మాజీ ఎంపీ వర్సెస్ మాఫియా డాన్ | Shahabuddin vs Chhota Rajan in Tihar Jail | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీ వర్సెస్ మాఫియా డాన్

Published Fri, Mar 31 2017 2:26 PM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM

మాజీ ఎంపీ వర్సెస్ మాఫియా డాన్

మాజీ ఎంపీ వర్సెస్ మాఫియా డాన్

న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఇద్దరు కరడుగట్టిన నేరస్తుల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షహబుద్దీన్, అండర్ వరల్డ్ డాన్ చోటారాజన్ వ్యవహారం అధికారులకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. తీహార్ జైలులో వీరిద్దరూ వేర్వేరు గదుల్లో ఉన్నారు. చోటారాజన్ ఉన్న గదిలో అధికారులు టీవీ ఏర్పాటు చేయడంపై షహబుద్దీన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తనకు కూడా టీవీ కావాలని అధికారులకు లేఖ రాశాడు. టీవీలో లేకపోవడంతో బోర్ కొడుతోందని, ఒంటరిగా ఫీలవుతున్నానని పేర్కొన్నాడు. రాజన్ గది నుంచి వస్తున్న మ్యూజిక్ తనకు నిద్రాభంగం కలిగిస్తోందని తెలిపాడు.

45 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న షహబుద్దీన్ ను తీహార్ నంబరు వన్ జైలులో ఉంచారు. కరడుగట్టిన నేరస్తులు ఉండడంతో తమిళనాడు ప్రత్యేక పోలీస్ జవాన్లతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. షహబుద్దీన్ అభ్యర్థనపై జైలు అధికారులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement