గొడవ వద్దన్నందుకు క్షణికావేశంలో..! | Man arrested for opening fire at youth in delhi | Sakshi
Sakshi News home page

గొడవ వద్దన్నందుకు క్షణికావేశంలో..!

Published Sat, Jan 7 2017 12:15 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

గొడవ వద్దన్నందుకు క్షణికావేశంలో..! - Sakshi

గొడవ వద్దన్నందుకు క్షణికావేశంలో..!

న్యూఢిల్లీ: తన ఫ్రెండ్‌తో గొడవపడుతున్న వ్యక్తిని వారించినందుకు అతడు ఏకంగా తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన స్థానిక సర్దార్ బజార్ లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జడ్డూ అనే యువకుడితో గౌరవ్ అనే వ్యక్తి గురువారం రాత్రి గొడవకు దిగాడు. తాను ఇచ్చిన రూ.5 వేలు తిరిగివ్వాలని అడిగాడు. తనవద్ద మనీ లేవని తర్వాత ఇస్తానని చెప్పాడు. అయితే ఇప్పుడు డబ్బులు కావాలంటూ మరో వ్యక్తితో కలిసి గౌరవ్ గొడవకు దిగాడు. జడ్డూ పక్కనే ఉన్న అతడి స్నేహితుడు కేశవ్ కుమార్ గొడవవద్దని గౌరవ్‌ను వారించాడు. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన గౌరవ్ కేశవ్‌పై కాల్పులు జరిపి అక్కడినుంచి పరారయ్యాడు.

ఈ ఘటనపై స్థానికుల సహాయంతో జడ్డూ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. వారు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడ్డ యువకుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జడ్డూ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రధాన నిందితుడు గౌరవ్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడు గౌరవ్‌పై ఇదివరకే 15 చోరీ కేసులు నమోదయ్యాయని, ఇందులో కొన్ని హత్యాయత్నం ఆరోపణలున్నాయని చెప్పారు.  డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నందునే కాల్పులు జరిపినట్లు నిందితుడు గౌరవ్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. గౌరవ్ తిహార్ జైలు నుంచి రెండున్నర నెలలకిందటే విడుదలయ్యాడని, మరో నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement