విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తా మీదగా దక్షిణ తమిళనాడు వరకూ ఈ అల్పపీడన ద్రోణి ఆవరించి ఉంది. దీంతోపాటు రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
Published Thu, Jul 17 2014 10:19 AM | Last Updated on Sat, Sep 2 2017 10:26 AM
Advertisement
Advertisement