర ప్రజలకు సాగు, త్రాగు నీటికి ఎలాంటి ఇబ్పంది లేదు. ఇది శుభ పరిణామం. గతంలో అడవులకు పుట్టినిల్లు కరీంనగర్ జిల్లా. జిల్లాల విభజనతో కరీంనగర్‌కు అడవుల శాతం తగ్గింది. 33 జిల్లాల్లో అతి తక్కువ అడవులు ఉన్న జిల్లాగా మారింది. కాంక్రీట్ జంగల్‌గా మారిన జిల్లాలో యుద్ద ప్రాతిపదిక మొక్కలు నాటుతున్నాం. జిల్లా వ్యాప్తంగా 6వ విడుతలో 55 లక్షల మొక్కలు నాటడానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 43.85 లక్షల మొక్కలను నాటాం. 15 రోజుల సమయంలో మిగిలిన మొక్కలు నాటి టార్గెట్ పూర్తి చేస్తాం. రానున్న రెండు సంవత్సరాల్లో వనాలకు పుట్టినిల్లుగా కరీంనగర్‌ను మారుస్తాం. సీఎం చొరవతో అందమైన రోడ్లు వేశాం. చిరకాల వాంఛ అయిన మంచి నీటిని ప్రతి రోజూ అందిస్తున్నాం. రానున్న రోజుల్లో 24/7 అందిస్తాం. నగరంలో పారిశుధ్యాన్ని మెరుగు పరిచాం. ప్రజల కోసం 15 ఈ-టాయిలెట్లను అందుబాటులోకి తెస్తున్నాం. ఈ రోజు రెండు ప్రారంభించాం. నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం. నగరంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను కూడా ప్రజలకు త్వరలో అందుబాటులోకి తెస్తాం. ఇప్పటికే వాటికి సంబంధించిన డీపీఆర్ తయారు చేశాం. త్వరలోనే కేబుల్ బ్రిడ్జ్‌ను ప్రారంభించేందుకు ఆలోచన చేస్తున్నాం. దసరాలోగా ముఖ్యమంత్రి అనుమతి మేరకు ప్రారంభించి అందుబాటులోకి తెస్తాం. ప్రజల సహకారంతో రానున్న రోజుల్లో ఉత్తర తెలంగాణలో ఆదర్శమైన జిల్లాగా కరీంనగర్‌ను అభివృద్ధి చేస్తాం' అని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. -
కరోనాతో అభివృద్ధి ఆగరాదు: మోదీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు టీకా తయారయ్యేంత వరకూ దానిపై పోరు తప్పదని అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిస్థాయిలో ముందుకు తీసుకెళ్లాల్సిందేనని ప్రధాని నరేంద్రమోడీ గురువారం స్పష్టం చేశారు. మణిపూర్ నీటి సరఫరా పథకానికి వీడియో లింక్ ద్వారా శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాలు ఈ దేశ సరికొత్త అభివృద్ధి చోదకశక్తిగా మారే సామర్థ్యం ఉందని అన్నారు. కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వం పనిచేస్తూనే ఉందని చెప్పేందుకు మణిపూర్ నీటి సరఫరా పథకానికి శంకుస్థాపన ఒక ఉదాహరణ అని అన్నారు. -
'నా కళ్లలో వెయ్యి ఓల్టేజీల కాంతి నింపింది'
సాక్షి, సిద్ధిపేట: లబ్ధిదారులకు ప్రభుత్వం తరపున మంజూరైన వివిధ వాహనాలను ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ గ్రామం చింతమడకలో ప్రజల ఆర్థిక అభివృద్ధికి వాహనాలు, గేదెలు, కోళ్ల ఫామ్, హార్వెస్టార్, జేసీబీ, మినీ గూడ్స్ లాంటి ఇతర వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక, మాచాపూర్, సీతారాం పల్లి గ్రామాల ప్రజలకు వాహనాలను పంపిణీ చేయడం నా కళ్లలో వెయ్యి ఓల్టేజీల కాంతి నింపిందని అన్నారు. వాహనాలను భద్రంగా చూసుకుంటూ.. అప్పులు తీర్చుకొని ఓనర్లుగా మారాలని వారిలో స్ఫూర్తి నింపారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. రాబోయే రోజుల్లో మీరే ఇతరులకు అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. అప్పుడే మనం కేసీఆర్‌కు గిఫ్ట్ ఇచ్చిన వారమవుతామని అన్నారు. సీఎం మనకు అప్పగించిన వాటిని నమ్మకంతో ఉపయోగించుకొని ముందుకు వెళ్దామన్నారు. త్వరలో చింతమడకలో పాలశీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. గ్రామంలో రూ. 2.50 కోట్ల నిధులతో శివాలయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. మీరు కోరుకున్న రంగాల్లో మీకు అవకాశాలు కల్పిస్తామని.. అందివచ్చిన అవకాశాన్ని అందరూ వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు దక్కుతాయని ఎవరూ అదైర్యపడొద్దని సూచించారు. -
స్వగ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ
నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. తన స్వగ్రామమైన తాళ్లపూడిని మోడల్ గ్రామంగా తీర్చిదిద్ది.. సకల సదుపాయాలు కల్పించేందుకు రూ.15 కోట్లతో చేపట్టిన వివిధ పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మంత్రి అనిల్‌కుమార్, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దుర్గాప్రసాద్.. ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, కాకాణి గోవర్ధన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చదవండి: 8 నెలల్లోనే ఇంత పతనమయ్యావేమి బాబూ? -
విజయనగరం జిల్లాకు రాజావారి రాజద్రోహం
ఎవరికైనా అవకాశం వస్తే సొంత ఊరిని.. తమ ప్రాంతాన్ని... జిల్లాను అభివృద్ధి చేసుకోవడానికే మొగ్గు చూపుతారు. కానీ జిల్లా తెలుగుదేశం పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న అశోక్‌గజపతిరాజు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పదవుల్లో ఉన్నపుడు జిల్లాను పట్టించుకోకపోగా... ఇప్పుడు అభివృద్ధికి అవకాశం వస్తే దానిని వ్యతిరేకిస్తున్నారు. విశాఖ కార్యనిర్వాహక రాజధాని అయితే విజయనగరాభివృద్ధి సాధ్యమని ఎవరినడిగినా చెబుతారు. ఈ జిల్లాకు చెందిన వ్యక్తిగా... జిల్లా ప్రజలవల్ల పలుమార్లు పదవులు అధిష్టించిన నాయకునిగా ఆయన మాత్రం... ప్రజలకు, జిల్లాకు ఇప్పుడు తీరని ద్రోహం చేస్తున్నారు. సాక్షి, విజయనగరం : దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన జిల్లాగా మిగిలిపోయిన విజయనగరానికి పాలనావికేంద్రీకరణ ద్వారా విశాఖలో రాజధాని ఏర్పాటు కావడం పెద్ద వరం. దీనివల్ల విజయనగరం జిల్లా రూపురేఖలు మారతాయని, తమ బతుకులు బాగుపడతాయని ఇక్కడి ప్రజలు సంతోషపడుతున్నారు. ఇలాంటి తరుణంలో అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ, రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సంతకాల సేకరణ చేపట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. రాజుల పాలనలో ఇప్పటికే విజయనగరం పట్టణంతో సహా జిల్లా అభివృద్ధిలో వెనక్కు వెళ్లిపోవడంతో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అశోక్‌ను, ఆయన కుమార్తెను ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు. అయినా ఆయన తీరులో మార్పు రాకపోవడంపై జిల్లా ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఓ వైపు విశాఖలో రాజధానికి అక్కడి టీడీపీ నాయకులు మద్దతు తెలుపుతుంటే ఉత్తరాంధ్రలో రాజధాని వద్దంటూ అశోక్ వంటి నేతలు సంతకాలు చేయమని ప్రజలను బలవంతం చేయడాన్ని స్థానికులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. చదవండి: ఆగని టీడీపీ ఆగడాలు ఆవిర్బావం నుంచీ వెనుకబాటే... 