సాక్షి,ఢిల్లీ:ప్రజల నుంచి భారీగా అక్రమ డిపాజిట్లు సేకరించి ఎగ్గొట్టిన కేసులో ప్రధాన నిందితురాలు హీరా గోల్డ్ ఎండీ నౌహీరా షేక్‌కు షాక్ తగిలింది. ఈ కేసులో ఆమెకు గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను శుక్రవారం(అక్టోబర్ 18) సుప్రీంకోర్టు రద్దు చేసింది.డిపాజిట్‌దారుల నుంచి హీరాగోల్డ్ అక్రమంగా సుమారు రూ.5వేల కోట్ల వరకు సేకరించింది.
అయితే పెట్టుబడులను తిరిగి చెల్లించడంలో నౌహీరా షేక్ విఫలమైంది. దీంతో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా హైకోర్టు బెయిలివ్వడంతో విడుదలైంది. తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడంతో ఆమె తిరిగి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదీ చదవండి: ఆ ముగ్గురి మధ్యే గూడు పుఠాణి
Comments
Please login to add a commentAdd a comment