home secretery
-
భారత సంతతి యూకే మంత్రి సుయెల్లాకు క్వీన్ అవార్డు
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మాన్ (42) మొట్టమొదటి క్వీన్ ఎలిజబెత్–2 ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు. లండన్‌లో శనివారం జరిగిన 20వ ఆసియన్ అఛీవర్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆమె తల్లిదండ్రులు అవార్డును అందుకున్నారు. బ్రేవర్మన్ తల్లి తమిళ మూలాలున్న ఉమ, తండ్రి గోవాకు చెందిన క్రీస్టీ ఫెర్నాండెజ్. సుయెల్లా లండన్‌లో జన్మించారు. బ్రిటన్‌లో పలు రంగాల్లో విజయాలు సాధించిన దక్షిణాసియాకు చెందిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేస్తుంటారు. -
గోవాలో బ్రిటన్ హోం సెక్రటరీ తండ్రికి ఉన్న ఆస్తి కబ్జా... విచారణకు ఆదేశం
పనాజీ: బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ పగ్గాలు చేపట్టిన వెంటనే భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ని హోం సెక్రటరీగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బ్రిటన్ హోం సెక్రటరీ బ్రేవర్మన్ తండ్రి క్రిస్టీ ఫెర్నాండజ్కి గోవాలోని అస్సాగోలో సుమారు 13, 900 చ.కిమీ పూర్వీకులు ఆస్తి ఉంది. ఆ ఆస్తి కబ్జాకి గురయ్యిందని బ్రేవర్మన్ తండ్రి క్రిస్టీ ఫెర్నాండెజ్ ఫిర్యాదు చేసినట్లు గోవా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(సిట్) అధికారి నిధి వాసన్ తెలిపారు. ఫెర్నాండజ్ ఫిర్యాదు ఆధారంగా తాము కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. ఫెర్నాండెజ్‌కు అతని కుటుంబసభ్యులకు చెందిన అస్సగావో గ్రామంలో సర్వే నెంబర్ 253/3, 252/3లో ఉన్న ఆస్తులను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఇన్వెంటరీ ప్రోసీడింగ్లను దాఖలు చేశారని ఫిర్యాదు చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆయా వ్యక్తుల ఈ ఏడాది జులై 27న ఆ ప్రోసీడింగ్లను దాఖలు చేసినట్లు ఆగస్టులో తనకు తెలిసిందని ఫిర్యాదులో తెలిపారు. ఈ విషయాన్ని ఈమెయిల్ ద్వారా ఫెర్నాండజ్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జస్పాల్ సింగ్ గోవా ఎన్నారై కమిషనరేట్లకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గోవా ఎన్నారై కమీషనర్ నరేంద్ర సవైకర్ మాట్లాడుతూ... తమ శాఖకు గతవారమే ఈమెయిల్ వచ్చిందని, దీన్ని రాష్ట్ర హోం శాఖకు పంపించామని తెలిపారు. ఈ మేరకు గోవా ప్రభుత్వం ఇలాంటి భూ కబ్జా కేసులను నివారించేందుకు ఈ ఏడాది ప్రారంభంలో పోలీస్, రెవెన్యూ, ఆర్కెవ్స్, పురావస్తు శాఖ అధికారులతో కూడిన సిట్‌ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ రాష్ట్రంలో ఇలాంటి భూ కబ్జా కేసులకు సంబంధించి సుమారు 100కు పైగా కేసులను దర్యాప్తు చేస్తోంది. (చదవండి: గేమింగ్ యాప్ స్కామ్.... సుమారు రూ. 7 కోట్లు స్వాధీనం) -
44 జిల్లాల్లో తగ్గిన మావోల ప్రభావం
న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల కారణంగా 44 జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిందని కేంద్ర హోం కార్యదర్శి రాజీవ్ గౌబా వెల్లడించారు. ప్రస్తుతం మావోల ప్రభావం అధికంగా 30 జిల్లాల్లోనే ఉందన్నారు. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి చర్యలు చేపట్టడం, భద్రతను కూడా కట్టుదిట్టం చేయడంతో ఆశించిన ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. గ్రామాలకు రోడ్లు, వంతెనల నిర్మాణం, టెలిఫోన్ టవర్లు ఏర్పాటుతో పేదలకు కూడా అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని చెప్పారు. మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమాన్ని కొనసాగించామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కోసం తాజాగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ పలు రాష్ట్రాలకు అటవీ శాఖ అనుమతులు కూడా ఇచ్చినట్లు వివరించారు. -
రాష్ట్ర హోం సెక్రటరీకి ఏపీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్/విజయవాడ లీగల్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డంగా దొరికిపోయిన ‘ఓటుకు కోట్లు’ కేసుకు కౌంటర్‌గా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై నమోదైన కేసులకు సంబంధించి విజయవాడ కోర్టు ఆదేశాలను సిట్ అధికారులు గురువారం తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీకి అందించారు. నోటీసులివ్వడానికి సిట్ బృందం తెలంగాణ సచివాలయానికి రావడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ ట్యాపింగ్‌కు సంబంధించిన అంశాలతో కూడిన డేటాను నాలుగు కంపెనీలు సీల్డ్ కవర్లలో విజయవాడలోని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేశాయి. 25 ఫోన్ నంబర్లకు సంబంధించిన అంశాలను వాటిలో పొందుపరిచినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన తుది ఉత్తర్వులు వెలువడే వరకు తెలంగాణ అధికారులు ఇచ్చిన ఆదేశాలు, ఇతర డేటా వివరాలు సర్వీసు ప్రొవైడర్ల వద్ద ఉండే అవకాశం లేదని సిట్ భావిస్తోంది. ట్యాపింగ్ ఆదేశాలు తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా వెళ్లినట్లు, ఆయన వద్ద మరికొంత డేటా సైతం ఉన్నట్లు సిట్ ఇటీవల విజయవాడ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. అందుబాటులో ఉన్న పూర్తి వివరాలు, డేటాకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా భద్రంగా ఉంచాలని, కోర్టు కోరినప్పుడు అందించేలా ఆదేశించాలని ఇందులో కోరారు. దీన్ని విచారించిన న్యాయస్థానం ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు నోటీసుల్ని తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీకి అందించడానికి సిట్ ప్రత్యేక బృందం గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో ఆయన కార్యాలయానికి వెళ్లింది. సిట్ ద్వారా నోటీసుల్ని అందుకున్న అనంతరం రాజీవ్ త్రివేది మీడియాతో మాట్లాడుతూ ‘న్యాయస్థానం ఆదేశాలను సిట్ బృందం అందించింది. కోర్టు చెప్పిన ప్రకారం నడుచుకుంటాం. ఎప్పుడు కోరితే అప్పుడు మా వద్ద ఉన్న ఆధారాలను సమర్పిస్తాం’ అని చెప్పారు. ఏపీ సిట్ బృందం నోటీసులివ్వడానికి తమ హోం సెక్రటరీ కార్యాలయానికి వచ్చినట్లు తెలంగాణ సచివాలయం ఉద్యోగులకు తెలియడంతో వారంతా ఆ కార్యాలయం ఉన్న డి-బ్లాక్ దగ్గర గుమిగూడారు. నోటీసులు ఇచ్చి తిరిగి వస్తున్న సిట్ అధికారులు మీడియాతో మాట్లాడుతుండగా ఉద్యోగులు అభ్యంతరం చెప్పారు. సిట్ బృందంపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ‘గో బ్యాక్’ అంటూ నినాదాలు చేస్తూ అక్కడ నుంచి తరిమికొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, సచివాలయ భద్రతాధికారులు ఉద్యోగుల్ని అదుపు చేసి సిట్ అధికారులను వాహనాలు ఎక్కించి పంపారు. అంతకుముందు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్య డాక్యుమెంట్లను, సమాచారాన్ని తొలగించకుండా తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేయాలని సిట్‌ను విజయవాడలోని చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు టెలిఫోన్ సర్వీసు ప్రొవైడర్లు సీల్డ్ కవర్లలో ఇచ్చిన కాల్ డేటాను హైకోర్టు రిజిస్ట్రార్‌కు కోర్టు పంపింది. ఏపీపీకి తెలియకుండా పిటిషన్ విజయవాడ పోలీసులు, సీఐడీ, సిట్ అధికారులు కొత్త సంప్రదాయానికి తెర తీశారు. సాధారణంగా ఏ పిటిషన్ అయినా దాఖలు చేసే ముందు సంబంధిత కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)ని సంప్రదించాలి. కోర్టులో ఏపీపీకి తెలియకుండానే తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేయాల్సిందిగా కోరుతూ సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.