expect
-
IPOs: మరో రికార్డ్ దిశగా.. 28 కంపెనీలు.. రూ.38 వేల కోట్లు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) లోనూ ప్రైమరీ మార్కెట్ కళకళలాడుతోంది. తొలి అర్ధభాగం (ఏప్రిల్–సెప్టెంబర్) లో 31 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకురాగా.. ద్వితీయార్థంలోనూ 28 కంపెనీలు నిధుల సమీకరణకు తెరతీయనున్నాయి. తద్వారా రూ.38,000 కోట్లను సమకూర్చుకునే ప్రణాళికలు ప్రకటించాయి. వివరాలు చూద్దాం.. ముంబై: ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఐపీవోల ద్వారా 31 కంపెనీలు రూ. 26,300 కోట్లు సమీకరించాయి. ఇది రికార్డుకాగా.. సెకండాఫ్‌లో మరింత అధికంగా నిధుల సమీకరణకు తెరలేవనుంది. ప్రైమ్ డేటాబేస్ గణాంకాల ప్రకారం మరో 41 కంపెనీలు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. తద్వారా ఏకంగా రూ. 44,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నాయి. నిజానికి గతేడాది(2022–23) తొలి అర్ధభాగంతో పోలిస్తే ఇష్యూలు 14 నుంచి 31కు జంప్ చేసినప్పటికీ నిధుల సమీకరణ రూ. 35,456 కోట్ల నుంచి రూ. 26,300 కోట్లకు తగ్గింది. లిస్టింగ్ సన్నాహాలలో ఉన్న మొత్తం 69 కంపెనీలలో మూడు కొత్తతరం సాంకేతిక సంస్థలుకాగా.. ఉమ్మడిగా రూ. 12,000 కోట్ల సమీకరణపై కన్నేసినట్లు ప్రైమ్ డేటాబేస్ ఎండీ ప్రణవ్ హాల్దియా వెల్లడించారు. గతంలో జోరుగా ఈ ఏడాది తొలి అర్ధభాగం(సెప్టెంబర్)లో న్యూటెక్ సంస్థ యాత్రా మాత్రమే లిస్టయ్యింది. రూ.775 కోట్లు సమీకరించింది. అయితే గతేడాది దిగ్గజాలు పేటీఎమ్, జొమాటో, నైకా లిస్ట్‌కావడం గమనార్హం! ప్రస్తుతం మార్కెట్లు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా ద్వితీయార్థంలో పలు కంపెనీలు ఐపీవోలను చేపట్టనున్నట్లు హాల్దియా అభిప్రాయపడ్డారు. సుమారు రెండు దశాబ్దాల తదుపరి టాటా గ్రూప్ నుంచి టాటా టెక్నాలజీస్ లిస్ట్‌కానుంది. ఇంతక్రితం 2004లో బాంబే హౌస్ కంపెనీ.. ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ పబ్లిక్ ఇష్యూకి వచ్చిన విషయం విదితమే. ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ అనుబంధ కంపెనీ టాటా టెక్నాలజీస్ హై ఎండ్ టెక్ సొల్యూషన్స్ అందిస్తోంది. ఆటోమోటివ్ ఈఆర్అండ్డీ సర్వీసులు సమకూర్చుతున్న కంపెనీ ఐపీవోలో భాగంగా మాతృ సంస్థ టాటా మోటార్స్ 8.11 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నట్లు అంచనా. ఈ ఏడాది ఆగస్ట్, సెప్టెంబర్‌లలోనే అత్యధికంగా 21 కంపెనీలు ఐపీవోలు చేపట్టాయి. వీటిలో మ్యాన్‌కైండ్ ఫార్మా రూ.4,326 కోట్లు, జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.2,800 కోట్లు, ఆర్ఆర్ కేబుల్ రూ.1,964 కోట్లు సమీకరించాయి. అతితక్కువగా ప్లాజా వైర్స్ రూ. 67 కోట్లు అందుకుంది. ఓయో భారీగా ఆతిథ్య రంగ సేవలందించే ఓయో రూముల బ్రాండ్ కంపెనీ ఒరావెల్ స్టేస్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 8,430 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈ బాటలో టాటా టెక్నాలజీస్, జేఎన్‌కే ఇండియా, డోమ్ ఇండస్ట్రీస్, ఏపీజే సురేంద్ర పార్క్ హోటల్స్, ఈప్యాక్ డ్యురబుల్స్, బీఎల్ఎస్ ఈ సర్వీసెస్, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్, సెల్లో వరల్డ్, ఆర్కే స్వామి, ఫ్లెయిర్ రైటింగ్ ప్రొడక్ట్స్, గో డిజిట్ ఇన్సూరెన్స్, క్రెడో బ్రాండ్ మార్కెటింగ్ తదితరాలున్నట్లు బ్రోకింగ్ సంస్థ ఏంజెల్ వన్ పేర్కొంది. -
ప్యాకెట్ సైజ్ పెంచి ధరలు తగ్గించి.. వృద్ధిపై ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ఆశలు
న్యూఢిల్లీ: పరిస్థితులు తిరిగి గాడిన పడుతుండడంతో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ వృద్ధి పట్ల ఆశావహ అంచనాలతో ఉంది. ప్రకటనలు, మార్కెటింగ్‌పై వ్యయాలను పెంచడంతోపాటు, పెట్టుబడులను కూడా ఇతోధికం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని త్రైమాసికాల విరామం తర్వాత అవి తిరిగి అమ్మకాల్లో వృద్ధిని చూస్తున్నాయి. ద్రవ్యోల్బణం, ముడి సరకుల ధరలు తగ్గడం వాటికి అనుకూలిస్తోంది. దీంతో ప్యాకెట్లలో గ్రాములు పెంచడం, ధరల తగ్గింపు వంటి నిర్ణయాలతో వినియోగదారులను ఆకర్షించే చర్యలు తీసుకుంటున్నాయి. మార్చి త్రైమాసికంలో ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీల పనితీరును పరిశీలిస్తే.. హిందుస్తాన్ యూనిలీవర్, డాబర్, మారికో, గోద్రేజ్ కన్జ్యూమర్, ఐటీసీ, టాటా కన్జ్యూమర్, నెస్లే అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేశాయి. 2023–24లో ఎఫ్ఎంసీజీ వినియోగం క్రమంగా పుంజుకుంటుందన్న అంచనాను వ్యక్తం చేశాయి. ‘‘స్థిరమైన వృద్ధి అవకాశాలు బలపడ్డాయి. ఐదు త్రైమాసికాలుగా విక్రయాల్లో క్షీణత అనంతరం ఈ రంగం అమ్మకాల్లో వృద్ధిని చూసింది. పట్టణ వినియోగం స్థిరంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ క్షీణత ముగిసినట్టేనని సంకేతాలు కనిపిస్తున్నాయి’’అని మారికో ఎండీ, సీఈవో సౌగతగుప్తా తెలిపారు. ముఖ్యంగా ఆహార ఉత్పత్తులు ఎఫ్ఎంసీజీ వృద్ధిని నడిపిస్తున్నాయని చెప్పుకోవాలి. హోమ్, పర్సనల్ కేర్ ఉత్పత్తుల అమ్మకాలు కూడా సానుకూల శ్రేణిలోకి వచ్చేశాయి. సఫోలా, పారాచ్యూట్ తదితర ప్రముఖ బాండ్లతో ఉత్పత్తులను విక్రయించే మారికో లాభం మార్చి త్రైమాసికంలో 19 శాతం పెరిగి రూ.305 కోట్లుగా ఉండడం గమనార్హం. అమ్మకాలు 4 శాతం పెరిగాయి. మందగమనం ముగిసినట్టే.. ‘‘ఎఫ్ఎంసీజీ మార్కెట్లో మందగమనం ముగిసింది. అమ్మకాలతో మెరుగైన వాతావ రణం నెలకొంది. డిసెంబర్ క్వార్టర్లో సింగిల్ డిజిట్ క్షీణత ఉంటే, మార్చి త్రైమాసికంలో ఫ్లాట్‌గా విక్రయాలు ఉన్నాయి’’అని హెచ్‌యూఎల్ సీఎఫ్‌వో రితేష్ తివారీ తెలిపారు. ఇప్పటికీ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలోనే ఉన్నందున అమ్మకాలు క్రమంగా పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్టు చెప్పా రు. మార్చి త్రైమాసికంలో హెచ్‌యూఎల్ నికర అమ్మకాలు 11 శాతం పెరిగితే, నిరక లాభం సైతం 13 శాతం మేర పెరిగింది. అంతర్జాతీయంగా మందగమనం, ఎల్‌నినో కారణంగా వర్షాలపై నెలకొన్న అనిశ్చితులతో సమీప కాలంలో నిర్వహణ వాతావరణం ఆటుపోట్లను ఎదుర్కోవచ్చని హెచ్‌యూఎల్ భావిస్తోంది. 2023–24 సంవత్సరంలో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ భవిష్యత్ సానుకూలంగా ఉంటుందని, అమ్మకాలతోపాటు మార్జిన్లలోనూ మెరుగుదల ఉంటుందని నువమా గ్రూప్ ఈడీ అబ్నీష్రాయ్ అంచనా వేశారు. ‘‘ముడి సరుకుల ధరలు తగ్గాయి. దీంతో కంపెనీలు క్రమంగా ధరలను తగ్గించొచ్చు. లేదంటే గ్రాములను పెంచొచ్చు. అమ్మకాలు పెరిగితే ధరలపై ఒత్తిడి తగ్గుతుంది’’అని రాయ్ చెప్పారు. అయితే, ఎల్‌నినో, ఎఫ్ఎంసీజీ విభాగంలో పెద్ద సంస్థగా అవతరించాలని రిలయన్స్ లక్ష్యం విధించుకోవడం వంటి సవాళ్లు ఉన్నట్టు పేర్కొన్నారు. మరోవైపు గోద్రేజ్ కన్జ్యూమర్ మార్చి త్రైమాసికంలో అమ్మకాల్లో 11 శాతం వృద్ధిని చూసింది. ప్రస్తుత సానుకూల వాతావర ణం మరింత బలపడుతుందని, అమ్మకాల్లో వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నట్టు గోద్రేజ్ కన్జ్యూమర్ ఎండీ, సీఈవో సుధీర్ సీతాపతి తెలిపారు. ఇదీ చదవండి: బ్లాక్‌స్టోన్ చేతికి ఐజీఐ.. బెల్జియం డైమెండ్స్ సర్టిఫికేషన్ సంస్థ -
ఈ నెలాఖరుకు శుభవార్త!
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ఆశాజనకంగా ఉండబోతున్నాయా? అవుననే అంటున్నాయి ముందస్తు వాతావరణ నివేదికలు. ఈ విషయాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి హర్ష వర్ధన్ సైతం బుధవారం లోక్ సభలో వెల్లడిందారు. 'నైరుతి రుతుపవనాలు మే చివరినాటికి గానీ.. జూన్ మొదటి వారంలో గానీ కేరళను తాకే అవకాశం ఉంది. అలాగే భారత వాతావరణ విభాగంతో పాటు అన్ని వాతావరణ సంస్థలు తమ ముందస్తు నివేదికల్లో ఈ సారి సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగానే నమోదవుతుందని చెప్పాయి' అని ప్రశ్నోత్తరాల సమయంలో హర్ష వర్థన్ లోక్‌సభలో వెల్లడించారు. 2005- 2014 మధ్య కాలంలో మాదిరిగానే సరైన సమయంలో రుతుపవనాలు కేరళకు రాబోతున్నాయని దీనికి సంబంధించిన ముందస్తు సూచనను మే 15న విడుదల చేస్తామని ఆయన తెలిపారు. -
ముష్కరులపై చర్యలను ఆశిస్తున్నాం
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల దాడి ఘటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది. ఈ విషయంపై ఉగ్రవాదులపై పాక్ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని అమెరికా అత్యున్నత అధికారి ఒకరు తెలిపారు. దాడికి కుట్రపన్నిన ఉగ్రవాదులపై చర్యలకు ఉపక్రమిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. దక్షిణాసియాలో ఉగ్రవాదం అందరికీ సవాల్ విసురుతోందని అమెరికా వ్యాఖ్యానించింది. ఉగ్రవాద నిర్మూలనకు అన్ని దేశాలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చింది. మరోవైపు పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడిని పాకిస్థాన్ విదేశాంగశాఖ ఖండించింది. పఠాన్‌కోట్ మృతులకు సంతాపం తెలిపిన విదేశాంగ అధికారి కిర్పి.. ఉగ్రవాదాన్ని ఉమ్మడి సమస్యగా ప్రపంచ దేశాలు గుర్తించాలని కోరారు. భారత్ అందించిన సమాచారం ఆధారంగా పనిచేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.