Mohammad Shahabuddin
-
Bangladesh Political Crisis: బంగ్లా సారథిగా యూనుస్
ఢాకా: నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనుస్(84)ను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా నియమితులయ్యారు. ఈ హోదా ప్రధానమంత్రితో సమానమైనది. గురువారం అధ్యక్ష భవనం ‘బంగభవన్’లో అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ ఆయనతో ప్రమాణం చేయించారు. యూనుస్‌కు 16 మందితో కూడిన సలహాదారుల మండలి పాలనలో సహకరించనుంది. ఈ మండలికి ఎంపికైన వారిలో రిజర్వేషన్ కోటా ఉద్యమానికి నాయకత్వం వహించిన నాహిద్ ఇస్లాం, ఆసిఫ్ మహ్మూద్తోపాటు మహిళా హక్కుల కార్యకర్త ఫరీదా అఖ్తర్ తదితరులున్నారు. వీరితో కూడా అధ్యక్షుడు ప్రమాణం చేయించారు. పౌరులకు భద్రత కలి్పంచడానికి తన ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందుకు తనకు సాయపడాలని యూనుస్ ఈ సందర్భంగా అన్ని వర్గాల వారిని కోరారు. -
కరోనాతో ఆర్జేడీ మాజీ ఎంపీ షాహాబుద్దీన్ మృతి
సాక్షి, న్యూఢిల్లీ : హత్య కేసులో తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాహాబుద్దీన్ కరోనా కారణంగా కన్నుమూశారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రి వర్గాలు, ఢిల్లీలోని తీహార్ జైలు డీజీ సందీప్ గోయెల్ఈ విషయాన్ని ధృవీకరించారు. షాహాబుద్దీన్‌కు ఇటీవల కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే ఆరోగ్యం విషమించిన షాహాబుద్దీన్‌కు సరైన చికిత్స అందించాలని బుధవారం ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని, తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు గత ఏప్రిల్ 20 న దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. బిహార్‌లోని సివాన్‌కు చెందిన షాహాబుద్దీన్ మరణంపై ఆర్జేడీనేత తేజశ్వి యాదవ్ సహా, పప్పు యాదవ్ పలువురు ఇతర నాయకులు ట్విటర్లో నివాళులర్పించారు. ఆయన అకాల మరణం బాధాకరమైన వార్త అని తేజస్వీ యాదవ్ ట్వీట్ చేశారు. ఆర్జేడీ కుటుంబానికి ఇది విచారకరమైన వార్త అని ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ తెలిపారు. పేద ప్రజల కోసం ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. కాగా బిహార్ బాహుబలిగా వ్యవహరించే మహ్మద్ షాహాబుద్దీన్‌పై జీవిత ఖైదు తోపాటో 30 కి పైగా కేసులు నమోదయ్యాయి. బిహార్ నుంచి తిహార్ జైలుకు తీసుకురావాలని సుప్రీంకోర్టు 2018 ఫిబ్రవరి 15 న ఆదేశించింది. తిహార్‌కు ముందు భగల్పూర్, సివాన్ జైలులో కూడా సుదీర్ఘ శిక్ష అనుభవించాడు. 2018 లో బెయిల్ పొంది జైలు నుంచి బయటకువవచ్చినా బెయిల్ రద్దు కారణంగా తిరిగి జైలుకు వెళ్లారు. గతేడాది సెప్టెంబర్‌లో తండ్రి షేక్ మహ్మద్ హసీబుల్లా మరణించిన సమయంలో షాహాబుద్దీన్‌ను పెరోల్‌కు కూడా అనుమతి లభించలేదు. చదవండి : ఘోరం: 14 మంది కోవిడ్ బాధితులు సజీవ దహనం -
ఆధారాల్లేవు.. హత్యకేసులో మాజీ ఎంపీకి విముక్తి!
యూత్ కాంగ్రెస్ నేత హత్య కేసులో వివాదాస్పద మాజీ ఎంపీ, ఆర్జేడీ నేత మహహ్మద్ షాబుద్దీన్‌కు విముక్తి లభించింది. తగినన్ని ఆధారాలు లేవంటూ ఆయనను జెంషెడ్పూర్ కోర్టు నిర్దోషిగా విడిచిపెట్టింది. జెంషెడ్పూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రదీప్ మిశ్రాతోపాటు మరో ఇద్దరిని హత్య చేసినట్టు షాబుద్దీన్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ అభియోగాలను రుజువు చేసేందుకు తగినంతగా ఆధారాలను ప్రాసిక్యూషన్ సమర్పించలేకపోయిందని పేర్కొంటూ.. జెంషెడ్పూర్ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి అజిత్‌కుమార్ సింగ్ ఆయనను నిర్దోషిగా ప్రకటించారు. బిహార్‌లో పలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న షాబుద్దీన్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్నారు. ఆయన వీడియో కాన్ఫరేన్స్ ద్వారా సోమవారం కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నలుగురు నిందితులపై 2006లో కోర్టు అభియోగాలను కొట్టివేసింది. మరో ముగ్గురు విచారణలోనే చనిపోయారు. 1989 ఫిబ్రవరి 2న దుండగులు కాంగ్రెస్ నేత ప్రదీప్ మిశ్రా కారును ఆపి.. ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయనతోపాటు ఆయన స్నేహితులు జనార్దన్ చౌబే, ఆనంద్‌రావు ప్రాణాలు కోల్పోయారు. -
మాజీ ఎంపీ వర్సెస్ మాఫియా డాన్
న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఇద్దరు కరడుగట్టిన నేరస్తుల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షహబుద్దీన్, అండర్ వరల్డ్ డాన్ చోటారాజన్ వ్యవహారం అధికారులకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. తీహార్ జైలులో వీరిద్దరూ వేర్వేరు గదుల్లో ఉన్నారు. చోటారాజన్ ఉన్న గదిలో అధికారులు టీవీ ఏర్పాటు చేయడంపై షహబుద్దీన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తనకు కూడా టీవీ కావాలని అధికారులకు లేఖ రాశాడు. టీవీలో లేకపోవడంతో బోర్ కొడుతోందని, ఒంటరిగా ఫీలవుతున్నానని పేర్కొన్నాడు. రాజన్ గది నుంచి వస్తున్న మ్యూజిక్ తనకు నిద్రాభంగం కలిగిస్తోందని తెలిపాడు. 45 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న షహబుద్దీన్ ను తీహార్ నంబరు వన్ జైలులో ఉంచారు. కరడుగట్టిన నేరస్తులు ఉండడంతో తమిళనాడు ప్రత్యేక పోలీస్ జవాన్లతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. షహబుద్దీన్ అభ్యర్థనపై జైలు అధికారులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. -
షహాబుద్దీన్ బెయిల్ రద్దు
-
షహాబుద్దీన్ బెయిల్ రద్దు
ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షహాబుద్దీన్‌కు పట్నా హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దుచేసింది. రాజీవ్ రోషన్, అతడి ఇద్దరు సోదరుల హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడిన షహాబుద్దీన్.. 11 ఏళ్ల తర్వాత హైకోర్టు బెయిల్‌తో బయటకు వచ్చారు. అయితే ఆయన బయటకు రాగానే ఒక్కసారిగా అనుచరులు హల్చల్ చేశారు. దాంతోపాటు బాధిత కుటుంబాలు కూడా ఆయన బయటకు రావడం వల్ల తమకు ప్రాణాపాయం ఉందని చెప్పాయి. షహాబుద్దీన్‌కు పట్నా హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేయాలంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నితీశ్ కుమార్ ప్రభుత్వం కూడా బెయిల్ రద్దును కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లను శుక్రవారం విచారించిన సుప్రీం ధర్మాసనం.. షహాబుద్దీన్ బెయిల్‌ను రద్దుచేస్తూ ఉత్తర్వులిచ్చింది. అతడిని వెంటనే మళ్లీ జైలుకు తరలిస్తారని ప్రశాంత భూషణ్ తెలిపారు. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడంతో షహాబుద్దీన్ ఇవాళ మధ్యాహ్నం శివాన్ జిల్లా కోర్టులో లొంగిపోయారు. కాగా మహ్మద్ షాబుద్దీన్.. బిహార్ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద నేత. భయానకమైన నేరచరిత్ర, విజయవంతమైన రాజకీయ ప్రస్థానం.. ఈ రెండూ కలిపితే షాబుద్దీన్. బిహార్‌లో ఆయన పేరు వింటే ప్రత్యర్థులు, అధికార యంత్రాగం హడలిపోతారు. రెండు దశాబ్దాల పాటు నేరాలను, రాజకీయాలను సమాంతరంగా నడిపాడు. సొంత బలగాలను ఏర్పాటు చేసుకుని ఓ దశలో సమాంతర ప్రభుత్వాన్ని కూడా నడిపాడు. లాలూకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే షహాబుద్దీన్.. ఆయనకే తాను విధేయుడిగా ఉంటాను తప్ప నితీష్ కుమార్‌కు కాదని కూడా చెప్పాడు. చివరకు బెయిల్ రద్దు కావడంతో మాజీ ఎంపీతో పాటు మాజీ సీఎం లాలూకు కూడా ఎదురుదెబ్బ తగిలినట్లయింది. -
షాబుద్దీన్ నేరస్తుడు కాదు సంఘసేవకుడు
పట్నా: జంట హత్యల కేసులో యావజ్జీవ కారాగారశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాబుద్దీన్ క్రిమినల్ కాదట. సంఘసేవకుడట. ఈ మాటలన్నది కోర్టు కాదు.. ఆర్జేడీ యువజన విభాగం అధ్యక్షుడు, ఎంపీ శైలేష్ కుమార్ అలియాస్ బులో మండల్. షాబుద్దీన్ ఇటీవల బెయిల్‌పై విడుదల అయినందుకు వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. శివాన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి షాబుద్దీన్ నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారని, నేరస్తుడు కాదని శైలేష్ చెప్పారు. 'శివాన్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా షాబుద్దీన్‌కు పాపులారిటి ఉంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా ప్రజలు ఆయన్ను ఎన్నుకున్నారు' అని అన్నారు. షాబుద్దీన్ విడుదలపై బీజేపీ, మీడియా అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. షాబుద్దీన్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని, ఇది ప్రభుత్వ నిర్ణయంకాదని అన్నారు. గతంలో 300 మందిని హత్య చేసిన కేసులో రణవీర్ సేన చీఫ్ బ్రహ్మేశ్వర్ సింగ్ ముఖియాకు ఇదే కోర్టు బెయిల్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఆర్జేడీ-జేడీయూ ప్రభుత్వాన్ని నిందించడం తగదని శైలేష్ చెప్పారు. -
బిహార్ బాహుబలి.. రక్తచరిత్ర
మహ్మద్ షాబుద్దీన్.. బిహార్ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద నేత. భయానకమైన నేరచరిత్ర, విజయవంతమైన రాజకీయ ప్రస్థానం.. ఈ రెండూ కలిపితే షాబుద్దీన్. బిహార్‌లో ఆయన పేరు వింటే ప్రత్యర్థులు, అధికార యంత్రాగం హడలిపోతారు. రెండు దశాబ్దాల పాటు నేరాలను, రాజకీయాలను సమాంతరంగా నడిపాడు. సొంత బలగాలను ఏర్పాటు చేసుకుని ఓ దశలో సమాంతర ప్రభుత్వాన్ని కూడా నడిపాడు. హత్య కేసులో యావజ్జీవ కారాగారశిక్ష అనుభవిస్తున్న షాబుద్దీన్ ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు. బిహార్‌లో బాహుబలిగా పిలిచే షాబుద్దీన్.. బాహుబలి సినిమాలో ప్రభాస్ మాదిరి హీరో కాదు.. కరుడుగట్టిన విలన్. బిహార్‌లోని శివాన్ జిల్లాలో జన్మించిన షాబుద్దీన్‌పై 2000వ సంవత్సరం నాటికి 30కి పైగా కేసులు ఉన్నాయి. అక్రమాయుధాలు కలిగిఉండటం, బాంబు పేలుడు, కిడ్నాప్, హత్య కేసులు నమోదయ్యాయి. హుసేన్ గంజ్ పోలీస్ స్టేషన్లో కరుడుగట్టిన నేరగాడిగా అతనిపై కేసు నమోదు చేశారు. ఇంతటి నేరచరిత్ర ఉన్న షాబుద్దీన్ ఉన్నత విద్యావంతుడు కావడం ఆశ్చర్యకరమైన విషయం. పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ, పీహెచ్డీ చేశాడు. అయితే 19 ఏళ్ల వయసు నుంచే నేరాలబాట పట్టాడు. డిగ్రీ చదుకునే రోజుల్లో ఆయనపై తొలి కేసు నమోదైంది. షాబుద్దీన్ చదువుకుంటూనే క్రిమినల్‌గా ఎదుగుతూ, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చాడు. 1990లో ఆర్జేడీ యువజన విభాగంలో చేరిన షాబుద్దీన్ అదే ఏడాది ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచాడు. 1995లో మరోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆ తర్వాత లోక్‌సభకు పోటీచేసి 2008 వరకు వరుసగా నాలుగుసార్లు నెగ్గాడు. ఈ రెండు దశాబ్దాల కాలంలో షాబుద్దీన్ నేరాలు, రాజకీయాలను రెండింటినీ కొనసాగించాడు. పోలీసులపై దాడులకు పాల్పడటంతో పాటు ఆయన అనుచరులు దాదాపు 10 మంది పోలీసు అధికారులను చంపినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎదురొచ్చిన ప్రత్యర్థి రాజకీయ పార్టీ నేతలను కిడ్నాప్ చేయడం, చంపడం వంటి నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. లాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో షాబుద్దీన్‌పై కేసు నమోదు చేసిన శివాన్ జిల్లా ఎస్పీని వెంటనే బదిలీ చేశారు. జేడీయూ నేత నితీష్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రి అయ్యాక షాబుద్దీన్ నేర, రాజకీయ చరిత్రకు అడ్డుకట్టపడింది. షాబుద్దీన్‌ను అరెస్ట్ చేయించి ఆయనపై కేసుల విచారణకు రెండు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. కోర్టు ఐదు కేసుల్లో ఆయన్ను దోషిగా ప్రకటించగా, మరో 20 కేసులను ఎదుర్కొంటున్నాడు. జంట హత్యల కేసులో గతేడాది షాబుద్దీన్‌తో పాటు ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్షపడింది. కాగా బిహార్‌లో రాజకీయ సమీకరణాలు మారడం, నితీష్ ఆర్జేడీ మద్దతు తీసుకోవడం, ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాల్లో లాలు చక్రం తిప్పుతుండటం షాబుద్దీన్‌కు కలసివచ్చే అంశం. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలైన షాబుద్దీన్ భారీ కాన్వాయ్‌తో సొంతూరుకు వెళ్లారు. బిహార్‌లో జంగిల్ రాజ్ మళ్లీ వచ్చిందని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. -
11ఏళ్ల తర్వాత మాజీ ఎంపీ విడుదల
బెంగళూరు : మాజీ ఆర్జేడీ ఎంపీ మొహమ్మద్ షహబుద్దీన్ 11 ఏళ్ల అనంతరం జైలు నుంచి బయటికొచ్చారు. రాజీవ్ రోషన్, ఇద్దరు సోదరుల మర్డర్ కేసులో యావజ్జీవ శిక్ష పడిన ఆర్జేడీ ఎంపీకి పట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఆయన విడుదలయ్యారు. 2004లో గిరీశ్ రాజ్, సతీష్ రాజ్ అనే సోదరులను అపహరించుకుపోయి, యాసిడ్ పోసి మరీ హత్య చేశారనే నిర్థారణతో షహబుద్దీన్‌కు జైలు శిక్ష పడింది. ఈ ఘటనపై మృతుల తల్లి కళావతి దేవీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు విచారణలో షహబుద్దీన్‌కు సోదరుల అపహరణతో సంబంధం ఉందని తేలడంతో ప్రత్యేక న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. బెయిల్‌పై బయటికి వచ్చిన షషబుద్దీన్ మీడియాతో మాట్లాడారు. తనను కావాలనే ఇరికించినట్టు ప్రతిఒక్కరికీ తెలిసని, జైలు శిక్ష విధించిన కోర్టే, తనను విడుదల చేసిందని పేర్కొన్నారు. రాజకీయ కుట్రలతో తననేమి చేయలేరని, న్యాయస్థానాలకు తనకంటూ సొంత విధానాలు ఉంటాయని వెల్లడించారు. రాజకీయ కుట్రలకు తానెప్పుడూ పాల్పడలేదని చెప్పారు. 13 ఏళ్ల అనంతరం తన గ్రామానికి వెళ్తున్నట్టు, 26 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు తనతో ఎలా మెలిగారో అలానే ఇప్పుడు కూడా ప్రజలు తనని అంగీకరిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. గత పదేళ్లుగా తను ఎవరిని కలవలేకపోవడంపై విచారణ వ్యక్తంచేశారు. 2004 ఆగస్టు పదహారో తేదీన గిరీశ్, సతీష్, రాజీవ్ అనే ముగ్గురు సోదరులు కిడ్నాప్‌కు గురయ్యారు. అనంతరం గిరీశ్, సతీష్‌లు హత్యకు గురవ్వగా రాజీవ్ రోషన్ కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నాడు. సోదరుల హత్య కేసుకు రాజీవ్ రోషన్ సాక్ష్యం చెప్పాడు. అనంతరం రాజీవ్ రోషన్‌ను కూడా షహబుద్దీన్ కుమారుడు ఓసామా హత్య చేశారు. -
రియల్టర్‌పై కాల్పులు
అత్తాపూర్: కారులో వెళ్తున్న రియల్టర్‌పై దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... బండ్లగూడ పీ అండ్‌టీ కాలనీలో తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ సంయుక్త కార్యదర్శి మహ్మద్ షాబుద్దీన్(42) నివాసముంటున్నారు. ఇతను రియల్ఎస్టేట్ వ్యాపారంతో పాటు రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్‌ల్లో రెస్టారెంట్స్ నిర్వహిస్తున్నాడు. భూములు, ప్లాట్ విషయంలో ఇతనికి పలువురితో గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా షాబుద్దీన్ సోమవారం రాత్రి 12 గంటలకు తన ఇన్నోవా కారులో హైదర్‌గూడ బాపూఘాట్మీదుగా ఇంటికి బయలుదేరాడు. వెనుకే వచ్చిన ఇద్దరు దుండగులు హైదర్‌గూడ ఏజీకాలనీ వాటర్ ట్యాంక్ వద్ద షాబుద్దీన్ కారుపై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో కారు ముందు అద్దాలు పగిలిపోయాయి. అదృష్టవశాత్తు షాబుద్దీన్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే ఆయన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తనపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేశాడు. తనపై కాల్చిన బుల్లెట్ షెల్‌ను పోలీసులకు అప్పగించాడు. రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి కేసు నమోదు చేసి, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాలు... కాల్పులు జరిగిన తీరుపై పలు అనుమాలు వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రి షాబుద్దీన్ ఒంటరిగా వెళ్తున్న విషయం నిందితులకు ఎలా తెలుస్తుందని, ఇద్దరు వ్యక్తులు కారుపై కాల్పులు జరిపి పారిపోవడం వెనుక ఏదో ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, షాబుద్దీన్ తనకు ప్రాణహాని ఉందని, రివాల్వర్‌కు అనుమతి మంజూరు చేయాలని గతంలో పలుమార్లు దరఖాస్తు చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.