సాక్షి, న్యూఢిల్లీ : హత్య కేసులో తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాహాబుద్దీన్ కరోనా కారణంగా కన్నుమూశారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రి వర్గాలు, ఢిల్లీలోని తీహార్ జైలు డీజీ సందీప్ గోయెల్ఈ విషయాన్ని ధృవీకరించారు. షాహాబుద్దీన్‌కు ఇటీవల కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే ఆరోగ్యం విషమించిన షాహాబుద్దీన్‌కు సరైన చికిత్స అందించాలని బుధవారం ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని, తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు గత ఏప్రిల్ 20 న దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.
బిహార్‌లోని సివాన్‌కు చెందిన షాహాబుద్దీన్ మరణంపై ఆర్జేడీనేత తేజశ్వి యాదవ్ సహా, పప్పు యాదవ్ పలువురు ఇతర నాయకులు ట్విటర్లో నివాళులర్పించారు. ఆయన అకాల మరణం బాధాకరమైన వార్త అని తేజస్వీ యాదవ్ ట్వీట్ చేశారు. ఆర్జేడీ కుటుంబానికి ఇది విచారకరమైన వార్త అని ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ తెలిపారు. పేద ప్రజల కోసం ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.
కాగా బిహార్ బాహుబలిగా వ్యవహరించే మహ్మద్ షాహాబుద్దీన్‌పై జీవిత ఖైదు తోపాటో 30 కి పైగా కేసులు నమోదయ్యాయి. బిహార్ నుంచి తిహార్ జైలుకు తీసుకురావాలని సుప్రీంకోర్టు 2018 ఫిబ్రవరి 15 న ఆదేశించింది. తిహార్‌కు ముందు భగల్‌పూర్, సివాన్ జైలులో కూడా సుదీర్ఘ శిక్ష అనుభవించాడు. 2018 లో బెయిల్ పొంది జైలు నుంచి బయటకువవచ్చినా బెయిల్ రద్దు కారణంగా తిరిగి జైలుకు వెళ్లారు. గతేడాది సెప్టెంబర్‌లో తండ్రి షేక్ మహ్మద్ హసీబుల్లా మరణించిన సమయంలో షాహాబుద్దీన్‌ను పెరోల్‌కు కూడా అనుమతి లభించలేదు.
చదవండి : ఘోరం: 14 మంది కోవిడ్ బాధితులు సజీవ దహనం
Comments
Please login to add a commentAdd a comment