
అరేబియా సముద్రంలో అత్యంత తీవ్రమవుతున్న బిపర్ జోయ్ తుపాను రానున్న 36 గంటల్లో మరింత తీవ్రం కానుందని వాతావరణ శాఖ(ఐఎండీ) పేర్కొంది. మరో రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని ఐఎండీ ట్వీట్ చేసింది. జూన్ 08 రాత్రి 11.30 గంటలకు గోవాకిమ నైరుతి దిశలో 840 కిలోమీటర్లు, ముంబైకి పశ్చిమ నైరుతి దిశలో 870 కిలోమీటర్లు, ముంబైకి నైరుతిగా 901 కిలోమీటలర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు పేర్కొంది.
నిజానికి ఈ బిపర్ జోయ్ తుపాను తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా ఏర్పడి..నెమ్మది నెమ్మదిగా బలపడుతూ..రానున్న 36 గంటల్లో క్రమక్రమంగా తీవ్ర రూపం దాల్చనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు ఐఎండీ ట్విట్టర్‌లో తెలిపింది. ఈ తుపాను కారణంగా దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర సహా తీర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇదిలా ఉండగా ఈ తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. అలాగే సముద్రంలోకి వెళ్లిన వారు వెంటనే తిరిగి రావాలని హెచ్చరించడమే గాక జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేటను నిలిపేయాలని కోరింది.
(చదవండి: వాతావరణ శాఖ చల్లటి కబురు.. మరో 48 గంటల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు)
Comments
Please login to add a commentAdd a comment