తీహార్ జైలుకు భద్రత పెంపు | Security stepped up as Rajan lodged in Tihar Jail | Sakshi
Sakshi News home page

తీహార్ జైలుకు భద్రత పెంపు

Published Fri, Nov 20 2015 11:53 AM | Last Updated on Sat, Sep 15 2018 8:44 PM

తీహార్ జైలుకు భద్రత పెంపు - Sakshi

తీహార్ జైలుకు భద్రత పెంపు

న్యూఢిల్లీ: మాఫియా డాన్ ఛోటా రాజన్ ను తరలించడంతో తీహార్ జైలుకు భద్రత పెంచారు. ఛోటా రాజన్ ను ఉంచిన తీహార్ జైలు 2 పరిసరాల్లో అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి అంగుళం కవరయ్యేవిధంగా కెమెరాలు పెట్టారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో రాజన్ ను గురువారం తీహార్ జైలుకు తరలించారు.

ఈ నేపథ్యంలో 10 మంది హెడ్ వార్డర్స్, 10 మంది వార్డర్స్, ఒక డిప్యూటీ సూపరిండెంటెంట్, ఇద్దరు అసిస్టెంట్ సూపరిండెంటెంట్స్ తో భద్రత ఏర్పాటు చేసినట్టు జైలు డీజీ తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి భద్రత ఉల్లంఘన జరిగినా సహించబోమని సిబ్బందిని హెచ్చరించినట్టు చెప్పారు. జైలు బయట ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ బలగాలను మొహరించినట్టు వెల్లడించారు. ఛోటా రాజన్ పై నమోదైన 71 కేసులపై సీబీబీ దర్యాప్తు జరుపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement