heera group
-
హీరా గోల్డ్ MD నౌహీరా షేక్ బెయిల్ రద్దు చేసిన సుప్రీం
-
హీరాగోల్డ్ స్కామ్.. నౌహీరా షేక్ బెయిల్ రద్దు
సాక్షి,ఢిల్లీ:ప్రజల నుంచి భారీగా అక్రమ డిపాజిట్లు సేకరించి ఎగ్గొట్టిన కేసులో ప్రధాన నిందితురాలు హీరా గోల్డ్ ఎండీ నౌహీరా షేక్‌కు షాక్ తగిలింది. ఈ కేసులో ఆమెకు గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను శుక్రవారం(అక్టోబర్ 18) సుప్రీంకోర్టు రద్దు చేసింది.డిపాజిట్‌దారుల నుంచి హీరాగోల్డ్ అక్రమంగా సుమారు రూ.5వేల కోట్ల వరకు సేకరించింది.అయితే పెట్టుబడులను తిరిగి చెల్లించడంలో నౌహీరా షేక్ విఫలమైంది. దీంతో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా హైకోర్టు బెయిలివ్వడంతో విడుదలైంది. తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడంతో ఆమె తిరిగి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇదీ చదవండి: ఆ ముగ్గురి మధ్యే గూడు పుఠాణి -
ఈడీ దూకుడు.. మరోసారి హీరా గ్రూప్‌పై దాడులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి హీరా గ్రూప్‌పై ఈడీ దాడులు చేపట్టింది. తెల్లవారుజాము నుంచి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. నౌహిరా షేక్ ఇల్లు,ఆఫీసుల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కోట్ల రూపాయలు నిధులు గోల్మాల్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. విదేశీ పెట్టుబడులపై అధికారులు ఆరా తీస్తున్నారు.నౌహిరా ఆస్తులను ఒక్కొక్కటిగా ఈడీ అటాచ్ చేస్తోంది. టోలీ చౌక్‌లోని 81 ప్లాట్లను స్వాధీనం చేసుకున్న ఈడీ... ఇప్పటి వరకు రూ.380 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. మరో రూ.600 కోట్లపై చిలుకు ఆస్తులపై ఈడీ విచారణ జరుపుతోంది. దేశవ్యాప్తంగా నౌహిరా షేక్‌పై 60కి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రజల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి ఆస్తులను కూడా పెట్టుకున్నారని ఆరోపణలపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నౌహీరా షేక్‌పై గతంలో కేసు నమోదు చేశారు. -
బండ్ల గణేష్ కొడుకు కొత్త వివాదం..
-
హీరా గోల్డ్ కుంభకోణం..రూ.33.06 కోట్ల నౌహీరా షేక్ ఆస్తుల అటాచ్
హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్‌కు భారీ షాక్ తగిలింది. హీరా గోల్డ్‌లో రూ.5వేల కోట్ల మేర మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై నౌహీరా షేక్‌ను ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.33 కోట్లు విలువ చేసే నౌహీరా షేక్‌కు చెందిన 24 ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈదీ ఇప్పటి వరకు రూ.400 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ హీరా ఆస్తుల్ని జప్తు చేస్తుండగా.. 36 శాతం అధిక వడ్డీ ఆశచూపి అమాయకుల వద్ద నుంచి డిపాజిట్లు సేకరించింది. తిరిగి వాటిని చెల్లించడంలో విఫలం కావడంతో దేశ వ్యాప్తంగా డిపాజిటర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పలు స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని కేసు విచారణ చేపట్టారు. హీరా గోల్డ్ కుంభకోణం వల్ల దాదాపు 1.72 లక్షల మంది ఇన్వెస్టర్లు మోసపోయినట్లు అంచనా. మనీలాండరింగ్ కేసులో 2018 అక్టోబర్ 16వ తేదీన నౌహీరా షేక్‌ను అరెస్టు చేశారు. -
హీరా గోల్డ్ కేసులో ఈడీ విచారణకు నౌహీరా షేక్
-
హీరా కేసులో సుప్రీంకు సీసీఎస్!
