ఈ నెలాఖరుకు శుభవార్త!
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ఆశాజనకంగా ఉండబోతున్నాయా? అవుననే అంటున్నాయి ముందస్తు వాతావరణ నివేదికలు. ఈ విషయాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి హర్ష వర్ధన్ సైతం బుధవారం లోక్ సభలో వెల్లడిందారు.
'నైరుతి రుతుపవనాలు మే చివరినాటికి గానీ.. జూన్ మొదటి వారంలో గానీ కేరళను తాకే అవకాశం ఉంది. అలాగే భారత వాతావరణ విభాగంతో పాటు అన్ని వాతావరణ సంస్థలు తమ ముందస్తు నివేదికల్లో ఈ సారి సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగానే నమోదవుతుందని చెప్పాయి' అని ప్రశ్నోత్తరాల సమయంలో హర్ష వర్థన్ లోక్సభలో వెల్లడించారు. 2005- 2014 మధ్య కాలంలో మాదిరిగానే సరైన సమయంలో రుతుపవనాలు కేరళకు రాబోతున్నాయని దీనికి సంబంధించిన ముందస్తు సూచనను మే 15న విడుదల చేస్తామని ఆయన తెలిపారు.