దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. అసోంలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తూ, జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అసోం పొరుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా భారత వాతావరణశాఖ ఐదు రాష్ట్రాలకు రెడ్, 16 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. అలాగే దక్షిణ మధ్య భారతదేశంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
జమ్ముకశ్మీర్, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో వాతావరణం నిర్మలంగా ఉండే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో వాతావరణం సామాన్యంగా ఉండనుంది. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌తో పాటు ఉత్తర భారత్‌లోని రాష్ట్రాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో ఆదివారం 9 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. సోమవారం, మంగళవారాల్లో ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఈ జాబితాలో మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment