కరోనాతో అభివృద్ధి ఆగరాదు: మోదీ | PM Narendra Modi laid the foundation stone for Manipur Water Supply Project | Sakshi
Sakshi News home page

కరోనాతో అభివృద్ధి ఆగరాదు: మోదీ

Published Fri, Jul 24 2020 6:08 AM | Last Updated on Fri, Jul 24 2020 6:08 AM

PM Narendra Modi laid the foundation stone for Manipur Water Supply Project - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు టీకా తయారయ్యేంత వరకూ దానిపై పోరు తప్పదని అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిస్థాయిలో ముందుకు తీసుకెళ్లాల్సిందేనని ప్రధాని నరేంద్రమోడీ గురువారం స్పష్టం చేశారు. మణిపూర్‌ నీటి సరఫరా పథకానికి వీడియో లింక్‌ ద్వారా శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాలు ఈ దేశ సరికొత్త అభివృద్ధి చోదకశక్తిగా మారే సామర్థ్యం ఉందని అన్నారు. కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వం పనిచేస్తూనే ఉందని చెప్పేందుకు మణిపూర్‌ నీటి సరఫరా పథకానికి శంకుస్థాపన ఒక ఉదాహరణ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement