రెండో దశ లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 26న జరగనున్నాయి. ఈ దశలో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 89 స్థానాలకు పోలింగ్ జరగనుంది. బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆ రోజు ఓటింగ్ జరగనుంది. అయితే ఆ రోజుల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది ఎన్నికల కమిషన్‌ను కూడా ఆందోళనకు గురిచేస్తోంది.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 26, రెండవ దశ ఓటింగ్ రోజున తూర్పు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో వేడి గాలులు వీయనున్నాయి. రాబోయే ఐదు రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో విపరీతమైన వేడి గాలులుల వీయనున్నాయనే అంచానాలున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటనున్నాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో రెండు రోజుల తర్వాత వేడిగాలు వీచే అవకాశం ఉంది. కర్ణాటకలో ఐదు రోజుల పాటు హిట్ వేవ్ ఉండనుంది. ఏప్రిల్ 26న ఈ రాష్ట్రాలన్నింటిలో రెండో దశ పోలింగ్ జరగనుంది.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం వేసవి సవాళ్లను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనుంది. పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలలోని ఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేయనున్నారు. ఓటర్లు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారాన్ని ప్రారంభించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment