సాక్షి, గుంటూరు : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వేధింపులు పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిపై అక్రమ కేసు బనాయించి, మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. మహిళను మోసం చేశారంటూ పోలీసులు...ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. దీంతో టీజీవీ కృష్ణారెడ్డి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై టీజీవీ కృష్ణారెడ్డి భార్య అన్నపూర్ణ మాట్లాడుతూ... ‘ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు ఇంట్లోకి చొరబడ్డారు. వచ్చీ రావడంతోనే ఫోన్ల కోసం ఇళ్లంతా తిరిగారు. ఫోన్లు స్విచ్ఛాప్ చేయాలని బెదిరించారు. బాత్‌రూంలో ఉన్న ఆయనను (కృష్ణారెడ్డి) తక్షణమే తమతో రావాలని ఒత్తిడి చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే డీఎస్పీ ఆదేశాల మేరకే అరెస్ట్ చేస్తున్నామన్నారు. కేసు విషయాల గురించి ఏమీ చెప్పలేదు. జనవరి నుంచి కేసులతో నా భర్తను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment