
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి చేరువగా ఈనెల 9న అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం 48 గంటల్లో అది బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. ఈశాన్య రుతుపవనాల ప్రవేశం తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడనున్న తొలి అల్పపీడనం ఇదే.
దీని ప్రభావం ఎక్కువగా తమిళనాడుపై ఉంటుందని, దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమపైనా కొద్ది ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రం మీదుగా దిగువ నుంచి తూర్పుగాలులు వీస్తున్నాయి. రానున్న 2 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
చదవండి: ఈ పరిశ్రమలే రుజువు.. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
Comments
Please login to add a commentAdd a comment