సాక్షి, హైదరాబాద్: స్కీముల పేరుతో రూ.వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేసులో నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. స్కామ్‌కు సంబంధించిన కేసులు అన్నింటి నీ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌కు (ఎస్ఎఫ్ఐఓ) అప్పగించాల్సిందిగా ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం అనుమతి మంజూరు చేయడంతో సీసీఎస్ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో కొన్ని చిన్నచిన్న వ్యాపారాలు చేసిన నౌహీరా షేక్ 2010–11లో హీరా ఇస్లామిక్ బిజినెస్ గ్రూప్ పేరుతో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్‌లో ఉన్న 15 సంస్థలకూ నౌహీరా నే నేతృత్వం వహిస్తున్నారు. తన సంస్థల వ్యాపార లావాదేవీలకు సంబంధించి నౌహీరా షేక్ ఏ విభాగానికీ సరైన రికార్డులు సమరి్పంచలేదు. అయినప్పటికీ ఈమెపై నమోదైన కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు అనేక మార్గాల్లో సమాచారం సేకరించారు. దీని ప్రకారం హీరా గ్రూప్ వార్షిక టర్నోవర్ ఆరేళ్లల్లో కొన్ని వందల రెట్లు పెరిగిందని గుర్తించారు. 2010–11లో రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్ టర్నోవర్... 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటేసింది. ఇప్పటి వరకు దాదాపు రూ.6 వేల కోట్ల వ్యాపారం చేసినట్లు నివేదికలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి రికార్డులు ఎక్కడా లేవు. సర్కార్ గ్రీన్‌సిగ్నల్... హీరా గ్రూప్ భారీగా డిపాజిట్లు సేకరించి మోసం చేసినట్లు, ఆ నిధుల్ని సొంత అవసరాలకు వినియోగించుకున్నట్లు సీసీఎస్ పోలీసులు తేల్చారు. ఈ గ్రూప్‌పై మొత్తం 8 కేసులు నమోదు కాగా.. హీరా గ్రూప్ లావాదేవీలపై ఈడీకి సమాచారం ఇవ్వడంతో కేసు నమోదైంది. గతంలో దాఖలైన ఓ పిటి షన్ను విచారించిన రాష్ట్ర హైకోర్టు హీరా గ్రూప్‌పై నమోదైన కేసుల్ని ఎస్‌ఎఫ్‌ఐఓకు బదిలీ చేయాలం టూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కేసులను ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు చేయజాలదని, దర్యాప్తు పూర్తి చేసిన 7 కేసుల్లో పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని సీసీఎస్ పోలీసులు చెప్తున్నారు. హైకోర్టు ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టులో సవాల్‌కు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. సర్కారు ఈ మేరకు సోమవారం అనుమతి మంజూరు చేసింది. -
బెయిల్‌పై ఇలా.. కస్టడీకి అలా..!
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా రూ.వందల కోట్ల స్కామ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నౌహీరా షేక్ చంచల్‌గూడ జైలు నుంచి గురువారం ఇలా బయటకు వచ్చి... అలా అరెస్టయ్యారు. ఈమెపై ఇక్కడ నమోదైన కేసుల్లో హైకోర్టు గత వారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో బయటకు వచ్చిన ఆమెను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఆ రాష్ట్రంలో నౌహీరాపై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారీ స్కామ్‌కు పాల్పడిన నౌహీరా షేక్‌ను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు 2018 అక్టోబర్ 16న అరెస్టు చేశారు. ఆపై దేశ వ్యాప్తంగా కేసులు నమోదు కావడంతో వరుస అరెస్టులు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్ర, బెంగళూరుల్లోని జైళ్లకు వెళ్లి వచ్చిన నౌహీరా చంచల్గూడలోని మహిళా జైలుకు చేరారు. ఈమెపై నమోదైన కేసుల్ని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి (ఎస్ఎఫ్ఐఏ) బదిలీ చేసిన హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ గత నెలాఖరి వారంలో ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్‌పై విడుదల కావడానికి రూ.5 కోట్లు డిపాజిట్ చేయాలని, రెండు పూచీకత్తులు సమర్పించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని షరతులు విధించింది. ఈ నిబంధనలను పూర్తి చేసిన నౌహీరా షేక్ గురువారం విడుదలయ్యారు. ఆమెకు తెలంగాణలో బెయిల్ మంజూరైన విషయం తెలుసుకున్న ముంబై ఎకనమికల్ అఫెన్సెస్ వింగ్ (ఈవోడబ్ల్యూ) పోలీసులు పీటీ వారంట్లతో చంచల్‌గూడ జైలు వద్దకు వచ్చారు. జైలు నుంచి బయటకు వస్తున్న నౌహీరాను అదుపులోకి తీసుకుని రోడ్డు మార్గంలో అక్కడకు తరలించారు. అక్కడి కోర్టులో శుక్రవారం హాజరుపరచడానికి సన్నాహాలు చేస్తున్నారు. చంచల్‌గూడ జైలు వద్ద నౌహీరాను అదుపులోకి తీసుకునే సందర్భంలో ఆమె న్యాయవాదులకు, మహారాష్ట్ర పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. -
చైన్ దందా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గొలుసుకట్టు దందాలకు అడ్డుకట్ట పడటంలేదు. ఇటీవలి కాలంలో క్యూనెట్, హీరా గ్రూపు ఉదంతాలు వెలుగుచూసినా కొత్త పేర్లు, ఐడియాలతో జనాల జేబుకు చిల్లు పెట్టేందుకు నయా మార్గాల్లో పుట్టుకొస్తూనే ఉన్నాయి. వేగంగా డబ్బు రెట్టింపు చేస్తామని ఆశచూపుతూ మధ్యతరగతి ప్రజల జీవితా లతో ఆటలాడుకుంటున్నాయి. తాజాగా సెర్ఫా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట హైదరాబాద్‌లో ఓ కొత్త కంపెనీ వెలిసింది. మధ్యతరగతి కుటుంబాలే లక్ష్యంగా వ్యాపారం సాగిస్తోంది. ఏడాదిలో లక్షాధి కారులు కావచ్చని అరచేతిలో స్వర్గం చూపిస్తూ అమాయకుల నుంచి భారీగా దండుకుంటోంది. ఎలా చేస్తున్నారు..? సెర్ఫా కంపెనీలో చేరాలంటే ముందుగా రూ. 18 వేలు కట్టాలి. దానికి సమాన విలువ అని చెబుతూ రెండు 100 గ్రాముల బరువున్న ట్యాబ్లెట్ల డబ్బాలు అంట గడతారు. కట్టిన డబ్బు వృథా కాలేదు అనే భావన కస్టమర్‌కు కలిగేలా సంతృప్తి పడేలా నూరిపోస్తారు. వాస్తవానికి ఆ ట్యాబ్లెట్ల విలువ మార్కెట్లో రూ. 1,000–2,000కు మించదు. తరువాత వారికి ఒక ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు. అంతకుముందే బ్యాంకు, ఆధార్ ఖాతాల వివరాలు తీసుకొని తొలుత ఖాతాలో రూ. 2 వేలు జమచేస్తారు. ఇక అక్కడ నుంచి ఖాతాదారు తరఫున ఎంత మంది చేరితే అన్ని రూ. 1,200 చొప్పున ఖాతాలో జమ చేస్తామని ఆశచూపుతారు. బంధువులు, స్నేహితులను చేర్పించమంటూ మానవ సంబంధాలపై వ్యాపారం నడిపిస్తున్నారు. వారు తమ కంపెనీలో చేరే ప్రతి ఒక్కరినీ పార్ట్నర్ని అని చెబుతుండటం గమనార్హం. ఏడాదిన్నర కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తున్నారట.. వాస్తవానికి ఈ కంపెనీని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) వద్ద 2018 ఏప్రిల్ 26న విశాఖపట్నం కేంద్రంగా రిజిష్ట్రేషన్ చేశారు. అంటే దీని వయసు ఏడాదిన్నరలోపే. కానీ ఇందులో పనిచేసే ఉద్యోగులు మాత్రం తాము 2016 నుంచి ఈ కంపెనీలో చేస్తున్నామని, ఎంటెక్, ఎంబీఏలు చదివి వేల రూపాయల వేతనాలు వదులకొని ఇందులో భాగస్వాములుగా చేరామని గొప్పలు చెబుతున్నారు. ప్రతి వారినీ కంపెనీలో భాగస్వాములంటూ సంబోధించడంతో వెనకా ముందు చూడకుండా పేదలు దిగువ మధ్యతరగతి మహిళలు, నిరుద్యోగులు అప్పు చేసి మరీ పెట్టుబడి పెడుతున్నారు. క్యూనెట్ ప్రెస్‌మీట్‌తో ఖాతాదారుల్లో అనుమానాలు.. ఇటీవల క్యూనెట్ మోసాలపై సైబరాబాద్ పోలీసులు పెట్టిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలుసుకుని ఇందులో చేరిన ఖాతాదారులు కొందరు ఆలోచనలో పడ్డారు. ఈ కంపెనీ ప్రతినిధులు ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ కాదని చెబుతున్నా.. అదేబాటలో నడుస్తుండటంతో అనుమానం వచ్చి తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడం మొదలుపెట్టారు. కానీ, వారిని కంపెనీ ప్రతినిధులు దబాయిస్తున్నారు. తమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని, కోర్టుకు లాగుతామని బెదిరిస్తున్నారు. దీంతో బాధితులు ‘సాక్షి’ని ఆశ్రయించారు. అందరిలాగానే వెళ్లిన సాక్షి ప్రతినిధికి కూడా కంపెనీ ఉద్యోగులు అరచేతిలో స్వర్గం చూపే ప్రయత్నం చేశారు. ఈ తతంగాన్నంతా ‘సాక్షి’ రికార్డు చేసింది. తరువాత దీనిపై వివరణ కోరగా.. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని తామెవరినీ మోసం చేయడం లేదని చెప్పుకొచ్చారు. చిక్కుకున్నాక మోసం.. ఈ దందాలే మానవ సంబంధాలు, మాటలే పెట్టుబడులు. మోసంలో చిక్కుకున్నాక.. తమ డబ్బును ఎలాగైనా తిరిగి వసూలు చేసుకోవాలని, బంధువులను, స్నేహితులను ఇందులో చేరుస్తున్నారు. ఫలితంగా మోసం వెలుగుచూసాక.. బంధాలు తెగిపోతున్నాయి. ఇలాంటి బాధితుల్లో అధికంగా సాఫ్ట్వేర్, ఇతర ప్రైవేటు, ఎంటెక్, ఎంబీఏలు చదివిన గ్రాడ్యుయేట్లు కావడం గమనార్హం. డబ్బులిమ్మంటే బెదిరిస్తున్నారు.. మొదట్లో ఇదేదో మామూలు స్కీం అనుకున్నా. అందుకే పొరుగింటావిడ చెప్పిందని చేరాను. మొన్న క్యూనెట్ గురించి వార్తల్లో చదివా. రెండూ ఒకేరకంగా ఉండటంతో కంపెనీ ప్రతినిధులను నిలదీశా. వారు కంపెనీకి అనుమతులు ఉన్నాయన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మాత్రం లీగల్ యాక్షన్ తీసుకుంటామని తిరిగి మమ్మల్నే బెదిరిస్తున్నారు. – తులసి, గృహిణి, కేపీహెచ్‌బీ కాలనీ పేరేదైనా.. చివరి లక్ష్యం మోసమే..! హైదరాబాద్‌లో రకరకాల పేర్లతో అక్రమార్కులు జనాల జేబులకు చిల్లు పెడుతున్నారు. అందుకు పోంజి, మల్టీలెవల్ మార్కెటింగ్, హెర్బల్ ఇలా తదితర మార్గాల్లో దందాలు చేస్తున్నారు. అందరి లక్ష్యం ఒకటే.. జనాల నుంచి తక్కువ సమయంలో అందినకాడికి దండుకోవడం. క్యూనెట్: రాష్ట్ర రాజధాని ఇటీవల వెలుగుచూసిన మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం విలువ దాదాపు రూ. 1,000 కోట్లపైనే. ఉద్యోగానికి రాజీనామా చేసిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ. 25 లక్షలు పెట్టుబడి పెట్టి దారుణంగా మోసపోయాడు. తనతోపాటు స్నేహితులు, బంధువులనూ చేర్పించాడు. వారి వద్ద మొహం చెల్లక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. హీరా: ఇదో రకమైన పోంజి స్కీం. అధిక వడ్డీ ఆశజూపి హైదరాబాద్ కేంద్రంగా సాగిన దందా ఇది. దీని విలువ ఏకంగా రూ. 5,000 కోట్లు. ఈ పథకంలో చేరిన వారిలోనూ అధిక శాతం విద్యావంతులు, గ్రాడ్యుయేట్లే ఉండటం గమనార్హం. ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ఏ సంస్థా అధిక వడ్డీ చెల్లించదన్న చిన్న పాయింట్‌ను బాధితులెవరూ గుర్తించకపోవడం కుంభకోణానికి అసలు కారణం. కరక్కాయలు: రోజుకు కిలో కరక్కాయలు దంచిపెడితే రూ. 1,000 ఇస్తామని ఆశచూపి కోట్ల రూపాయలు దండుకున్న విషయం తెలిసిందే. నెల్లూరుకు చెందిన ఓ కేటుగాడు ప్రారంభించిన ఈ దందాలో చిక్కి 650 మంది మహిళలు దాదాపు రూ.8.3 కోట్ల వరకు పోగొట్టుకున్నారు. -
‘హీరా’ టు ‘ఐఎంఏ’
సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరు కేంద్రంగా చోటు చేసుకుని దేశ వ్యాప్తంగా సంచనలం సృష్టించిన పోజీ స్కామ్ ఐ మానిటరీ అడ్వైజరీకి (ఐఎంఏ) మూలం హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌గా తెలుస్తోంది. నౌహీరా షేక్‌కు చెందిన ఈ సంస్థల్లో కొన్నాళ్ళు పని చేసిన మన్సూర్ఖాన్ బెంగళూరు వెళ్లి సొంతంగా ఐఎంఏను ప్రారంభించినట్లు సమాచారం. ఇతడి విషవృక్షం విస్తరించడంలో అక్కడి రాజకీయ నాయకులు, మత గురువుల పాత్ర సైతం ఉందని బాధితుడు, రిటైర్డ్ గెజిటెడ్ లెక్చరర్ ఎం.మహబూబ్ బాష ‘సాక్షి’కి తెలిపారు. నగరానికి సంబంధించి ఆరుగురు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ముగ్గురు బాధితులకు బుధవారం నోటీసులు జారీ చేశారు. బెంగళూరుకు చెందిన మన్సూర్ ఖాన్ కొన్నాళ్లు నగరంలో నివసించాడు. అప్పట్లో మాసబ్‌ట్యాంక్‌లోని హీరా గ్రూప్ కార్యాలయంలో కన్సల్టెంట్‌గా పని చేశాడు. పోజీ స్కామ్స్ నిర్వహణలో ఉండే లోటుపాట్లను తెలుసుకున్న మన్సూర్ ఆపై తన మకాంను బెంగళూరుకు మార్చాడు. అక్కడి శివాజీనగర్‌లో ఐఎంఏ కార్యాలయాన్ని స్థాపించి డిపాజిట్లు సేకరించడం మొదలుపెట్టాడు. బంగారం వ్యాపారం చేయడంతో పాటు ప్రింటింగ్ ప్రెస్, హాస్పిటల్, మెడికల్ షాపులు, స్కూల్, అపార్ట్మెంట్స్, సూపర్మార్కెట్స్ సైతం నిర్వహించింది. వివిధ స్కీముల పేరుతో డిపాజిట్లు సేకరించింది. శివాజీనగర్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే, కొందరు రాజకీయ నాయకులతో పాటు మతగురువులు సైతం మన్సూర్‌కు సహకరించారని మహబూబ్‌బాష తెలిపారు. వారు చెప్పడం, బెదిరించడం తదితర చర్యల కారణంగా అనేక మంది అప్పటికే బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఉన్న తమ డిపాజిట్లను విత్‌డ్రా చేసుకుని ఐఎంఏలో పెట్టుబడులు పెట్టారన్నారు. ఐఎంఏ కర్ణాటక మొత్తం విస్తరించిందని, ఆపై దేశంలోని ఇతర మెట్రో నగరాల్లోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసిందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని వరంగల్, మెదక్, నిర్మల్‌ల్లోనూ బాధితులు ఉన్నారు. ఇప్పటికే హీరా గ్రూప్ చేసిన నేరాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఎంఐఎం నేత షాబాజ్ అహ్మద్ ఖాన్ ఐఎంఏ బాధితులకూ అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రానికి షాబాజ్‌ను 57 మంది బాధితులు సంప్రదించారు. వీరికి అవసరమైన న్యాయసహాయం అందించడానికి చర్యలు తీసుకుంటామని షాబాజ్ ఖాన్ ‘సాక్షి’కి తెలిపారు. ఆరుగురు బాధితుల ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకున్న నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) బుధవారం మహబూబ్ బాషతో పాటు ఆయన కుమారుడు, కుమార్తెకు నోటీసులు జారీ చేశారు. గురువారం సీసీఎస్ కార్యాలయానికి వచ్చి దర్యాప్తు అ«ధికారి ఎదుట హాజరుకావాలని, ఐఎంఏలో పెట్టుబడులకు సంబంధించిన పూర్తి ఆధారాల అసలు ప్రతులు, గుర్తింపు కార్డులు తీసుకురావాలని అందులో కోరారు. వీరి నుంచి గురువారం వాంగ్మూలాలు సైతం నమోదు చేసే అవకాశం ఉంది. -
హీరాగ్రూప్ కుంభకోణంలో ఈడీ ముందడుగు..!
