పాలేరు బరిలోకి ‘నామా’ ! | Paleru by elections in nama | Sakshi
Sakshi News home page

పాలేరు బరిలోకి ‘నామా’ !

Published Fri, Apr 22 2016 2:39 AM | Last Updated on Wed, Oct 3 2018 7:42 PM

పాలేరు బరిలోకి ‘నామా’ ! - Sakshi

పాలేరు బరిలోకి ‘నామా’ !

* రాష్ట్ర టీడీపీలో చర్చ
* అధినేత నిర్ణయమే తరువాయి

సాక్షి, హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో పోటీపై రాష్ట్ర టీడీపీలో జోరుగా చర్చ జరుగుతోంది. అధికార టీఆర్‌ఎస్ నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అభ్యర్థిత్వం ఖరారైనట్లు ప్రకటన వెలువడడంతోనే టీడీపీలో కూడా పోటీపై చర్చ మొదలైంది. ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావును బరిలోకి దింపాలన్న డిమాండ్ పార్టీ జిల్లా కమిటీ నుంచి వచ్చింది. ఈ మేరకు గురువారం ఖమ్మంలో భేటీ అయిన జిల్లా నేతలు ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశారు. టీడీపీ అధినేత నిర్ణయం కోసం పార్టీవర్గాలు ఎదురుచూస్తున్నాయి.

టీడీపీ నుంచి తుమ్మల టీఆర్‌ఎస్‌లోకి రావడం, మంత్రిగా నియమితులవడం, ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం వరుసగా జరిగిపోయాయి. 2014 ఎన్నికల్లో తనకు పాలేరు అసెంబ్లీ టికె ట్ కావాలని తుమ్మల పట్టుబట్టినా కుదరలేదు. ఆయనకు పాలేరు టికెట్ రాకుండా నామా అడ్డుకున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు అదే పాలేరు నుంచి ఉప ఎన్నికలో తుమ్మల టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీకి దిగుతుండడంతో టీడీపీ కూడా బలమైన అభ్యర్థిని పోటీకి దింపాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement