Cyclone Biporjoy: Rajasthan Receives More Rainfall - Sakshi
Sakshi News home page

అల్పపీడనంగా మారుతున్న ‘బిపర్‌జోయ్‌’.. ఆ ‍ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ

Published Sun, Jun 18 2023 11:33 AM | Last Updated on Sun, Jun 18 2023 12:34 PM

Cyclone Biparjoy: Rajasthan Recieve More Rainfall - Sakshi

న్యూఢిల్లీ:  గుజరాత్‌ తీరప్రాంత జిల్లాలను అతలాకుతలం చేసిన బిపర్‌జోయ్‌ తుపాను తాజాగా రాజస్తాన్‌పై ప్రతాపం చూపుతోంది. దీని ప్రభావం కారణంగా రాజస్థాన్, గుజరాత్ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. బిపార్జోయ్ తుఫాను ప్రస్తుతం అల్పపీడనంగా మారుతోందని తెలిపింది. ముఖ్యంగా దక్షిణ రాజస్థాన్, ఉత్తర గుజరాత్‌లోని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో మత్స్యకారులు వెటకు వెళ్లద్దని హెచ్చరికలు జారీ చేశారు.

భారత వాతావరణ విభాగం (IMD) డైరెక్టర్ జనరల్, మృత్యుంజయ్ మహపాత్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం నుంచి బుధవారం వరకు తూర్పు, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో రుతుపవనాల పురోగతికి ఈ పరిస్థితులు అనుకూలంగా మారుతాయని తెలిపారు. బైపోర్‌జోయ్ గుజరాత్‌లోని తీరప్రాంతాల్లో విధ్వంసాన్ని సృష్టించింది ఆ ప్రాంత ప్రజల రోజూవారి జీవనాన్ని స్తంభింపచేసింది. ముఖ్యంగా కచ్ జిల్లాలో ఇది ఎక్కువ ప్రభావం చూపింది.

తెలుగు రాష్ట్రాలపై ప్రభావం..
సాధారణంగా ఈపాటికే ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచికొట్టాలి. కానీ, ఎర్రటి ఎండలు మాత్రం మే నెలను తలపిస్తున్నాయి. పైగా అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్‌ తుపాను.. రుతుపవనాలపై పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగానే కొనసాగుతుండగా.. వర్షాలు ఇంకా ఆలస్యంగా కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement