bail cancelled
-
హీరా గోల్డ్ MD నౌహీరా షేక్ బెయిల్ రద్దు చేసిన సుప్రీం
-
హీరాగోల్డ్ స్కామ్.. నౌహీరా షేక్ బెయిల్ రద్దు
సాక్షి,ఢిల్లీ:ప్రజల నుంచి భారీగా అక్రమ డిపాజిట్లు సేకరించి ఎగ్గొట్టిన కేసులో ప్రధాన నిందితురాలు హీరా గోల్డ్ ఎండీ నౌహీరా షేక్‌కు షాక్ తగిలింది. ఈ కేసులో ఆమెకు గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను శుక్రవారం(అక్టోబర్ 18) సుప్రీంకోర్టు రద్దు చేసింది.డిపాజిట్‌దారుల నుంచి హీరాగోల్డ్ అక్రమంగా సుమారు రూ.5వేల కోట్ల వరకు సేకరించింది.అయితే పెట్టుబడులను తిరిగి చెల్లించడంలో నౌహీరా షేక్ విఫలమైంది. దీంతో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా హైకోర్టు బెయిలివ్వడంతో విడుదలైంది. తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడంతో ఆమె తిరిగి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇదీ చదవండి: ఆ ముగ్గురి మధ్యే గూడు పుఠాణి -
టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసు: మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు
సాక్షి, చిత్తూరు: పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణకు చుక్కెదురయ్యింది. చిత్తూరు కోర్టు బెయిల్ రద్దు చేసింది. నవంబర్ 30లోగా పోలీసులకు లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ రద్దు చేయాలని చిత్తూరు వన్ టౌన్ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ కేసులో మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు ప్రభుత్వ టీచర్లు, మిగిలిన వారు నారాయణకు చెందిన స్కూల్ సిబ్బంది ఉన్నారు. చదవండి: కార్పొరేట్ విద్యా మాఫియా అధిపతి నారాయణ చరిత్ర ఇదే.. కాగా, నారాయణ విద్యా సంస్థలపై మొదటి నుంచి వివాదాలున్నాయి. విద్యార్థులపై అధిక ఒత్తిడి తెస్తారనే ఆరోపణలున్నాయి. తమ విద్యాసంస్థల్లో లక్షల మందిని జాయిన్ చేసుకుంటారు. కొంచెం బాగా చదివే వారిని ఎంచుకుంటారు. వారి కోసం పరీక్షల సమయంలో పేపర్ లీకేజీ చేయించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు తెప్పించి పబ్లిసిటీ చేయించుకోవడం పరిపాటిగా మారిందని అనేకమంది చెబుతున్న మాట. ఆ విద్యాసంస్థల్లో నిర్భంద విద్యతో మానసిక ఒత్తిడికి లోనైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలున్నాయి. గత టీడీపీ హయాంలోనే పదుల సంఖ్యలో విద్యార్థులు బలవన్మరాణానికి పాల్పడ్డారు. మంత్రిగా ఉన్న నారాయణపై ఎలాంటి కేసుల్లేకుండా చేసుకోవడంపై గత ప్రభుత్వంపై ఆరోపణలొచ్చాయి. -
ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు
న్యూఢిల్లీ: లఖీంపూర్‌ఖేరీ ఘటనలో నిందితుడు ఆశిష్ మిశ్రా బెయిల్‌ను సుప్రీంకోర్టు సోమవారం రద్దు చేసింది. వారంలో లొంగిపోవాలని ఆదేశించింది. అలహాబాద్ హైకోర్టులో బాధితులకు సరైన న్యాయం జరగలేదని అభిప్రాయపడింది. ‘‘సాక్ష్యాలను కోర్టు హ్రస్వదృష్టితో వీక్షించింది. అసంబద్దమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఎఫ్ఐఆర్లోని అంశాలకు అనవసర ప్రాధాన్యమిచ్చింది’’ అంటూ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘‘బెయిల్ మంజూరులో హైకోర్టు పరిధి దాటి వ్యవహరించింది. అసంబద్ధ అంశాలను పరిగణనలోకి తీసుకుంది. విచారణలో పాల్గొనేందుకు బాధితులకున్న హక్కును నిరాకరించింది. బెయిలిచ్చేందుకు తొందర పడింది. వీటన్నింటినీ గమనించిన మీదట బెయిల్‌ను రద్దు చేస్తున్నాం’’ అని తెలిపింది. మిశ్రా మళ్లీ బెయిల్ కోరవచ్చని ధర్మాసనం చెప్పింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ దానిపై మూణ్నెల్ల లోపు హైకోర్టు సమగ్ర విచారణ జరపవచ్చని పేర్కొంది. యూపీలోని లఖీంపూర్‌ఖేరీలో గతేడాది అక్టోబర్‌లో రైతు నిరసనల సందర్భంగా నిరసనకారులపైకి కారు దూసుకుపోయిన ఘటనలో నలుగురు మరణించారు. ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గత ఫిబ్రవరిలో ఆయనకు బెయిల్ రాగా దాని రద్దు కోరుతూ బాధిత కుటుంబాలు సుప్రీంను ఆశ్రయించాయి. బాధితులకు హక్కుంది బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా తమ లాయర్ వీడియో కనెక్షన్ పోవడంతో వాదన విన్పించలేకపోయామన్న బాధితుల వాదనను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఈ విషయంలో హైకోర్టు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసుల్లో ప్రభుత్వం, నిందితుడి వాదనల ఆధారంగా తీర్పులిస్తారనే అభిప్రాయం ఇటీవలి దాకా ఉండేది. బాధితులకు ఈ విచారణలో భాగస్వామ్యం ఉండదన్నట్టుగా భావించేవారు. కానీ వారికీ విచారణలో పాల్గొనే హక్కుంటుంది’’ అని చేసింది. ఈ కేసులో బాధితులకు సక్రమ హియరింగ్‌లో పాల్గొనే హక్కు లభించలేదని అభిప్రాయపడింది. బెయిల్ మంజూరు సమయంలో కోర్టులు ప్రాథమిక అంశాలను పరిశీలించవచ్చు. ప్రస్తుత కేసు తీవ్రతను, ఆరోపణలు రుజువైతే పడే శిక్ష తీవ్రతను, నిందితుడు పారిపోయే, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలను, అతని విడుదల సమాజంపై చూపే ప్రభావాన్ని అంచనా వేయడంలో హైకోర్టు హ్రస్వదృష్టితో వ్యవహరించింది. బెయిల్ మంజూరు మార్గదర్శకాలను నిర్లక్ష్యం చేసింది’’ అని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎఫ్ఐఆర్నే సర్వస్వంగా పరిగణించకూడదని హితవు పలికింది. మంత్రి తప్పుకోవాలి: కాంగ్రెస్ ఆశిష్ బెయిల్ రద్దు నేపథ్యంలో ఆయన తండ్రి, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామాను ప్రధాని మోదీ ఎప్పుడు కోరతా రని కాంగ్రెస్ ప్రశ్నించింది. మోదీ ప్రభుత్వం రైతులను ఎన్నాళ్లు అణచివేస్తుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ప్రశ్నించారు. రైతులపై అధికారుల సాక్షిగా అన్యాయం, దౌర్జన్యం జరుగుతున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. వారికి న్యాయం కోసం అందరూ మద్దతివ్వాలన్నారు. చదవండి: భారత్‌కు బ్రిటన్ ప్రధాని.. నేరుగా మోదీ సొంత రాష్ట్రంలోనే -
మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు బిగుస్తోన్న ఉచ్చు
సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు గురువారం ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది మార్చి నెలలో రాయదుర్గంలో ఎన్నికల అధికారులను బెదిరించిన కేసులో కాల్వ శ్రీనివాస్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మాజీ మంత్రితో సహా 24 మంది టీడీపీ కార్యకర్తలకు అనంతపురం కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. బెయిల్ ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అలాగే ముగ్గురు పిల్లలు ఉన్న టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. కాగా గతంలో తన అనుచరులతో కలిసి ఎన్నికల అధికారులను కాల్వ శ్రీనివాస్ బెదిరించిన విషయం తెలిసిందే. -
షహాబుద్దీన్ బెయిల్ రద్దు
-
షహాబుద్దీన్ బెయిల్ రద్దు
ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షహాబుద్దీన్‌కు పట్నా హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దుచేసింది. రాజీవ్ రోషన్, అతడి ఇద్దరు సోదరుల హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడిన షహాబుద్దీన్.. 11 ఏళ్ల తర్వాత హైకోర్టు బెయిల్‌తో బయటకు వచ్చారు. అయితే ఆయన బయటకు రాగానే ఒక్కసారిగా అనుచరులు హల్చల్ చేశారు. దాంతోపాటు బాధిత కుటుంబాలు కూడా ఆయన బయటకు రావడం వల్ల తమకు ప్రాణాపాయం ఉందని చెప్పాయి. షహాబుద్దీన్‌కు పట్నా హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేయాలంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నితీశ్ కుమార్ ప్రభుత్వం కూడా బెయిల్ రద్దును కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లను శుక్రవారం విచారించిన సుప్రీం ధర్మాసనం.. షహాబుద్దీన్ బెయిల్‌ను రద్దుచేస్తూ ఉత్తర్వులిచ్చింది. అతడిని వెంటనే మళ్లీ జైలుకు తరలిస్తారని ప్రశాంత భూషణ్ తెలిపారు. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడంతో షహాబుద్దీన్ ఇవాళ మధ్యాహ్నం శివాన్ జిల్లా కోర్టులో లొంగిపోయారు. కాగా మహ్మద్ షాబుద్దీన్.. బిహార్ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద నేత. భయానకమైన నేరచరిత్ర, విజయవంతమైన రాజకీయ ప్రస్థానం.. ఈ రెండూ కలిపితే షాబుద్దీన్. బిహార్‌లో ఆయన పేరు వింటే ప్రత్యర్థులు, అధికార యంత్రాగం హడలిపోతారు. రెండు దశాబ్దాల పాటు నేరాలను, రాజకీయాలను సమాంతరంగా నడిపాడు. సొంత బలగాలను ఏర్పాటు చేసుకుని ఓ దశలో సమాంతర ప్రభుత్వాన్ని కూడా నడిపాడు. లాలూకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే షహాబుద్దీన్.. ఆయనకే తాను విధేయుడిగా ఉంటాను తప్ప నితీష్ కుమార్‌కు కాదని కూడా చెప్పాడు. చివరకు బెయిల్ రద్దు కావడంతో మాజీ ఎంపీతో పాటు మాజీ సీఎం లాలూకు కూడా ఎదురుదెబ్బ తగిలినట్లయింది. -
రేవంత్ బెయిల్‌పై సుప్రీంను ఆశ్రయించిన ఏసీబీ
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయటాన్ని సవాల్ చేస్తూ ఏసీబీ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రేవంత్ బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ అడ్వకేట్ జనరల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి, ఉదయ్‌సింహా, సెబాస్టియన్లకు బెయిల్ రద్దు చేయాలని ఏసీబీ అధికారులు ఈ పిటిషన్లో పేర్కొన్నారు. -
బెదిరించాడు... బెయిల్ రద్దయింది
కర్నూలు : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఓ విద్యుత్ అధికారి బెయిలును...ఫిర్యాదుదారుడిని బెదిరిస్తున్నందుకు న్యాయస్థానం రద్దు చేసింది. వివరాల్లోకి వెళ్తే... గత మార్చిలో ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ ట్రాన్స్‌కో అసిస్టెంట్ డివిజన్ ఇంజినీర్ చంద్రశేఖర్‌కు అదే నెల చివరిలో బెయిల్ మంజూరైంది. అయితే ఆయన ఫిర్యాదుదారు వెంకటేశప్పను బెదిరింపులకు గురి చేస్తుండటంతో బాధితుడు ఏసీబీ కోర్టు పీపీ వెంకటేశ్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన బెయిల్ రద్దు చేయాలని విన్నవించటంతో అందుకు కోర్టు శనివారం సమ్మతించింది. -
ఇక చాలు.. జైలుకెళ్లి కూర్చోండి!
ఆరోగ్యం బాగోలేదంటూ బెయిల్ తీసుకుని.. ఎన్నికల ప్రచారపర్వంలో మాత్రం మహా దూకుడు ప్రదర్శిస్తున్న హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా (79)కి ఢిల్లీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ఆదివారం మళ్లీ వెళ్లి జైల్లో కూర్చోవాలని ఆదేశించింది. చౌతాలా బెయిల్‌ను రద్దు చేసిన కోర్టు.. ఇక ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడా పాల్గొనకూడదని ఆదేశించింది. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చౌతాలా.. విద్యాశాఖలో ఉపాధ్యాయ నియామకాల్లో అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో ఆయనకు పదేళ్ల జైలుశిక్ష పడింది. ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టుకున్నట్లు కూడా కేసు నమోదై, దానిమీద కూడా విచారణ జరిగింది. అయితే, 2013 మే నేలలో తనకు ఆరోగ్యం బాగోలేదని, గుండె సమస్య ఉందని చెప్పి తీహార్ జైలు నుంచి బెయిల్ మీద బయట పడ్డారు. ఇప్పుడు మళ్లీ ఒకవేళ చౌతాలాకు ఆరోగ్యం బాగోలేదని, ఆయన ఇబ్బంది పడుతున్నారని జైలు అధికారులు భావిస్తే ప్రభుత్వరంగంలోని ఎయిమ్స్‌కు మాత్రమే పంపాలని కోర్టు చెప్పింది. అయితే, బెయిల్ నిబంధనలలో తాను ప్రజలను కలవకూడదన్న విషయం ఎక్కడా లేదని, అలాంటప్పుడు తనను ఎన్నికల ప్రచారం చేయనివ్వకపోవడం సమంజసం కాదని చౌతాలా విలేకరులతో అన్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో మళ్లీ తమ పార్టీ విజయం సాధించడం ఖాయమని, ఆయన జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారని చౌతాలా కుమారుడు అభయ్ (51) అంటున్నారు. కానీ, సుప్రీంకోర్టులో కేసు గెలిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఎందుకంటే.. రెండేళ్లకు మించి శిక్ష పడినవాళ్లు ఎలాంటి పదవులు అనుభవించడానికి గానీ, ఎన్నికల్లో పోటీ చేయడానికి గానీ వీల్లేదు. -
పిన్నెల్లి లక్ష్మారెడ్డి బెయిల్ రద్దు
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి బెయిల్ రద్దయింది. ఆయనపై తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను గురజాల కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అమలుచేసేందుకు పోలీసులు పిన్నెల్లి ఇంటికి వెళ్లగా, ఆయన అప్పటికే అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇంతకుముందు మార్చి 30వ తేదీన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గుంటూరు జిల్లా మాచర్లలోని 29వ వార్డు పోలింగ్ స్టేషన్లోకి లక్ష్మారెడ్డి వెళ్లి అక్కడ గందరగోళం సృష్టించారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఇతర పార్టీలకు చెందిన ఏజెంట్లపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పార్టీకి చెందిన కార్యకర్తలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించడమే కాక, ఈ విషయంలో అధికారులను కూడా బెదిరించారు. అదే సమయంలో అక్కడున్న ఈవీఎంను నేలకేసి పగలగొట్టారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని లక్ష్మారెడ్డిని అక్కడినుంచి బయటకు పంపేశారు. ఈ సందర్భంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ కూడా జరిగింది. ఆ కేసులో ఇంతకుముందు పిన్నెల్లి లక్ష్మారెడ్డికి బెయిల్ మంజూరు కాగా, తాజాగా గురజాల కోర్టు ఆ బెయిల్‌ను రద్దు చేసింది.