కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి | depression in Arabian sea, Continuous rains in andhra pradesh | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

Published Fri, May 9 2014 10:51 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి - Sakshi

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ: అరేబియా సముద్రంలో కేరళ ఉత్తర తీరం వద్ద ఏర్పడిన  అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది.  అల్పపీడన ద్రోణి వల్ల తెలంగాణ, కోస్తాంధ్రల్లో మరో 48గంటల వరకు అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రభావం రాయలసీమ జిల్లాలపై ఉంటుందని తెలిపారు.

తెలంగాణలో క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో భారీ వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2 నుంచి 4 సెంటీగ్రేడ్ల మేరకు పగటి ఉష్ణోగ్రతలు  తగ్గనున్నాయి. ఇక రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో శుక్రవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

*కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ వర్షం, తడిచిన ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
*తూర్పు గోదావరి జిల్లాలో ముమ్మిడివరం, ఉప్పలగుప్పంలో వర్షం
*పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, తణకు, ఉండ్రాజవరం...
భీమవరం, ఉండి, పాలకోడేరు, పాలకొల్లు, తాళ్లపూడిలో వర్షం
*నల్లగొండ జిల్లా శాలిగౌరారం, నకిరేకల్లో వర్షం
* మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం, మహబూబ్‌నగర్,
జడ్చర్ల,వనపర్తి, నాగర్‌కర్నూలు మార్కెట్లలో తడిసిన ధాన్యం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement