న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల కారణంగా 44 జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిందని కేంద్ర హోం కార్యదర్శి రాజీవ్ గౌబా వెల్లడించారు. ప్రస్తుతం మావోల ప్రభావం అధికంగా 30 జిల్లాల్లోనే ఉందన్నారు. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి చర్యలు చేపట్టడం, భద్రతను కూడా కట్టుదిట్టం చేయడంతో ఆశించిన ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. గ్రామాలకు రోడ్లు, వంతెనల నిర్మాణం, టెలిఫోన్ టవర్లు ఏర్పాటుతో పేదలకు కూడా అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని చెప్పారు. మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమాన్ని కొనసాగించామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కోసం తాజాగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ పలు రాష్ట్రాలకు అటవీ శాఖ అనుమతులు కూడా ఇచ్చినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment