
అభివృద్ధిపై దృష్టి సారిస్తా!
ఎన్నికలన్నీ అయిపోయాయిన తర్వాత బాధ్యతలు తీసుకున్న తాను అభివృద్ధిపె దృష్టి సారిస్తానని జిల్లా కొత్త కలెక్టర్ కేవీ రమణ తెలిపారు.
కడప సెవెన్‌రోడ్స్:
ఎన్నికలన్నీ అయిపోయాయిన తర్వాత బాధ్యతలు తీసుకున్న తాను అభివృద్ధిపె దృష్టి సారిస్తానని జిల్లా కొత్త కలెక్టర్ కేవీ రమణ తెలిపారు. సోమవారం జాయింట్ కలెక్టర్ రామారావు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానన్నారు.
అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో సామాన్య ప్రజల అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తానన్నారు. కలెక్టర్ రమణకు జాయింట్ కలెక్టర్ రామారావు, అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, డీఆర్వో సులోచన, కలెక్టరేట్ ఏఓ బాలకృష్ణ, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.