low pressure Depression
-
బలహీనపడిన వాయుగుండం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మంగళవారం బలహీనపడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో కొనసాగుతోంది. అక్కడ నుంచి నెమ్మదిగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రానున్న 24 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండురోజులు కోస్తాలో ఒకటిరెండు చోట్ల, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. -
నైరుతి బంగాళాఖాతంలో ఈనెల 9న అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి చేరువగా ఈనెల 9న అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం 48 గంటల్లో అది బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. ఈశాన్య రుతుపవనాల ప్రవేశం తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడనున్న తొలి అల్పపీడనం ఇదే. దీని ప్రభావం ఎక్కువగా తమిళనాడుపై ఉంటుందని, దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమపైనా కొద్ది ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రం మీదుగా దిగువ నుంచి తూర్పుగాలులు వీస్తున్నాయి. రానున్న 2 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. చదవండి: ఈ పరిశ్రమలే రుజువు.. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? -
Rain Alert : ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 12న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తదుపరి 24 గంటల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది. మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం గురువారం బలహీనపడింది. రానున్న రెండ్రోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వివరించింది. నైరుతి సీజన్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 43.6 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 79.36 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 82 శాతం అధిక వర్షపాతం నమోదైంది. (చదవండి: లక్ష్మీ పంపుహౌస్‌లో బయటపడిన మోటార్లు! 28 రోజుల తర్వాత) -
వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలు!
సాక్షి, అమరావతి: వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశాను ఆనుకుని కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా చత్తీస్‌గఢ్ వైపు పయనించి 24 గంటల్లో నెమ్మదిగా బలహీనపడుతూ భూమి మీదకు ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా జగ్గిలిబొంతులో 6.9 సెం.మీ వర్షం కురిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మడుగుల మండలం కుంతలంలో 6.6, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 5.5, పలాసలో 5.2, కాకినాడ జిల్లా తాళ్లరేవులో 5.1 సెం.మీ వర్షం కురిసింది. బుధవారం నుంచి వర్షాలు అక్కడక్కడా తప్ప చాలా ప్రాంతాల్లో తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. -
కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి స్థిరంగా కొనసాగుతోంది. ఒడిశా, చత్తీస్‌గఢ్ వైపు కదులుతూ రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీనికి నైరుతి రుతు పవన ద్రోణి కూడా తోడైంది. వీటి ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని తెలిపింది. మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాంధ్రలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. పలుచోట్ల భారీ వర్షాలు అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి జిల్లా చింతపల్లిలో 9.5 సెంటీమీటర్ల వర్షం పడింది. శ్రీకాకుళం జిల్లా హిర మండలంలో 7.5 సెంటీమీటర్లు, అల్లూరి జిల్లా ముంచంగిపుట్టులో 7.4, నంద్యాల జిల్లా వెలుగోడులో 7, ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో 6.2, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో 5.7, అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో 5, నంద్యాల జిల్లా ఆత్మకూరులో 4.7, శ్రీశైలంలో 4.6 సెంటీమీటర్ల వర్షం పడింది. -
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
సాక్షి, అమరావతి/మహరాణిపేట (విశాఖ దక్షిణ): వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో బలపడనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానంగా విశాఖ, తూ.గో.జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గులాబ్ తుపాను ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల మంగళవారం కూడా వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 7.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, విశాఖప్నటం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కోస్తా తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక జారీ చేశారు. -
ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 11న అల్పపీడనం!
సాక్షి, అమరావతి: ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక నేడు(బుధవారం), రేపు( గురువారం) రాయలసీమలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం వాతావరణ శాఖ పేర్కొంది. కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది. హుస్నాబాద్, అక్కన్నపేట, కొహెడ మండలాల్లో భారీ వాన పడింది. మేడ్చల్, సిరిసిల్ల, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం కురవడంతో పలు రోడ్లు, లోతట్టు పాంతాల్లో వాన నీరు నిలిచింది. ఇక రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రానున్న రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతటా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నట్లు తెలిపింది. ఈనెల 11న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే సూచించింది. ఈనెల 11 నుంచి 13 వరకు భారీ వర్షాలు నమోదవుతాయని, ఉత్తర, తూర్పు ప్రాంతంలోని జిల్లాల్లో అతిభారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని వివరించింది. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాగల 48 గంటల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని వివరించింది. చదవండి: గ్రామీణ రోడ్లకు విరివిగా నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్ -
29న బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 29న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంపైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఈశాన్య రుతుపవన వర్షాలు ఈనెల 28న పలు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ముందుగా కేరళ రాష్ట్రంతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఇవి ప్రారంభమవుతాయని తెలిపింది. ఈమేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభం కాగా.. సోమవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ జరిగింది. ఈనెల 28వ తేదీ నాటికి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల నుంచి, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా నైరుతి రుతుపవనాల ఉపసంహరణ పూర్తయ్యే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. -
శాంతించవమ్మా.. గంగమ్మా
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం విస్తరిస్తోంది. ఉత్తర ఈశాన్యంగా పయనిస్తూ బలపడి వాయుగుండంగా మారనుంది. ఒడిశా-బెంగాల్ తీరంలో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉన్నట్లు వాతావారణ కేంద్రం తెలిపింది. దాని ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మూసీకి పూజలు: పురానాపూల్ వద్ద మూసీకి హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ బుధవారం శాంతి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గంగమ్మ తల్లికి ఆయన పట్టువస్త్రాలు సమర్పించారు. శాంతి పూజలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. అనంతరం దర్గాలో మేయర్, మంత్రులు చాదర్ సమర్పించనున్నారు. లాలాపేటలో మంత్రి కేటీఆర్ భాగ్యనగరంలో గత కొన్ని రోజలుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి, లోతట్టు పాంత్రాలో ఉన్న కాలనీలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ లాలాపేటలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఆయన బాధితులకు రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. -
హైదరాబాద్‌లో హై అలర్ట్..
సాక్షి, హైదరాబాద్: ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రాన్ని వాన లతో ముంచెత్తుతున్నాయి. సీజన్ ప్రారంభమై రెండు వారాలు గడవకముందే నెల సాధారణ వర్షపాతం రికార్డును బ్రేక్ చేస్తున్నాయి. వరు సగా నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. మరోపక్క బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయు గుండంగా మారడంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవు తున్నాయి. దీని ప్రభావంతో మంగళ, బుధ వారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, గ్రేటర్ హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ఈ ఏడాది నైరుతి రుతుపవ నాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు చెరువులు, కుంటలు నిండి అలుగెత్తగా, ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. సీజన్లో సాధారణం కంటే 45 శాతం అధి కంగా వర్షాలు కురిశాయి. అక్టోబర్ 1 నుంచి ఈశాన్య రుతుపవనాల సీజన్ మొదలుకాగా, 4 రోజుల నుంచి రాష్ట్రంలో వానలు జోరుగా కురుస్తున్నాయి. అక్టోబర్‌లో రాష్ట్రంలో సగటున 9.55 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా సోమవారం ఉద యానికి 4.79 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వానల జోరు చూస్తుంటే మరో నాలుగైదు రోజుల్లో సాధారణ వర్షపాతాన్ని దాటే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలవారీగా ఇలా.. రాష్ట్రంలో ఆదివారం ఉదయం నుంచి సోమ వారం ఉదయం నాటికి 1.34 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 3.88 సెం.మీ., సంగారెడ్డిలో 3.53, మెదక్‌లో 3.3, జోగుళాంబ గద్వాలలో 3.29, నారాయణపేటలో 2.92, కామారెడ్డిలో 2.47, జయశంకర్ భూపాలపల్లిలో 2.0, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో ఒక సెంటీమీటరు కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలను విడుదల చేసింది. ఇప్పటివరకు 12 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 13 జిల్లాల్లో అధికం, 8 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. తిమ్మాజీపేటలో అత్యధికంగా 7 సెం.మీ. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేటలో సోమ వారం ఏకంగా 7 సెం.మీ. వర్షపాతం నమోదైం ది. వనపర్తి జిల్లా మదనాపూర్లో 6.6, గోపాల్ పేటలో 6.2, కొత్తకోటలో 4.9, గ్రేటర్ హైదరా బాద్ పరిధిలోని కాప్రాలో 4.6, మెదక్ జిల్లా టేక్మాల్‌లో 4.4, పీర్జాదిగూడలో 4.2, ఉప్పల్‌లో 4.1, ఓయూలో 4.0, చర్లపల్లి, బేగంపేటలో 3.8 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. గ్రేటర్ పరిధిలో కుండపోత సోమవారం గ్రేటర్ పరిధిలో పలుచోట్ల కుండ పోత వానలు కురిశాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జడివాన కురవడంతో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులపై నడుములో తున వాననీరు పోటెత్తింది. సగటున 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ముంపు సమస్యలపై డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. భారీ మోటార్లతో వరదనీటిని తోడాయి. రాగల 24 గంటల్లో వాయుగుండం ప్రభావంతో నగరంలో కుండపోత వాన కురవొచ్చనే వాతావరణ శాఖ హెచ్చరికతో బల్దియా హై అలర్ట్ ప్రకటించింది. సిబ్బందిని, అధికారులను అప్రమత్తం చేసింది. ఎడతెరిపి లేని వర్షానికి రాంనగర్ డివిజన్ సంజయ్నగర్బస్తీలో గోడ కూలి జయశ్రీ అనే ఆరేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. జీహెచ్ఎంసీ పరిధిలోని శిథిల భవనాల్లో నివసిస్తున్న వారిని తక్షణం సురక్షిత షెల్టర్లకు తరలించాలని మున్సిపల్ మంత్రి కేటీఆర్ బల్దియా అధికారులను ఆదేశించారు. జంటజలాశయాలకు భారీగా వరదనీరు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నగరానికి ఆనుకొని ఉన్న జంటజలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్ నిండుకుండల య్యా యి. సోమవారం నాటికి ఉస్మాన్‌సాగర్ (గండి పేట)లో గరిష్టమట్టం 1,790 అడుగులకు గాను 1,773.182 అడుగుల మేర నీరు చేరింది. ఈ జలాశయానికి 1,388 క్యూసెక్కుల వరద నీరు చేరినట్లు జలమండలి ప్రకటించింది. దీని పక్కనే ఉన్న హిమాయత్‌సాగర్ గరిష్టమట్టం 1,763.50 అడుగులకు ప్రస్తుతం 1,762 అడుగుల మేర నిల్వలున్నాయి. ఈ జలాశయానికి 1,666 క్యూò Üక్కుల వరదనీరు చేరుతోందని అధికారులు తెలిపారు. ఈ జలాశయం నీటిమట్టం 1,763 అడుగులకు చేరిన వెంటనే గేట్లను ఎత్తి మూసీలోకి వరదనీటిని వదిలిపెడతామని జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. గేట్లను ఎత్తివేసే అవకాశం ఉండడంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలన యంత్రాంగం, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులను అప్రమత్తం చేశామని ఆయన చెప్పారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయు గుండం సోమవారం తీవ్ర వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఉత్తరాంధ్రలోని నర్సాపూర్–విశాఖపట్నం మధ్య కాకినాడకు దగ్గరలో మంగళవారం తెల్లవారుజామున తీరాన్ని దాటే అవకాశం ఉందని వివరించింది. ఆ సమయంలో గరిష్టంగా గంటకు 75 కి.మీ. వేగంతో గాలులు వీయొచ్చని అంచనావేసింది. దీని ప్రభావంతో తెలంగాణలో మంగళ, బుధవారాల్లో చాలాచోట్ల మోస్తరు వానలు, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. -
విశాఖపట్నంలో భారీ వర్షం
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. మరి కొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు సమాచారం. విశాఖకు ఆగ్నేయంగా 310 కిలో మీటర్ల, కాకినాడకు 350 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతం కానున్నది. విశాఖ-నరసాపురం మధ్య ఇవాళ అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తీరం వెంబడి 45-60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. రాగల 3 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేందం తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. తూర్పుగోదావరి: జిల్లాలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. కోనసీమలోని అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సముద్రతీరానికి సందర్శకులు రావద్దని సూచించారు. కాకినాడ, రాజమండ్రి అమలాపురం, రామచంద్రపురం ఆర్టీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. కంట్రోల్‌రూమ్‌ల వివరాలు: వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ల నంబర్ల వివరాలు.. 1. కలెక్టరేట్ (కాకినాడ)- 18004253077 2. సబ్ కలెక్టర్ కార్యాలయం, రాజమహేంద్రవరం- 08832442344 3. సబ్ కలెక్టర్ కార్యాలయం, ఎటపాక- 08748285279 4. ఐటీడీఏ పీవో కార్యాలయం, రంపచోడవరం-18004252123 5. ఆర్డీవో కార్యాలయం, అమలాపురం-08856233100 6. ఆర్డీవో కార్యాలయం, కాకినాడ-08832368100 7. ఆర్డీవో కార్యాలయం, రామచంద్రాపురం-08857-245166 విశాఖపట్నం: జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. పరవాడలో 18 సెం.మీ, గాజువాకలో 17 సెం.మీ వర్షపాతం నమోదైంది. విశాఖ సిటీ, భీమిలిలో 16 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, జిల్లా అధికారులను కలెక్టర్ వినయ్ చంద్ అప్రమత్తం చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వాయుగుండం నేపథ్యంలో కలెక్టరేట్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. లెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నెంబర్లు: 0891-2590102, 0891-2590100. పశ్చిమ గోదావరి: పోలవరంలో భారీ వర్షం కారణంగా ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పర్యటన రద్దు అయింది. నేటి ఉదయం11గంటలకు పోలవరం చేరుకోవల్సిది. భారీ వర్షం, వాయుగుండం నేపథ్యంలో మంత్రి పర్యటన రద్దు అయినట్లు అధికారులు తెలిపారు. విజయనగరం: జిల్లాలోని ఏజెన్సీ కురపాం ప్రాంతంలో వర్షం కురుస్తోంది. అదే విధంగా జిల్లాలోని పలు చోట్ల అర్థరాత్రి నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. తెల్లవారు జాము నుంచి వర్షపు చినుకులు కురుస్తున్నాయి. వాయుగుండం నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైఎస్ఆర్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాపాగ్ని నదికి భారీగా వరద నీరు చేరుతోంది. వేంపల్లి ఎద్దుల కొండ వృషబచలేశ్వర స్వామి కొండ పైకి వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో అలిరెడ్డి పల్లె, తూపల్లె గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. చక్రాయపేట మండలంలో నదికి ఆనుకొని వేసిన వరి పంటలునీట మునిగాయి. (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); -
రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది. దీంతో కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు, ఒకటీ రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీవ్ర అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరానికి అనుకుని వాయువ్య బంగాళాఖాతం లో కేంద్రీకృతమై ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిమి వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న కారణంగా, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తా మీదగా దక్షిణ తమిళనాడు వరకూ ఈ అల్పపీడన ద్రోణి ఆవరించి ఉంది. దీంతోపాటు రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. -
'పశ్చిమ' అధికారులు అప్రమత్తం
ఏలూరు : రాబోయే 48 గంటలపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ...అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ తీరప్రాంత మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు. అలాగే ఏలూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేరళ ఉత్తర తీరం వద్ద ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్ధిరంగా కొనసాగుతోందని విశాఖ లోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడనం 24 గంటల్లో క్రమంగా ఉత్తర ఈశాన్య దిశగా పయనించే అవకాశముందని అధికారులు తెలిపారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ, కోస్తాంధ్రల్లో మరో 48గంటల వరకు అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
విశాఖ: అరేబియా సముద్రంలో కేరళ ఉత్తర తీరం వద్ద ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. అల్పపీడన ద్రోణి వల్ల తెలంగాణ, కోస్తాంధ్రల్లో మరో 48గంటల వరకు అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రభావం రాయలసీమ జిల్లాలపై ఉంటుందని తెలిపారు. తెలంగాణలో క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో భారీ వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2 నుంచి 4 సెంటీగ్రేడ్ల మేరకు పగటి ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. ఇక రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో శుక్రవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. *కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ వర్షం, తడిచిన ధాన్యం, ఆందోళనలో రైతన్నలు *తూర్పు గోదావరి జిల్లాలో ముమ్మిడివరం, ఉప్పలగుప్పంలో వర్షం *పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, తణకు, ఉండ్రాజవరం... భీమవరం, ఉండి, పాలకోడేరు, పాలకొల్లు, తాళ్లపూడిలో వర్షం *నల్లగొండ జిల్లా శాలిగౌరారం, నకిరేకల్‌లో వర్షం * మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం, మహబూబ్‌నగర్, జడ్చర్ల,వనపర్తి, నాగర్‌కర్నూలు మార్కెట్లలో తడిసిన ధాన్యం -
అకాల వర్షాలతో నలుగురి మృతి
తిరువనంతపురం/న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం: అరేబియా సముద్రంలో కేరళ ఉత్తర తీరం వద్ద ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా గురువారం దక్షిణాదిన పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాల రాకకు ముందే ఈదురు గాలులతో విరుచుకుపడ్డ అకాల వర్షాల తాకిడికి కేరళలో ఇద్దరు, తమిళనాడులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మళప్పురంలో ఒకరు, తిరువనంతపురంలో ఒక మహిళ మరణించినట్లు కేరళ అధికారులు తెలిపారు. తమిళనాడు నీలగిరి జిల్లాలో చెట్లు విరిగి పడటంతో తేయాకు తోటల్లో పనిచేసే ఇద్దరు మహిళలు మరణించారు. కేరళలోని ఎర్నాకుళం జంక్షన్లో రైలు పట్టాలు నీటమునగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా రూ.110 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు కేరళ రెవెన్యూ మంత్రి ఆదూర్ ప్రకాశ్ తెలిపారు. కోచి విమానాశ్రయంలో అత్యధికంగా 191.6 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అకాల వర్షాలకు భూతాపోన్నతే కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అకాల వర్షాల కారణంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేరళ ఉత్తర తీరం వద్ద నుంచి మహారాష్ట్ర వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో కొన్నిచోట్ల రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
ఒంగోలుపై కేంద్రకృతమైన అల్పపీడనం
విశాఖ : పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి వాయువ్య దిశగా ఒంగోలుపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్నట్లు విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా తీరాన్ని ఆనుకొని పశ్చమి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా అదే పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం నెలకొంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో అల్పపీడన ప్రభావం అధికంగా ఉండనుంది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు కూడా గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభావం చూపటంతో రాష్ట్రంలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. మరోవైపు భారీ వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. కాగా సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.