ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షహాబుద్దీన్‌కు పట్నా హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దుచేసింది. రాజీవ్ రోషన్, అతడి ఇద్దరు సోదరుల హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడిన షహాబుద్దీన్.. 11 ఏళ్ల తర్వాత హైకోర్టు బెయిల్‌తో బయటకు వచ్చారు. అయితే ఆయన బయటకు రాగానే ఒక్కసారిగా అనుచరులు హల్‌చల్ చేశారు.