
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఓ ప్రముఖ వ్యాపారిని జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. ఢిల్లీలోని హైసెక్యూరిటీ తీహార్ జైలు నుంచి రోహిణి ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తకు ఓ బెదిరింపు కాల్ వచ్చింది. వారి సంభాషణలో తనకు రూ.5 కోట్లు ఇవ్వాలని లేకపోతే నిన్ను చంపేస్తానంటూ జితేంద్ర గోగి అనే గ్యాంగ్‌స్టర్ హెచ్చరించాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా బెదిరింపు కాల్ సమాచారంతో జైలు గదుల్లో తనిఖీలు నిర్వహించగా సెల్ నెంబర్ 8లో ఉన్న గ్యాంగ్‌స్టర్ జితేంద్ర గోగి వద్ద 3 మొబైల్ ఫోన్లు లభించాయి. అతడికి వద్దకు ఫోన్లు ఎలా వచ్చాయనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇప్పటికే గ్యాంగ్‌స్టర్ గోగి తలపై ఢిల్లీ పోలీసులు రూ.4 లక్షలు, హర్యానా పోలీసులు రూ.2 లక్షలు రివార్డు ప్రకటించారు. 2019లో ఢిల్లీలోని నరేలాలో స్థానిక నాయకుడు వీరేంద్రమన్‌ను చంపిన ఘటనలో గోగి అతని అనుచరులు అరెస్టై తీహార్ జైలులో ఉంటున్నారు. 2019లో జరిగిన ఈ ఘటనలో వీరేంద్రమన్ శరీరంలోకి 26 బుల్లెట్లను పేల్చి అతి దారుణంగా హత్యచేసిన సంగతి తెలిసిందే. (యూపీలో మరో గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్)
Comments
Please login to add a commentAdd a comment