1979 జూన్ 1న విజయనగరం జిల్లా ఆవిర్భవించింది. అంతకు ముందు ఎందరో రాజుల ఏలుబడిలో శతాబ్దాలపాటు వర్థిల్లింది. చివరి రాజవంశమైన పూసపాటి వంశానికి చెందిన అశోక్ గజపతిరాజు పాతికేళ్ళపాటు శాసనసభ్యుడిగా, 13 ఏళ్ళ పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. మహారాజ అలక్ నారాయణ సొసైటీ ఫర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (మాన్సాన్) ట్రస్ట్ ద్వారా ఆస్తులను సంరక్షిస్తూ విద్యాసంస్థలు నడుపుతున్నారు. సింహాచలం దేవస్థానంతో పాటు అనేక ఆలయాలకు అనువంశిక ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన తండ్రి పూసపాటి విజయరామగజపతిరాజు, సోదరుడు పూసపాటి ఆనందగజపతిరాజు కూడా ఎంపీలుగా, మంత్రులుగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో అశోక్ కుమార్తె అధితి గజపతి రాజకీయ రంగ ప్రవేశం చేసి విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. అంటే జిల్లా చరిత్రలో అత్యధిక కాలం ఈ కుటుంబమే రాజకీయ పదవులను అనుభవించింది. రెండున్నర దశాబ్దాలు ఎమ్మెల్యేగా, దశాబ్దానికి పైగా మంత్రిగా ఉన్నపుడు జిల్లాకు ఎంతో మేలు చేసే అవకాశం ఉన్నప్పటికీ అలాంటి ఆనవాళ్ళు మచ్చుకైనా ఎక్కడా కనిపించలేదు. మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులను తన సొంత ఆస్తులుగా భావిస్తూ... యథేచ్ఛగా క్రయ విక్రయాలు సాగిస్తూ నేటికీ తన ఆస్తులను పెంచుకోవడానికి, రక్షించుకోవడానికి మాత్రమే ఆయన తన పదవులను వినియోగించుకున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు. నగరానికి ఆయన చేసిందేమిటి? అశోక్ గజపతి కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉండి కూడా భోగాపురం విమానాశ్రయ నిర్మాణంలో కనీస పురోగతి కూడా సాధించలేకపోయారు. జిల్లా కేంద్రానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సైతం తీసుకు రాలేకపోయారు. జిల్లాలో వైద్య విద్యను ప్రోత్సహించేందుకు మెడికల్ కళాశాల ఏర్పాటుచేస్తామన్నా... ఆయన పదవిలో ఉన్నంతకాలం సాధించలేకపోయారు. చివరికి విజయనగరాన్ని సైతం మురికి కూపంగా మిగిల్చారు. ఆయన ఓటమి తరువాతనే నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఎన్నో ఏళ్ళగా నగరవాసుల తాగునీటి కష్టాలనూ ఆయన తీర్చలేకపోయారు. ఛిద్రమైన రహదారులు, కలుషితమైన చెరువులు ఆయన దృష్టిలోనే లేవు. ఫలితంగా అత్యంత వెనుకబడ్డ జిల్లాల జాబితాలో విజయనగరం మగ్గిపోయింది. ఇదీ ఇన్నేళ్లలో ఈ జిల్లాకు రాజుగారు చేరిన మేలు. ఇప్పుడు ఆయనే మరోసారి జిల్లా అభివృద్ధి నిరోధకానికి తోడ్పడుతున్నారు. వికేంద్రీకరణతోనే విజయనగరాభివృద్ధి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ అభివృద్ధి ఒకేచోట కేంద్రీకరింపజేశారు. అమరావతినే కీలకంగా మార్చేస్తున్నారు. దీనివల్ల మిగిలిన ప్రాంతాల అభివృద్ధి కుంటుపడింది. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధిని ఒక ప్రాంతానికి పరిమితం చేయకుండా మూడు ప్రాంతాలకు న్యాయం చేసేలా నిర్ణయం తీసుకున్నారు. అమరావతి గౌరవానికి భంగం కలగకుండా ఉత్తరాంధ్రకు పరిపాలనా రాజధాని, రాయలసీమకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని తీసుకురావాలని యోచిస్తున్న తరుణంలో ఈ ప్రాంతీయుల్లో ఆశలు చిగురించాయి. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఎంతో సంబరపడుతోంది. విశాఖలో పరిపాలనా రాజధానిని స్వాగతిస్తున్నామంటూ ఊరూ... వాడా... నినదిస్తోంది. కానీ అశోక్ గజపతి మాత్రం ఉత్తరాంధ్రకు రాజధాని వద్దని, అమరావతే కావాలని నినదించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అశోక్ గజపతి, ఆయన అనుచరులు జిల్లా ప్రజలకు చేస్తున్న ఈ ద్రోహాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు. -
కేసీఆర్ 2.0 @ 365
కాళేశ్వరం జాతికి అంకితం.. రాష్ట్రంలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ కలసి గత జూన్ 21న ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి ఆయ కట్టుకు నీరందించేందుకు రాత్రింబవళ్లు పనులు కొనసాగుతున్నాయి. తొలి ఏడాదే అమలైన హామీలు.. ►రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ కొనసాగిస్తున్నారు. ►అన్ని రకాల ఆసరా పెన్షన్లను రూ.1,000 నుంచి రూ.2,016కు, వికలాంగుల పెన్షన్లను రూ.1,500 నుంచి రూ.3,016కు ప్రభుత్వం పెంచింది. వృద్ధాప్య పెన్షన్ల కనీస అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. దాదాపు 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు చెల్లించేందుకు ఏటా రూ.5,300 కోట్లు ఖర్చు చేస్తోంది. ►రైతు బంధు కింద ఎకరానికి రూ.8 వేలు చొప్పున ఏడాదికి అందిస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.10 వేలకు పెంచింది. 30 రోజుల ప్రణాళిక.. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతంగా అమలు చేశారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రెండో పర్యాయం బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయింది. రైతు సంక్షేమం, సబ్బండ వర్గాల అభ్యున్నతి కార్యాచరణను యథాతథంగా అమలు చేస్తూ పాలనలో గత ఒరవడిని కొనసాగించారు. రైతుబంధు, ఆసరా పెన్షన్ల పెంపు హామీలను తొలి ఏడాదే అమల్లోకి తెచ్చి సంక్షేమ రంగాన్ని మరింత పటిష్టం చేశారు. పాలనలో సంస్కరణల కొనసాగింపు దిశగా పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాల రూపకల్పనకు దృష్టిసారించారు. మున్సిపల్, రెవెన్యూ శాఖల్లో అవినీతిని సమూలంగా నిర్మూలించేందుకు ఇప్పటికే కొత్త మున్సిపల్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ముసాయిదా రెవెన్యూ చట్టాన్ని సిద్ధం చేశారు. సుపరిపాలన, అవినీతి నిర్మూలన, జాప్యాలను తుద ముట్టిం చాలనే లక్ష్యంతో ఈ చట్టాల రూపకల్పనకు సీఎం శ్రీకారం చుట్టారు. ఇక సీఎం దృష్టంతా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై కేంద్రీకృతమైంది. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ, నిరంతరం సమీక్షిస్తూ, క్షేత్రస్థాయి పర్యటనలతో పరుగులు పెట్టించారు. పొరుగు రాష్ట్రంతో సత్సంబంధాలు.. పొరుగు రాష్ట్రం ఏపీతో సంబంధాలు మెరుగయ్యాయి. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఏపీల మధ్య నెలకొన్న విభేదాలు, వివాదాలను చర్చల ద్వారా పరిష్కారానికి రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన కృషి కొంత వరకు ఫలించింది. ఇచ్చిపుచ్చుకునే విధానంలో రెండు రాష్ట్రాలు ఇప్పటికే పలు వివాదాలను పరిష్కరించుకుని పరస్పరం సహకరించుకుంటున్నాయి. వివాదస్పదమైన నిర్ణయాలు.. రాష్ట్రానికి కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయాలను నిర్మించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ఎర్రంమంజిల్ భవనాన్ని కూల్చేసి అక్కడే రూ.400 కోట్లతో కొత్త అసెంబ్లీ భవనాన్ని, ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చి రూ.100 కోట్లతో కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మిస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఉద్యోగ, కార్మిక వర్గాల్లో అసంతృప్తి.. పీఆర్సీ, పదవీ విరమణ వయసు పెంపు, పదోన్నతులు వంటి హామీల అమల్లో జాప్యంపై ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన 52 రోజుల సమ్మె సైతం ప్రభుత్వం, ఉద్యోగ, కార్మిక వర్గాల మధ్య దూరాన్ని మరింత పెంచింది. ఇక రెవెన్యూ శాఖలో పెట్రేగిపోయిన అవినీతి నిర్మూలనకు తీసుకొస్తున్న కొత్త రెవెన్యూ చట్టంతో తమ ఉద్యోగ ప్రాధాన్యతలు తగ్గిపోతాయని ఆ శాఖ కింది స్థాయి అధికారుల్లో ఆందోళన నెలకొని ఉంది. మాంద్యం దెబ్బకు కొత్త పనులకు బ్రేక్.. ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు గత ఫిబ్రవరిలో రూ.1,82,087 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టగా, గత సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన పూర్తి స్థాయిలో బడ్జెట్‌ను రూ.1,46,492.30 కోట్లకు తగ్గించుకుంది. ఆర్థిక మాంద్యం ప్రభావంతో రాష్ట్ర రాబడులు తగ్గిపోవడం, కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాలు రాకపోవడంతో 2019–20కి సంబంధించిన బడ్జెట్ అంచనాలను ప్రభుత్వం కుదించాల్సి వచ్చింది. దీని ప్రభావం అభివృద్ధి పనులపై పడింది. ఇప్పటికే ప్రారంభించిన పనులను పూర్తి చేయాలని, కొత్త పనులు చేపట్టరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి ఏడాదే అమలైన హామీలు.. – రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్ని కొనసాగిస్తున్నారు. – అన్ని రకాల ఆసరా పెన్షన్లను రూ.1,000 నుంచి రూ.2,016కు, వికలాంగుల పెన్షన్లను రూ.1,500 నుంచి రూ.3,016కు ప్రభుత్వం పెంచింది. వృద్ధాప్య పెన్షన్ల కనీస అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. దాదాపు 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు చెల్లించేందుకు ఏటా రూ.5300 కోట్లు ఖర్చు చేస్తోంది. – రైతు బంధు కింద ఎకరానికి రూ.8 వేలు చొప్పున ఏడాదికి అందిస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.10 వేలకు పెంచింది. నెరవేరాల్సిన హామీల్లో ప్రధానమైవని.. – ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ. పదవీ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పొడిగింపు – రైతులకు రూ.లక్ష వరకు పంట రుణాల మాఫీ – నిరుద్యోగులకు నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి చెల్లింపు – సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల చెల్లింపు – ఉద్యోగాల నియామకాలకు గరిష్ట వయోపరిమితిని 3 ఏళ్లు పెంపు కొనసాగించడం. -
ఒకవైపే చూస్తున్న బాలయ్య.. మరి రెండో వైపు..?
సాక్షి, హిందూపురం : హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పనితీరుపై నియోజకవర్గ ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తమకు అందుబాటులో ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో టీడీపీ గెలిచిన నియోజకవర్గాల్లో హిందూపురం ఒకటి. ప్రజలు బాలకృష్ణపై నమ్మకం పెట్టుకుని గెలిపించినా ఆయన మాత్రం ప్రజల కష్టాలను పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఎన్నికలు జరిగిన ఆరునెలల్లో ఎమ్మెల్యే నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటం మానేశారు. గెలిచినప్పటి నుంచి కేవలం రెండుసార్లు మాత్రమే ఇక్కడికి వచ్చారు. నియోజకవర్గంలో ప్రజాసమస్యలపై ఏమాత్రం పట్టింపులేనట్లుగా వదిలేశారు. అసెంబ్లీ సమావేశాలకే కాకుండా జిల్లా కేంద్రంలో నియోజకవర్గాల అభివృద్ధిపై జరిగిన మూడు సమావేశాలకు ఎమ్మెల్యేలందరూ హాజరై తమ వాణిని వినిపించారు. అయితే బాలయ్య మాత్రం సమావేశాలకు డుమ్మా కొట్టారు. ఆయన అసెంబ్లీ, అధికార సమావేశాలకు హాజరుకాకపోవడంతో అధికారులతో పాటు ప్రజల్లో కూడా తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇదే తంతు గత 2014లో ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి నేటి వరకు బాలకృష్ణ ఇదే రీతిగా వ్యవహరిçస్తున్నారు. ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే హోదాలో నియోజవకవర్గానికి ఆయన వచ్చిన తేదీలు వేళ్లపై లెక్కించవచ్చు. వచ్చినప్పుడల్లా మండలాల్లో ప్రారంభోత్సవాలు, భూమి పూజలు, రోడ్డుషోలతో సరిపెట్టేశారు. ఎన్నికల సమయంలో సతీసమేతంగా హిందూపురంలో ఇంటింటి ప్రచారాలు చేశారే తప్ప ఆ తర్వాత కనిపించలేదు. 2014 ఎన్నికల సమయంలో అయితే ఏకంగా బాలయ్య దంపతులు స్థానికంగా గృహప్రవేశం చేసి ఇక్కడే ఉంటామని ప్రజలను నమ్మించారు. గతంలో తాను గెలిస్తే హిందూపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చుదిద్దుతానని చెప్పిన బాలయ్య నియోజకవర్గ పాలన అంతా పీఏలకు అప్పగించి సినిమా షూటింగ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం 2019 ఎన్నికల్లో కూడా ప్రజలు ఆయన తండ్రి ఎన్టీరామారావుపై ఉన్న అభిమానంతో రెండోసారి పట్టం కట్టారు. ఈసారైనా ప్రజల చేరదీస్తారని నమ్మారు. అయితే బాలకృష్ణ మాత్రం ఒకవైపే చూడండి..రెండోవైపు చూడకూ.. అన్న రీతిలో ఆయన వ్యవహారంలో ఎలాంటి మార్పురాలేదు. దీంతో ప్రజలు నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నారన్న సంగతి మరిచిపోయే పరిస్థితి నెలకుంది. అధికార కార్యక్రమాలే కాకుండా పార్టీ కార్యక్రమాలకు కూడా రావడంలేకపోవడంతో ప్రజలకే కాకుండా ఆపార్టీ కార్యకర్తల్లో కూడా తీవ్ర అసంతృప్తి నెలకొంది. కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు ప్రజాసమస్యలపై ఏ ఒక్కసారి ఏ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యే ఈసారి హిందూపురంలో కార్తీక దీపోత్సవాన్ని కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కార్తీక చివరి సోమవారం నాడు కార్తీక పూజలు, దీపాలు వెలిగించడానికి బాలకృష్ణ దంపతులతో పాటు కుటుంబసభ్యులందరూ వస్తున్నట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. అయితే ప్రజల మాత్రం సమస్యలపై గళమెత్తి పేదల కుటుంబాల్లో వెలుగులు నింపాలని ప్రజలు కోరుకుంటున్నారు. -
తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు సీఎం జగన్
సాక్షి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ముమ్మిడివరం నియోజకవర్గం పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో మత్స్యకారులకు పలు హామీలు ఇచ్చారు. వీటి అమలుకు సీఎం ఆ రోజు శ్రీకారం చుట్టనున్నారు. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ (జీఎస్పీసీ) కార్యకలాపాల ఫలితంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు ఆ సంస్థ ఇవ్వాల్సిన బకాయిల చెల్లింపులో జాప్యం జరగడంతో.. ఆ మొత్తాన్ని తమ ప్రభుత్వమే ఇస్తుందని పాదయాత్రలో వాగ్దానం చేశారు. ఆమేరకు రూ.78.22 కోట్లు మత్స్యకారులకు అందజేయనున్నారు. అలాగే ముమ్మిడివరంలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి, ఎదుర్లంక ఎస్సీ లంక భూముల్లో రూ.75 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. 21న సీఎం పర్యటన సాగనుందిలా.. ►ఉదయం 9.45 : సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హెలికాప్టర్లో ముమ్మిడివరం మండలం గాడిలంక చేరుకుంటారు. ►ఉదయం 9.50 : రోడ్డు మార్గంలో బయలుదేరి ఐ.పోలవరం మండలం పశువుల్లంక గ్రామం చేరుకుంటారు. పశువుల్లంక నుంచి వలసలతిప్ప హై లెవెల్ బ్రిడ్జి (వైఎస్సార్ వారధి) ప్రారంభిస్తారు. ►ఉదయం 10.20 : ముమ్మిడివరం మండలం కొమానపల్లిలో ఏర్పాటు చేసిన 9 టూరిజం బోటింగ్ కంట్రోల్ గదులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సభాస్థలికి చేరుకుంటారు. దివంగత ముఖ్యమంతి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులరి్పస్తారు. జ్యోతి వెలిగించి, వందేమాతరం గేయం ఆలపిస్తారు. ►ఉదయం 10.40 – 11.00 : మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగిస్తారు. ►ఉదయం 11.00 – 11.45 : మత్స్యకార భరోసా, జీఎస్పీసీ బకాయి రూ.78.22 కోట్ల నిధులు అందజేస్తారు. ►11.45 : సభా ప్రాంగణం నుంచి గాడిలంక హెలిప్యాడ్‌కు రోడ్డు మార్గాన బయలుదేరుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో 12 గంటలకు యానాం చేరుకుంటారు. ►మధ్యాహ్నం 12.25 : పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు నివాసానికి చేరుకుంటారు. ఇటీవల దివంతులైన కృష్ణారావు తండ్రి మల్లాడి సూర్యనారాయణకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. 12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తాడేపల్లిలోని తన నివాసానికి హెలికాప్టర్లో బయలుదేరుతారు. ట్రాఫిక్ మళ్లింపు కాకినాడ సిటీ: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐ.పోలవరం, ముమ్మిడివరం, యానాం పర్యటనకు వస్తున్న సందర్భంగా ఈ నెల 21వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 3 గంటల వరకూ ట్రాఫిక్ మళ్లించినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయిం అస్మి మంగళ వారం తెలిపారు. అమలాపురం వైపు నుంచి కాకినాడ వెళ్లే లైట్ మోటార్ వాహనాలు (4 చక్రాలు), భారీ వాహనాలు (4 చక్రాల కన్నా ఎక్కువ ఉన్నవి) ఈదరపల్లి, అంబాజీపేట, కొత్తపేట, రావులపాలెం మీదుగా వెళ్లాలి. కాకినాడ వైపు నుంచి అమలాపురం వైపు వెళ్లే లైట్ మోటార్ వాహనాలు, భారీ వాహనాలు యానాం, పిల్లంక, గోపులంక, రావులపాలెం మీదుగా వెళ్లాలి. ట్రాఫిక్ మళ్లింపునకు అందరూ సహకరించాలని ఎస్పీ కోరారు. -
కడప.. ఇక ప్రగతి గడప
కడప అనగానే రాష్ట్ర ప్రజలకు గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖరరెడ్డి. అంతటి ముద్రను వేసుకున్నారు దివంగత నేత. నాయకత్వ లక్షణాలతో.. సొంత జిల్లా అభివృద్ధిలో తన దైన పంథాలో నడిచారు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు సీఎంగా ఎన్నో అభివృద్ధి పనులు చేసి ఔరా అనిపించుకున్నారు. ఆయన మరణానంతరం జిల్లాను గాలికొదిలేశారు పాలకులు. పదేళ్ల తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాను ప్రగతి బాటలో నడిపించేందుకు దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తున్నారు. సీఎం అయ్యాక సోమవారం తొలిసారిగా వచ్చిన ఆయన చేసిన ప్రకటనల్లో ఈ విషయం సుస్పష్టంగా నిపించింది. జిల్లాఅభివృద్ధికి ఎన్ని చేయాలో అన్నీ చేయాలనే పట్టుదల జగన్‌లో ప్రస్ఫుటమైంది. సాక్షి ప్రతినిధి కడప: కడప జిల్లాకు ‘దశ–దిశ’గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలవనున్నారు. సొంత జిల్లా అభివృద్ధి విషయంలో ఒక విజన్‌తో ఆయన పనిచేసుకుపోతున్నారు. అన్ని విధాలా జిల్లాను ప్రగతి పథంలో నడిపేందుకు కార్యోన్ముఖుడై కదులుతున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, రైతులకు సాగునీరు, నిలిచిపోయిన నీటి ప్రాజెక్టులకు జీవం, చెన్నూరు షుగర్స్ పునరుద్ధరణ, ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు తదితర అంశాలలో స్పష్టమైన ప్రణాళికతో అడుగు వేయాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కడప గడ్డపై అడుగుపెట్టిన జగన్మోహన్ రెడ్డి జిల్లా వాసుల అంచనాలకు తగ్గట్లుగా నిర్ణయాలు ప్రకటించారు. ప్రతిష్టాత్మక నవరత్నాల పథకాలను ఈ గడ్డపై నుంచే ప్రారంభించారు. పెండింగ్ పథకాలపై దృష్టి పెడుతున్నట్లు ప్రకటించడం జిల్లావాసులకు సంతోషాన్ని కలిగించింది. చెప్పడం కాదు చేసి చూపెడతానంటూ అందుకు డిసెంబర్ 26 ముహూర్తం కాగలదని తెలియజెప్పారు. కేసీ కెనాల్ ఆయకట్టుకు జీవం.. కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 డిసెంబర్ 24న రాజోలి రిజర్వాయర్ నిర్మాణానికి పెద్దముడియం మండలంలో శుంకుస్థాపన చేశారు. 2.96 టీఎంసీల సామర్థ్యంతో రాజోలి రిజర్వాయర్, కోవెలకుంట్ల సమీపంలో 0.90 టీఎంసీ సామర్థ్యంతో జొలదరాశి రిజర్వాయర్లు నిర్మించేందుకు, రూ.434 కోట్లు అంచనా వ్యయంతో నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. పరిపాలన అనుమతులు కూడా ఇచ్చారు. మరుచటి ఏడాది మృతి చెందడంతో రాజోలి రిజర్వాయర్ నిర్మాణానికి పుల్‌స్టాప్ పడింది. ఆప్రాజెక్టు పూర్తయితే కుందూ నదిలోని వరద జలాలను నిల్వ చేసుకోవచ్చు. అవసరమైన సమయంలో వాటిని కేసీ కెనాల్‌కు ఉపయోగించుకునేందుకు వీలుండేది. కేసీ కెనాల్తోపాటు ప్రొద్దుటూరు, కడప నగరం దాహార్తి తీర్చుకునేందుకు అవకాశం దక్కేది. దాహార్తికి ఇబ్బందులు లేకుండా అవసరమైన సమయంలో పెన్నాకు కూడా నీరు లభించేది. కేసీ కెనాల్ పరిధిలో దాదాపు 95వేల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగపడేది. కుందూలో వరద నీరు పుష్కలంగా ఉంటుంది. ఏటా దాదాపుగా 50టీఎంసీలకు పైగా సోమశిల రిజర్వాయర్ చేరుతోంది. ఈ పరిస్థితిలో రాజోలి సమీపంలో 3టీఎంసీలు నీరు నిల్వ చేయగల్గితే కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో పంటలకు ఎలాంటి డోకా ఉండదు. ఇదే విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు దృష్టి పెట్టారు. ఈ ఏడాది డిసెంబర్ 26న ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. నిరుపయోగంగా ఉన్న బ్రహ్మంసాగర్‌ను నీటి నింపేందుకు ప్రణాళికలు రచించారు. కుందూ వరద జలాలను ఎత్తిపోతల ద్వారా తెలుగుగంగ కాలువకు తరలించి, బ్రహ్మంసాగర్ నింపుతామని వివరించారు. కృష్ణా జలాలు వరద ఉదృతి ఆధారంగా గండికోట ప్రాజెక్టులో 20టీఎంసీల నీరు నిల్వ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించి ఊరట కల్పించారు. పులివెందుల కేంద్రంగా అరటి పరిశోధన.. అరటి పంటను అపారంగా పండించే పులివెందుల ప్రాంతంలో డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్శిటీకీ అనుబంధంగా అరటి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయి. రూ.10కోట్లుతో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మెరుగైన దిగుబడులు ఈ ప్రాంత వాతావరణానికి అనువైన రకాలను ఎంపిక చేసి ఉద్యాన అధికారులు పరిశోధన చేయనున్నారు. తాగునీరు, సాగునీరు, అనువైన పంటలు ఏర్పాటు, ఉపాధి అవకాశాలు, మౌళిక వసతులు కల్పించాలనే సంకల్పం ముఖ్యమంత్రి మదిలో ఉన్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. దశాబ్దకాలంగా జిల్లాను వివక్షతకు గురిచేసిన పాలకుల కనువిప్పు కల్గేలా జిల్లాభివృద్ధే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని పలువురు విశ్వసిస్తున్నారు. ఉక్కు సంకల్పంతో ప్రభుత్వం... కడప జిల్లా వాసుల కల ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు. దీనిని నెలకొల్పాలనే కృతనిశ్చయం ఆయన మాటల్లో కనిపించింది. దీనిద్వారా వెనుకబడిన ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని వైఎస్సార్సీపీ అధినేతగా గతంలోనే ప్రకటించారు. సీఎం అయ్యాక తాను మాట ఇచ్చిన ప్రకారం డిసెంబర్ 26న ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తానని ప్రకటించడంతోనిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి. మూతబడిన చెన్నూారు చక్కెర ఫ్యాక్టరీ తెరిపించేందుకు రూ.60కోట్లు మంజూరు చేస్తున్నామని సీఎం చేసిన ప్రకటన సహకార రంగానికి ఊపిరులూదినట్టయింది. చెరుకు రైతులకు అండగా నిలవాలనే దిశగా ప్రభుత్వ చర్యలు వేగంగా సాగుతున్నాయి. -
రాజన్న అంటే.. నడిచొచ్చిన నమ్మకం
సాక్షి, విశాఖపట్నం : తెలుగుదనం ఉట్టిపడే పంచెకట్టుతో.. రాజసమైన నడకతో రాజన్న నడిచొస్తుంటే ప్రజలంతా తమ జీవితాలు బాగు చేసేందుకు నమ్మకమే నడిచొస్తున్నట్లుగా భావించేవారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి గుర్తుచేసుకున్నారు. ప్రజాప్రస్థాన యాత్రలో రాజన్నతో కలిసి నాలుగు జిల్లాల్లో నడిచిన సత్తి రామకృష్ణారెడ్డిని వైఎస్సార్ జయంతి సందర్భంగా పాదయాత్ర విశేషాల్ని చెప్పమంటే తీపి గురుతులు జ్ఞాపకం చేసుకున్నారు. ‘‘నేనప్పుడు విశాఖ నగర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. గతంలో వైఎస్సార్‌ను అడపా దడపా కలిస్తుండేవాడిని. ప్రజాప్రస్థాన యాత్ర ప్రారంభించినప్పటి నుంచి.. పలు జిల్లాల్లో కలిసి ఒక రోజు నడిచి వచ్చేసేవాడిని. కానీ.. తూర్పుగోదావరిలోకి ప్రవేశిస్తోందనగా ఆయనకు స్వాగతం చెప్పి వచ్చేద్దామని అనుకుని వెళ్లా. ఆ రోజు రాజన్నను చూశాక ఆశ్చర్యపోయా. చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభమైనప్పుడు ఆయన ముఖంపై ఎలాంటి చిరునవ్వు ఉందో.. వేల కిలోమీటర్లు నడిచిన తర్వాత కూడా అదే చిరునవ్వు చూసి మంత్ర ముగ్థుడినైపోయా. స్వాగతం చెప్పి వచ్చేయాలనుకున్న నేను.. ఆయనతో కలిసి నడక ప్రారంభించా. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 31 రోజుల పాటు 630 కిలోమీటర్లు వైఎస్సార్‌తో కలిసి పాదయాత్ర ముగిసిన వరకూ ఉన్నాను. ఆయన వేసిన ప్రతి అడుగుకో సమస్య వినిపించేది. రాజన్న వస్తున్నాడంటూ పంటపొలాల నుంచి కూలీలు పరిగెత్తుకొచ్చి తమ సమస్యలు చెప్పేవారు. అందరికీ చిరునవ్వుతో సమాధానమిచ్చే వైఎస్సార్ సహనమే ఆయనకు ఆభరణంగా మారింది. నేను విన్న చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి. ఆయన సీఎంగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన పథకాలతో ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో లబ్ధి కలిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనలోని గుణాల్ని దగ్గరినుంచి చూశాక రాజన్న అడుగుజాడల్లో నడవాలనీ, ఆయన ఆశయ సాధనకు కృషిచెయ్యాలని నిర్ణయించుకున్నా. వైఎస్సార్ మరణించారన్న వార్త విని ఎంతో మనోవేదనకు గురయ్యాను. అలాంటి నేత మళ్లీ రారని అనుకున్నాను. కానీ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపంలో వెఎస్సార్ మళ్లీ వచ్చారని ముఖ్యమంత్రి పాలనతో ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.’’ అని సత్తి రామకృష్ణారెడ్డి గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రస్థానంలో వైఎస్సార్‌తో కలిసి నడుస్తున్న సత్తి రామకృష్ణారెడ్డి బెల్లం తీయన..ఆయన మనసు చల్లన మునగపాక(యలమంచిలి): మహానేత రాజన్నతో మునగపాకకు విడదీయరాని అనుబంధం ఉంది. 17 ఏళ్ల క్రితం రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో 2002 ఏప్రిల్ 4న డ్వాక్రాసదస్సుకు హాజరయ్యేందుకు పరవాడ నుంచి అచ్యుతాపురం మీదుగా మునగపాకకు వచ్చారు. ఈ సందర్బంలో మునగపాకకు చెందిన ఆడారి పోలయ్య క్రషర్వద్ద బెల్లం తయారీ జరుగుతుండడంతో తన వాహనం నుంచి కిందకు దిగి రైతు తయారు చేస్తున్న బెల్లాన్ని పరిశీలించారు. బెల్లం తయారీ ఖర్చుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెల్లానికి గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే వ్యవసాయ రంగానికి 7గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలంటూ రైతులు రాజన్న దృష్టికి తీసుకువచ్చారు. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర్‌రెడ్డి మొదటి సంతకంగా ఉచిత విద్యుత్ ఫైల్‌పై చేయడం, అలాగే 7గంటల పాటు ఏకధాటిగా విద్యుత్ సరఫరా అందజేయడంతో రైతుల నుంచి నాడు హర్షాతిరేకాలు వినిపించాయి. బెల్లం తయారీని ఆసక్తిగా తిలకిస్తున్న రాజన్న(ఫైల్‌ఫొటో) ప్రతి ఇంట్లో మహానేత ఫొటో అరకులోయ: వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో గిరిజనులకు చెప్పలేనంత అనుబంధం ఉంది. ముఖ్యంగా కోడిపుంజువలస గిరిజనులకు రాజన్న ఆరాధ్య దైవమనే చెప్పాలి. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో రాజన్న ఫొటో ఉంటుంది. గిరిజనుల విజ్ఞప్తి మేరకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభా రవిబాబు గత ఏడాది కొడిపుంజువలసలో మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2005 సంవత్సరం ఆగస్టు నెలలో కొడిపుంజువలసలో వరద బీభత్సం సృష్టించింది. కొండదిగువున గ్రామం కావడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. 36 ఇళ్లు కొట్టుకుపోయాయి. నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటన జరగడంతో 19 గల్లంతయ్యారు. ఈ సంఘటనపై స్పందించిన అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి రాత్రికి రాత్రే సహాయక బృందాలను పంపి అప్రమత్తం చేశారు. అప్పటి ఎస్.కోట ఎమ్మెల్యే కుంభా రవిబాబు కూడా కొడిపుంజువలసలో జరిగిన అపార నష్టాన్ని వైఎస్సార్‌కు ఫోన్లో వివరించారు. గ్రామ గిరిజనులు నిరాశ్రయులవ్వడంతో చలించిన వైఎస్. రాజశేఖర్‌రెడ్డి మరుసటి రోజు ఉదయాన్నే హైదరాబాద్ నుంచి కొడిపుంజువలసకు చేరుకున్నారు. గిరిజనులకు ఏర్పడిన నష్టం, 19మంది గల్లంతు సంఘటనపై మహానేత వైఎస్సార్ కన్నీళ్లు పెట్టారు. బాధిత గిరిజన కుటుంబాలను ఓదార్చి, తాను ఉన్నాననే దైర్యాన్ని ఇచ్చారు. మోడల్ కాలనీ నిర్మాణం : సర్వస్వం కొల్పోయి, కట్టుబట్టలతో మిగిలిన కొడిపుంజువలస గ్రామంలో 36 కుటుంబాలతో పాటు, సమీపంలోని మరో వీధిలో నివసిస్తున్న మిగిలిన కుటుంబాలను వైఎస్సార్ ఆదుకున్నారు. గ్రామంలోని అన్ని గిరిజన కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించి,78 పక్కా గృహాలతో యుద్ధప్రాతిపదికన మోడల్ కాలనీని నిర్మించారు. గుండెల్లో గుడి కట్టారు పెందుర్తి: సబ్బవరం మండలం జోడుగుళ్లు కూడలి వద్ద నివాసం ఉంటున్న ముర్రు రామునాయుడుకి నలుగురు కుమారులు. రామునాయుడు చిన్నపాటి మెకానిక్, విద్యుత్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. ఈ నేపథ్యంలో పిల్లలను ఉన్నత చదువులు చదివించుకునే ఆర్థిక స్తోమత లేదు. ఆ సమయంలో మహానేత డాక్టర్ వైఎస్సార్ అధికారంలోకి రావడం ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టడంతో వీరికి వరమైంది. పెద్దకుమారుడు మధనశేఖర్ పెందుర్తి మండలం నరవలోని ఓ ప్రవేటు కళాశాలలో ఎంబీఏ పూర్తిచేశారు. ఆ సమయంలో ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఏడాదికి రూ.37 వేలు ఇతని చదువు నిమిత్తం చెల్లించింది. ప్రస్తుతం అదే కళాశాలలో మధనశేఖర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ స్థిరపడ్డారు. రెండో కుమారుడు డిగ్రీ చదివి బ్రాండిక్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు. మూడో కుమారుడు ఫణీంద్రకుమార్ భీమిలిలోని ఓ కళాశాలలో ఐటీ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. నాలుగేళ్లూ అతని చదువు పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరించింది. అదే కళాశాలలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో రూ.60 వేలు పైబడిన వేతనంతో స్థిరపడ్డారు. ఆఖరి కుమారుడు రాజశేఖర్ నరవలోని ఓ కళాశాలలో ఫీజురీయింబర్స్‌మెంట్ ద్వారా ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం కొలువు కోసం ఎదురుచూస్తున్నాడు. ఇలా తమ పిల్లలను ఆ మహానేత ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్ ద్వారా చదివించినందుకు కృతజ్ఞతగా తన ఇంట్లో పూజగదిలో వైఎస్సార్ చిత్రపటాన్ని ఉంచి నిత్యం పూజిస్తున్నారు. -
28 రోజుల్లో ఖర్చయ్యేనా?
సాక్షి, నాగర్‌కర్నూల్: ఆర్థిక సంవత్సరం చివరలో శాసనసభ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు విడుదలయ్యాయి. శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమం(ఏసీడీపీ) కింద ఉమ్మడి పాలమూరులోని నాలుగు జిల్లాలకు కలిపి రూ.25.97 కోట్లు కేటాయించారు. అన్ని జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభివృద్ధి పనుల కోసం ఈ నిధులను వెచ్చించాల్సి ఉంది. 2018–19 సంవత్సరానికి సంబంధించిన నిధులు కావడంతో మార్చి 31లోపు వాటిని అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే కేవలం 28రోజుల్లో ఈ నిధులను ఖర్చుపెడతారా లేదా అనే సందేహం వ్యక్తం అవుతుంది. ఏటా జాప్యమే.. నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యేలకు ప్రతి యేటా ప్రభుత్వం కేటాయించే నిధులు ఖర్చు చేయడంలో జాప్యం జరుగుతోంది. ఎమ్మెల్యే మంజూరు చేసిన నిధులను కూడా చాలా నియోజకవర్గాల్లో అధికారులు ఖర్చు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అభివృద్ధికి మరింత ఊతమిచ్చే విధంగా ఎమ్మెల్యేలకు ప్రతియేటా కేటాయించే నిధులను ప్రభుత్వం రూ.కోటిన్నర నుంచి రూ.3కోట్లకు పెంచింది. అయితే ఈ నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు కావడం లేదు. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులలో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 50శాతం కూడా ఖర్చు చేయలేని పరిస్థితి. ఎమ్మెల్యేలకు వచ్చే నిధులలో వివిధ పనులకు కేటాయించినప్పటికీ.. ఆ పనుల్లో మాత్రం పురోగతి లేకపోవడం అభివృద్ధికి ఆటంకంగా మారింది. మూడు నెలల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టింది. ఈ ఏడాదైనా ఏసీడీపీ నిధులు ఖర్చు చేయడంలో అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం వారు ఆయా నియోజకవర్గాల్లో పలు పనులను గుర్తించారు. వెంటనే ప్రణాళికలు రూపొందించి పనుల వారీగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. కేవలం 28రోజులే సమయం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే కొంతమేరకైనా నియోజకవర్గంలో అభివృద్ధికి ముందడుగు పడుతుంది. విడుదలైన ఏసీడీపీ నిధుల వివరాలు ఇలా.. జిల్లా విడుదలైన నిధులు (రూపాయలలో) మహబూబ్‌నగర్ (నారాయణపేటతో కలిపి) 11,46,28,652 గద్వాల 2,14,23,039 వనపర్తి 2,13,76,768 నాగర్‌కర్నూల్ 10,22,74,203 మొత్తం 25,97,02,662 ఒక్కో ఎమ్మెల్యేకు సుమారు రూ.1.7 కోట్లు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం రూ.25.97కోట్లు విడుదలయ్యాయి. వీటిని 14మంది ఎమ్మెల్యేలతో పాటు, ఇద్దరు ఎమ్మెల్సీలకు పంచనున్నారు. ఈ లెక్కన ఒక్కో ఎమ్మెల్యేకు సుమారుగా రూ.కోటి 70లక్షలు అభివృద్ధి పనుల కోసం నిధులు రానున్నట్లు సమాచారం. కొత్తగా ఏర్పడిన నారాయణపేటతో కలిపి మహబూబ్‌నగర్ జిల్లాకు రూ.11.46కోట్లు కేటాయించారు. ఈ జిల్లాలో ఏడు నియోజవర్గాలు ఉన్నాయి. ఈ లెక్కన రూ.1.63కోట్లు ఒక్కో ఎమ్మెల్యేకు కేటాయించే అవకాశం ఉంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు ఒక్కొక్కరికి రూ.1.70కోట్లు కేటాయించే అవకాశం ఉంది. జోగుళాంబ గద్వాల జిల్లాకు రూ.2.14కోట్లు కేటాయించారు. రెండు నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.1.07కోట్లు, వనపర్తి జిల్లాకు రూ.2.13కోట్లు కేటాయించారు. ఒకే నియోజకవర్గం కాబట్టి రూ.2.13కోట్లు కేటాయించనున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి నిధుల్లో మహబూబ్‌నగర్ జిల్లాకు అత్యధికంగా, వనపర్తి జిల్లాకు తక్కువగా నిధులు వచ్చాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విడుదలైన నిధులను మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్దేశించిన అభివృద్ధి పనులకు వెచ్చించనున్నారు. నియోజకవర్గాల్లో జనరల్, ఎస్సీ, ఎస్టీ, విభాగాలకు విడివిడిగా నిధులు కేటాయించింది. తాగునీరు, ప్రజాఆరోగ్యం, రోడ్డు నిర్మాణాలు, పాఠశాలల్లో భవనాల ఏర్పాటు, మరుగుదొడ్లు, వీధి దీపాలు, తదితర పనులకు ఈ నిధులు ఖర్చు చేయవచ్చు. జిల్లా కలెక్టర్, ప్రణాళిక విభాగం విధి విధానాలకు అనుగుణంగా ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. సకాలంలో ఖర్చు పెడతాం.. ఏసీడీపీ నిధులు మంజూరు చేయ డం సంతోషం. నాలుగు వారాల సమయమే ఉంది. అయినా కలెక్టర్‌తో సమన్వయం చేసుకొని అత్యవసర పనులకు ఆ నిధులను వినియోగిస్తాం. భవిష్యత్‌లోనూ నియోజకవర్గ అభివృద్ధికి ఏసీడీపీ నిధులతో పాటు మరిన్ని నిధులను మంజూరు చేయించి అభివృద్ధికి కృషి చేస్తా. – బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే తాగునీటికి ప్రాధాన్యం నియోజకవర్గం ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటా. ముఖ్యంగా పెండింగ్ పనులను పూర్తిచేయించడానికి ఈ నిధులను కేటాయిస్తాన. అలాగే నూతనంగా పాఠశాల భవనాలు, సీసీ రోడ్లు వేయించడానికి కృషి చేస్తా. –బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే -
చెరువుల పేరుతో లూటీ
యర్రగొండపాలెం (ప్రకాశం): ఆంధ్రప్రదేశ్ సమగ్ర నీటి పారుదల, వ్యవసాయాభివృద్ధి పథకం కింద మంజూరైన నిధులు కాజేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ పనులకు సంబంధించి గతనెలలో బాక్సు టెండర్లను టీడీపీ వర్గీయులతో వేయించి ఇప్పుడిప్పుడే ఆ పనులకుగాను అగ్రిమెంట్లు చేసుకోవటానికి సిద్ధమవుతున్నారు. సహజంగా రోడ్లు, భవనాల శాఖ రూ.1 లక్ష పనులు, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలు రూ.5 లక్షల మేరకు పనులకు ఆన్లైన్ టెండర్లను వేయాల్సి ఉంటుంది. ఈ టెండర్లలో రాష్ట్రంలోని కాంట్రాక్టర్లు పాల్గొనవచ్చు అనే నిబంధన ఉంది. అందుకు విరుద్ధంగా జిల్లాలో ఈ టెండర్ల ప్రక్రియను పూర్తిగా మార్చివేశారు. కోట్లాది రూపాయల ప్రజల సొత్తును టీడీపీ నాయకులకు కట్టబెట్టడానికి బాక్సు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లు వేయటానికి కాంట్రాక్టర్లు షెడ్యూల్ దాఖలు చేయాల్సి ఉంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పనులకు గాను టెండర్లు మరో విధంగా వేశారు. నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి తన అధికారాన్ని ఉపయోగించి షెడ్యూల్‌ను తనకు అనుకూలంగా ఉన్న టీడీపీ వర్గీయులకే అందేలా చర్యలు తీసుకున్నారు. అందుకుగాను టెండరు దక్కించుకున్న టీడీపీ నేత ఆయనకు 10 శాతం కమీషన్ ఇవ్వాల్సి ఉందని నియోజకవర్గంలో ఆ వర్గానికి చెందిన నాయకులే చర్చించుకుంటున్నారు. సింగిల్ టెండర్ అయితే నిబంధనలను పూర్తిగా వ్యతిరేకించిన వారవుతారన్న ఉద్దేశంతో మరో ఫాల్ట్ టెండర్‌ను వేయించారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు : ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే, ఎస్‌ఎన్‌పాడు ఆంధ్రప్రదేశ్ సమగ్ర నీటి పారుదల, వ్యవసాయ అభివృద్ధి పథకం కింద మంజూరైన ఈ పనులు 100 ఎకరాలకుపైబడి ఉన్న చెరువులలో మాత్రమే చేయాల్సి ఉంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలో మొ దటి విడత కింద 3 చెరువులకు రూ.7.70 కోట్లు నిధులు మంజూరయ్యాయి. పెద్దదోర్నాల మండలంలోని వై.చెర్లోపల్లి చెరువు అభివృద్ధికి రూ 3.70 కోట్లు, పెద్దారవీడు మండలంలోని బోడ్రెడ్డిపల్లె చెరువుకు రూ.2.50 కోట్లు, దేవరాజుగట్టు, పెద్దారవీడు చెరువులకు ఒకే ప్యాకేజి కింద రూ.1.50 కోట్లు ప్రకారం మంజూరయ్యాయి. ఈ నిధులు కాజేయటానికి అధికార పార్టీకి చెందిన నాయకులు పోటీపడ్డారు. అయితే తనకు అత్యంత సన్నిహింతంగా ఉండేవారితో మాత్రమే నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి ఈ టెండర్లు వేయించారని ఆరోపణలు వినవస్తున్నాయి. అప్పనంగా ప్రజల సొత్తును కాజేయటానికి అధికార పార్టీకి చెందిన వారు ప్రయత్నిస్తున్నారు. దీనివలన ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. జిల్లాలో చెరువులకు రూ.37 కోట్లు మంజూరయ్యాయి. ఆ పనులకు ఆన్లైన్ టెండర్లు పిలువాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు బాక్సు టెండర్లను పిలవడం శోచనీయం. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని చెరువులకు మంజూరైన రూ.7.70 కోట్ల పనులకు సింగిల్ టెండర్లు మాత్రమే వేయించుకున్నారు. కంటి తుడుపుగా మరొకరితో తప్పుడు టెండరు వేయించారు. షెడ్యూల్ కూడా టీడీపీ వర్గానికి చెందిన కాంట్రాక్టర్లకే ఇచ్చారు. అగ్రిమెంట్లు జరగకుండా రాష్ట్ర నీటిపారుదల మంత్రి, చీఫ్ ఇంజినీరు చర్యలు తీసుకోవాలి. ఈ టెండర్లపై సమగ్రంగా దర్యాప్తు జరపాలి. ఇప్పటికే 100 ఎకరాలలోపు ఉన్న చెరువులలో నీరు – చెట్టు పథకం కింద కోట్లాది రూపాయలు కాజేశారు. చెరువులను ఆడ్డంగా పెట్టుకొని టీడీపీ జేబులు నింపుకుంటున్నారు. -
44 జిల్లాల్లో తగ్గిన మావోల ప్రభావం
న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల కారణంగా 44 జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిందని కేంద్ర హోం కార్యదర్శి రాజీవ్ గౌబా వెల్లడించారు. ప్రస్తుతం మావోల ప్రభావం అధికంగా 30 జిల్లాల్లోనే ఉందన్నారు. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి చర్యలు చేపట్టడం, భద్రతను కూడా కట్టుదిట్టం చేయడంతో ఆశించిన ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. గ్రామాలకు రోడ్లు, వంతెనల నిర్మాణం, టెలిఫోన్ టవర్లు ఏర్పాటుతో పేదలకు కూడా అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని చెప్పారు. మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమాన్ని కొనసాగించామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కోసం తాజాగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ పలు రాష్ట్రాలకు అటవీ శాఖ అనుమతులు కూడా ఇచ్చినట్లు వివరించారు. -
అవినీతి నిరూపిస్తే రాజీనామా
ఖమ్మంఅర్బన్ : అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ సవాల్ విసిరారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ పాపాలాల్‌తో కలిసి ఆయన మాట్లాడారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక కొన్ని రాజకీయ పక్షాలు పనికట్టుకుని పసలేని ఆరోపణలు చేస్తున్నాయని, వీటిని ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరని, తన హయాంలోనే ఖమ్మం రూపురేఖలు ఎలా మారాయో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మంజూరు చేయిం చామని, ఇందులో అవినీతికి పాల్పడాల్సిన అవసరం తనకు ఎంతమాత్రం లేదన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గ అభివృద్ధి కోసం కాగితాలపై రచించిన ఖమ్మం అభివృద్ధి పనుల్లో ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. తొలివిడతగా రఘునాథపాలెం మండలం శివాయిగూడెం వద్ద 216 డబుల్ బెడ్రూం నిర్మాణాలు ఇప్పటికే పూర్తి చేసుకున్నామని, మిగిలినవి కూడా త్వరలోనే పూర్తి చేసి పేదలకు అందిస్తామన్నారు. పదేళ్ల క్రితం పట్టాలకే పరిమితం చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను కూడా అందించే కార్యక్రమం చేపట్టామన్నారు. నగరంలో రహదారులు, లకారం చెరువు అభివృద్ధి, కొత్త షాదీఖానా మంజూరు, గోళ్లపాడు చానల్ అభివృద్ధి, తాగునీటి పథకం ఇలా అనేక పథకాలను చేపడుతున్నట్లు తెలిపారు. 9న నలుగురు మంత్రుల రాక.. ఈనెల 9న కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సలు చేసేందుకు మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. హెలికాప్టర్ ద్వారా ఖమ్మం చేరుకుని.. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తారని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, పట్టాల పంపిణీ, కూరగాయల మార్కెట్, రోడ్ల విస్తరణ, డ్రెయినేజీ, షాదీఖానా, జిమ్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. టీటీడీసీ భవనంలో కార్పొరేషన్‌పై సమీక్ష సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు మధిర పర్యటనకు వెళ్లి.. సాయంత్రం 7 గంటలకు మమత మెడికల్ కళాశాల 20 ఏళ్ల సంబరాల వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్లు కమర్తపు మురళి, పగడాల నాగరాజు, కొత్తపల్లి నీరజ, కర్నాటి కృష్ణ, మందడపు మనోహర్, కూరాకుల వలరాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ మందడపు సుధాకర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మందడపు నరసింహారావు, నాయకులు శీలంశెట్టి వీరభద్రం, జెడ్పీటీసీ వీరూనాయక్ పాల్గొన్నారు. -
జడివానలో సుడిగాలి పర్యటన
- గిరిజనుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ - బెంగళూరు తరహాలో కాఫీ అభివృద్ధికి చర్యలు - పిల్లలను పాఠశాలకు పంపకుంటే రేషన్ కార్డు రద్దు చింతపల్లి: మండలంలోని పలు గ్రామాల్లో శనివారం జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ జోరువానలోను సుడిగాలి పర్యటన జరిపారు. ముందుగా లంబసింగి ప్రాంతాన్ని సందర్శించిన ఆయన అక్కడ గిరిజనులు సాగు చేస్తున్న కాఫీతోటలను పరిశీలించారు. బెంగళూరు తరహాలో కాఫీలో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు రైతులకు మెలకువలు నేర్పిస్తామని, ఈ మేరకు ఏజెన్సీ ప్రాంతంలో ఎంపిక చేసిన కొందరు రైతులకు అవగాహన కల్పించేందుకు బెంగళూరుకు పంపిస్తామన్నారు. లంబసింగి ప్రాంతంలోని మహిళలు, గిరిజనులతో మాట్లాడుతూ పిల్లలను పాఠశాలలకు పంపించే బాధ్యత తల్లితండ్రులే వహించాలన్నారు. పిల్లలను పాఠశాలలకు పంపించకపోతే రేషన్‌కార్డులు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. తాజంగిలో ఐటీడీఏకు చెందిన వ్యవసాయ క్షేత్ర భూములు పరిశీలించారు. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు 38 ఎకరాల భూమిని టూరిజం శాఖకు అప్పగించడంతో ఇంతకాలం ఆ భూములను నమ్ముకొనివున్న తాము రోడ్డున పడతామని స్థానిక గిరిజనులు మొరపెట్టుకున్నారు. అర్హులైన పేదలకు న్యాయం చేస్తామని కలెక్టర్ చెప్పారు. స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రిని సందర్శించారు. పీహెచ్సీ భవనానికి విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్రాలగొప్పు గ్రామాన్ని సందర్శించి పండ్ల వ్యాపారాన్ని పరిశీలించారు. చింతపల్లిలో ఆస్పత్రి, యువజన శిక్షణ కేంద్రాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ ఎం.హరినారాయణన్, సబ్‌కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్, చింతపల్లి డీఎస్పీ రాఘవేంద్ర, కాఫీ ప్రాజెక్టు అధికారి చిట్టిబాబు, డీఈ మోహన్‌రావు, జేఈలు జయరాం, వెంకటరమణ, ఎంపీడీఓ సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు. రక్తహీనత నివారణకు చర్యలు చింతపల్లి: బాలికల్లో రక్తహీనత నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ యువరాజ్ అన్నారు. శనివారం చింతపల్లి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లోని 12 ఏళ్లు పైబడిన బాలికల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటుందని, దాని నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. లంబసింగి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ పర్యాటకశాఖ చర్యలు చేపడుతుందని ఆయన తెలిపారు. ఏజెన్సీలో వైద్య ఆరోగ్యశాఖ పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. మాతా, శిశు మరణాల నివారణకు పకడ్బంది చర్యలు తీసుకుంటున్నామన్నారు. కూరుకుపోయిన పీవో కారు చింతపల్లి: మండలంలోని చిట్రాలగొప్పు వద్ద పాడేరు ఐటీడీఏ పీఓ హరినారాయణన్ కారు బురదలో కూరుకుపోయింది. దీంతో కొంతసేపు అక్కడే నిరీక్షించాల్సి వచ్చింది. కలెక్టర్ యువరాజ్‌తోపాటు చిట్రాలగొప్పు వచ్చిన పీఓ కారు వెనక్కు తిప్పుతుండగా బురదలో కూరుకుపోయింది. దీంతో పీఓను కలెక్టర్ తన కారులో తీసుకుపోయారు. కొంత సేపటికి సిబ్బంది కారును రోడ్డెక్కించి ఊపిరిపీల్చుకున్నారు. చిన్నారికి కలెక్టర్ లాలింపు చింతపల్లి: జిల్లా కలెక్టర్ యువరాజ్ శనివారం చిట్రాలగొప్పులోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అధికారుల బృందమంతా ఒకేసారి అంగన్వాడీ కేంద్రానికి వస్తుండటంతో అక్కడ ఉన్న ఒక చిన్నారి ఏడుపు అందుకుంది. దీంతో కలెక్టర్ యువరాజ్ ఆ చిన్నారిని స్వయంగా ఎత్తుకొని లాలించి ఓదార్చారు. అక్కడ ఉన్న బొమ్మలు, ఆట వస్తువులు చూపిస్తు చంటిపాప ఏడుపును నిలువరించారు. అక్కడ పిల్లలకు పెడుతున్న పోషకాహారాన్ని పరిశీలించారు. -
ఏపీ స్టడీ సర్కిల్ అభివృద్ధికి చర్యలు
విజయవాడ : నందిగామ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్, దళత సంఘాల ఫోరం ఆహ్వానం మేరకు శనివారం నగరంలోని ఏపీ స్టడీ సర్కిల్ (అంబేద్కర్ బాబూ జగజ్జీవన్‌రామ్ భవన్)ను ఆయన సందర్శించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వం కార్యక్రమాలపై మాట్లాడనని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండలాని కోరుతూ తెలుగుదేశం నాయకులు అనేక ఉద్యమాలు, నిరాహార దీక్షలు చేసినా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో లైట్లు ఆపేసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని విమర్శించారు. స్థానిక సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వ హయంలో ఏపీ స్టడీ సర్కిల్ నిర్మాణానికి కృషి చేసిందని చెప్పారు. ప్రస్తుతం విరిగిపోయిన కూర్చీలు, బల్లలు దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుందని విమర్శించారు. నందిగామ ఉప ఎన్నికల్లో పోటీ చేయడంపై సంప్రదాయాలకు విరుద్ధంగా కాంగ్రెస్‌పార్టీ పోటీకి పెట్టిందన్నారు. పీవీ నరసంహారావు నంద్యాలలో పోటీ చేస్తే తెలుగుదేశం పోటీకి పెట్టలేదని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి మరణించినప్పుడు పులివెందులలో టీడీపీ పోటీ పెట్టలేదని గుర్తు చేశారు. సానుభూతి, సంప్రదాయలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వెయ్యి ఓట్లు కూడా రావని తెలిపారు. ఏపీ స్టీడీ సర్కిల్ అభివృద్ధికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కార్పొరేటర్లు కె.శైలజ, ఎన్.జగదీష్, ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు జి.గాంధీ, డాక్టర్ నానయ్య, పరమేశ్వరరావు పాల్గొన్నారు. కాంగ్రెస్‌వి నీచ రాజకీయాలు : బచ్చుల నందిగామ : కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు ఆరోపించారు. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుందన్నారు. ఎమ్మెల్యేగా ఉండి అకాల మరణం చెందిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులు పోటీ చేస్తే పోటీ లేకుండా వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అన్ని పార్టీలు సహకరించడం సంప్రదాయంగా వస్తోందన్నారు. పార్టీ అభ్యర్థి సౌమ్యకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అభ్యర్థి తంగిరాల సౌమ్య, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మండల పార్టీ అధ్యక్షులు కోగంటి బాబు, కె.వి.సాంబశివరావు, ఐలూరి శ్రీనివాసరెడ్డి, వీరులపాడు ఎంపీపీ పాటిబండ్ల జయపాల్, శాఖమూరి స్వర్ణలత, పలువురు నాయకులు పాల్గొన్నారు.