
నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. తన స్వగ్రామమైన తాళ్లపూడిని మోడల్ గ్రామంగా తీర్చిదిద్ది.. సకల సదుపాయాలు కల్పించేందుకు రూ.15 కోట్లతో చేపట్టిన వివిధ పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మంత్రి అనిల్‌కుమార్, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దుర్గాప్రసాద్.. ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, కాకాణి గోవర్ధన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.