సాక్షి, హైదరాబాద్ : చిన్న మొత్తాలకు భారీ పెద్ద మొత్తాలను తిరిగిస్తామని చెప్పి వేల కోట్ల రూపాయలు కాజేసిన హీరాగ్రూప్ పెట్టుబడిదారులకు కుచ్చుటోపీ పెట్టిన హీరాగ్రూప్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్డైరెక్టరేట్ ముందుడుగు వేసింది. ఈ బోగస్ సంస్థకు చెందిన రూ.299.98 కోట్ల ఆస్తులను ఈడీ శుక్రవారం అటాచ్ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో హీరాగ్రూప్‌నకు చెందిన రూ.277.29 కోట్ల విలువైన స్థిరాస్తులను, బ్యాంకుల్లో ఉన్న బ్యాలెన్స్ రూ.22.69 కోట్లను అటాచ్ చేస్తున్నట్టు ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది. 96 చోట్ల సంస్థ స్థిరాస్తులు ఉన్నట్టు ఈడీ పేర్కొంది. ఇళ్లు, ప్లాట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, వ్యవసాయ భూములు ఈ జాబితాలో ఉన్నాయి. హీరా గ్రూప్ పేరుతో నౌహీరా షేక్ ప్రజల వద్ద నుంచి అక్రమంగా రూ.5600 కోట్ల డిపాజిట్లు వసూలు చేసిందని వెల్లడించింది. మనీలాండరింగ్ నియంత్రణ చట్టం-2002 కింద నౌహీరాపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. (చదవండి : ఈడీ కస్టడీకి నౌహీరా ) -
హీరా కుంభకోణంపై దర్యాప్తు ఇలాగేనా?
సాక్షి, హైదరాబాద్: చిన్న మొత్తాలకు భారీ పెద్ద మొత్తాలను తిరిగిస్తామని చెప్పి రూ.50 వేల కోట్ల మేరకు కాజేసిన హీరా గ్రూప్‌పై 2012లోనే కేసు నమోదైనా ఇప్పటివరకూ ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని తెలంగాణ పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే గతేడాది వరకూ ఆ కంపెనీ ఎండీ నౌహీరా షేక్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగింది. ఎఫ్ఐఆర్ నమోదైన ఏడేళ్లకు ఎండీని అరెస్ట్ చేసేంత జాప్యం ఎందుకు జరిగిందని, పోలీసుల దర్యాప్తు తీరు నత్తనడకగా ఉంటే సీబీఐ దర్యాప్తు ఒక్కటే మిగిలిన మార్గమని బాధితులు భావిస్తున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. హీరా గ్రూప్‌పై నమోదైన ఎఫ్ఐఆర్ల దర్యాప్తుల ప్రగతిని సమగ్రంగా అందజేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 16కుపైగా బోగస్ కంపెనీలతో హీరా గ్రూప్ జనాన్ని మోసం చేసిందని హీరా గ్రూప్ బాధితుల సంఘం అధ్యక్షుడు సహబాజ్ అహ్మద్ ఖాన్ దాఖలు చేసిన పిల్‌ను సోమవారం హైకోర్టు మరోసారి విచారించింది. జనం నుంచి మోసపూరితంగా వసూలు చేసిన సొమ్ము రూ.50 వేల కోట్లని, అయితే ఆ కంపెనీలకు చెందిన 240 బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.25 కోట్ల పైచిలుకు మాత్రమే సొమ్ములున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. -
హీరా కుంభకోణంపై స్పందించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: హీరా గ్రూపు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే విషయంలో వైఖరి ఏమిటో తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంది. ఆ గ్రూపు వ్యవస్థాపకురాలు నౌహీరా షేక్ అరెస్టు, దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హీరా గ్రూపు యాజమాన్యం తన కంపెనీల ద్వారా రూ.50వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని, ఈ కేసును సీబీఐకి అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హీరా గ్రూపు బాధితుల సంఘం అధ్యక్షుడు షహబాజ్ అహ్మద్ ఖాన్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
నౌహీరా షేక్ విడుదలకు హైకోర్టు నో..
సాక్షి, హైదరాబాద్: ప్రజల నుంచి పెద్దమొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి, వాటిని తిరిగి చెల్లించకుండా ఎగవేసిన హీరా గ్రూపు అధినేత్రి నౌహీరా షేక్‌ను జైలు నుం చి విడుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. చంచల్‌గూడ జైలులో 6 నెలలుగా రిమాండ్ ఖైదీగా ఉన్న తనను విడుదల చేయాలని చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ పోలీసులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే నౌహీ రాపై నమోదైన కేసుల రికార్డులను తమ ముందుంచాలని న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. -
ముగిసిన నౌహీరా షేక్ కస్టడీ
సాక్షి, హైదరాబాద్ : హీరా గ్రూపు సంస్థ అధినేత్రి నౌహీరా షేక్ పోలీస్ కస్టడీ పూర్తయింది. 7 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు కస్టడీ అనంతరం ఆమెను నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు నౌహీరాను 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ కోసం చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు. సీసీఎస్ పోలీసులు 7 రోజుల కస్టడీలో అనేక విషయాలపై ఆరా తీశారు. దేశ వ్యాప్తంగా అక్రమ డిపాజిట్లు, ఉగ్రవాదులతో ఉన్న లింకులపై ఆరా తీశారు. -
హీరా గ్రూప్‌కు ఈడీ వేడి!
సాక్షి, హైదరాబాద్: ఒక కంపెనీ లేదు.. మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్ లేదు.. కనీసం క్రయవిక్రయ దుకాణాలు సైతం లేవు.. అయినప్పటికీ కేవలం స్కీముల పేరుతో రూ.వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా నౌహీరా షేక్ చుట్టూ ఉచ్చు బిగించడానికి రంగం సిద్ధం చేస్తోంది. హీరా సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో కొందరు డమ్మీలు ఉన్నారని, మనీల్యాండరింగ్‌లో భాగంగానే ఈ పెట్టుబడులు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. నౌహీరాతో పాటు ఆమె సంస్థలపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్న ఈడీ గురువారం సీసీఎస్ అధికారులతో భేటీ అయింది. రిటర్నుల్లో తేడాలు.. హీరా గ్రూప్ సంస్థ ఆరేళ్లల్లో రూ.6 వేల కోట్లు టర్నోవర్ చేసినట్లు గతంలో రిటర్నులు దాఖలు చేసింది. 2010–11లో కేవలం రూ.27 లక్షలుగా ఉన్న గ్రూ ప్ టర్నోవర్.. 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటేసింది. అయి తే దీనికి సంబంధించి పూర్తి రికార్డులు ఎక్కడా అందుబాటులో లేవు. ఆదాయపు పన్ను (ఐటీ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో), రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) వీటిలో ఒక్కో విభాగానికి ఒక్కో రిటర్ను ఫైల్ చేసింది. కనీసం డిపాజిట్‌దారుల జాబితా సైతం బయటపెట్టకపోవడంతో అనేక ప్రయత్నాలు చేసిన సీసీఎస్ పోలీసులు హీరా గ్రూప్ సర్వర్‌ను బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో గతేడాది గుర్తిం చారు. దీంతో పాటు స్వాధీనం చేసుకున్న కొన్ని హార్డ్‌డిస్క్‌ల్ని విశ్లేషించి అనేక కీలక విషయాలు గుర్తించారు. విదేశీ ఇన్వెస్టరు.. ‘ఫెమా’ఉల్లంఘన! ప్రాథమికంగా 1.7 లక్షలు మంది ఇన్వెస్టర్ల జాబితాను సంగ్రహించగలిగారు. వీరిలో కొందరు విదేశీయులుగా ఆ రికార్డులు చెప్తున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం విదేశీ పెట్టుబడుల్ని అవసరమైన అనుమతులు తీసుకున్న తర్వాత కేవలం భారత కరెన్సీలోనే స్వీకరించాలి. అయితే ఇప్పటివరకు సేకరించిన వివరాల ప్రకారం హీరా గ్రూప్ రూ.5,647 కోట్లు భారత కరెన్సీలో భారతీయుల నుంచి డిపాజిట్లు సేకరించింది. దీనికి తోడు 6 లక్షల అమెరికా డాలర్లు, 132 కోట్ల యూఏఈ దిరమ్స్, 45 కోట్ల సౌదీ రియాల్స్, 10 కోట్ల కువైడ్ దీనార్స్ పెట్టుబడులుగా వచ్చాయి. ఇలా విదేశీ కరెన్సీలో పెట్టుడబులు సేకరించడం ఫెమా చట్టానికి వ్యతిరేకం. మరోపక్క ఇప్పటి వరకు హీరా గ్రూప్ భారత్ కరెన్సీలో రూ.2,500 కో ట్లు, 2 లక్షల అమెరికా డాలర్లు, 120 కోట్ల యూఏఈ దిరమ్స్, 1.36 లక్షలు సౌదీ రియా ల్స్ డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించినట్లు తేలింది. వీటితోపాటు విదేశీ బ్యాంకుల్లో ఈ సంస్థకు చెందినవిగా అనుమానిస్తున్న 8 బ్యాం కు ఖాతాలను సీసీఎస్ పోలీసులు గుర్తించారు. దర్యాప్తు సంస్థలకు సీసీఎస్ లేఖలు.. సీసీఎస్ పోలీసులు తాము సేకరించిన వివరాలన్నీ క్రోడీకరిస్తూ తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈడీ, ఆదాయపుపన్ను శాఖ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌లకు లేఖలు రాశారు. దీంతో స్పందించిన ఈడీ ప్రాథమిక విచారణ నేపథ్యంలో ఈ స్కామ్ వెనుక మనీల్యాండరింగ్ సైతం ఉన్నట్లు గుర్తించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం గురువారం సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతితో ఈడీ హైదరాబాద్ యూనిట్ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ భేటీ అయ్యారు. సీసీఎస్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అదనపు డీసీపీ జోగయ్య, కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న ఏసీపీ రామ్‌కుమార్ సైతం పాల్గొన్నారు. తమ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన, సేకరించిన వివరాలను సీసీఎస్ పోలీసులు ఈడీ దృష్టికి తీసుకువెళ్లారు. కొన్ని కీలక డాక్యుమెంట్లను అప్పగించారు. ఇప్పటి వరకు లభించిన ఆధారాలను బట్టి హీరా గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన వారి సంఖ్య దాదాపు 2 లక్షల వరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రూ.60 కోట్లతో ఫైవ్‌స్టార్ హోటల్.. పోలీసులు ఖాతాలు ఫ్రీజ్ చేసే నాటికి ఈ సంస్థకు ఉన్న వివిధ బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.25 కోట్లు మాత్రమే నగదు నిల్వ ఉంది. కేవలం 12,000 మంది ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించాల్సిన మొత్తమే రూ.300 కోట్లుగా బయటపడింది. దీనికి తోడు ఇప్పటివరకు మరో 10 వేల మంది తమకు రూ.350 కోట్లు రావాల్సి ఉందంటూ పోలీసులకు నివేదించారు. ఈ మిస్టరీని ఛేదించడంపై ఈడీ అధికారులు దృష్టిపెట్టారు. కేరళలోని కొచ్చిన్‌లో ఉన్న ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌ను నౌహీరా షేక్ రూ.60 కోట్లు వెచ్చించి ఖరీదు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఆ హోటల్లో ఎలాంటి బుకింగ్స్ జరగట్లేదు. దీంతో దాని కార్యకలాపాలు ఆరా తీయాలని అధికారులు భావిస్తున్నారు. -
పోలీసుల కస్టడీకి నౌహీరా షేక్
సాక్షి, హైదరాబాద్ : గొలుసు కట్టు వ్యాపారం పేరిట హీరా గ్రూపు సంస్థ అధినేత్రి నౌహీరా షేక్ ఆరు వేల కోట్ల రూపాయల స్కామ్‌కు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీ సీబీసీఐడీ పోలీసులు ఆమెను విచారించగా.. తాజాగా కోర్టు అనుమతితో తెలంగాణ పోలీసులు నౌహీరాను 5 రోజుల కస్టడీకీ తీసుకున్నారు. సైబరాబాద్ పోలీసులు ఆమెను విచారించనున్నారు. చిత్తూరు జిల్లా మదన పల్లెకు చెందిన నౌహీరా.. హీరా గ్రూపుల్లో అక్రమ మార్గాల ద్వారా ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించి, వినియోగదారులను మోసం చేశారంటూ గతేడాది అక్టోబర్‌లో చిత్తూరు జిల్లా కలకడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. (హీరా పెదవి విప్పేనా..?) నౌహీరా షేక్– మనీ సర్క్యులేషన్ సామ్రాజ్యంలో దేశ వ్యాప్తంగా మార్మోగిన పేరిది. రూ.6 వేల కోట్ల డిపాజిట్లు, దేశవ్యాప్తంగా 1.35 లక్షల మందికి పైగా వినియోగదారులున్న సంస్థను హీరా ఒంటి చేత్తో నడిపించారు. అయితే కాలక్రమంలో చెల్లింపుల విషయంలో జిల్లాలోని పలువురు డిపాజిటర్ల నమ్మకం కోల్పోయింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశ వ్యాప్తంగా ఇదే తరహా కేసులు నమోదయ్యాయి. వేల కోట్ల రూపాయల పెట్టుబడితో సాగుతున్న హీరా గ్రూపు వ్యాపారాల్లో భారీగా విదేశీ సంస్థలున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
హీరా పెదవి విప్పేనా..?
చిత్తూరు అర్బన్: షేక్ నౌహీరా– మనీ సర్క్యులేషన్ సామ్రాజ్యంలో దేశ వ్యాప్తంగా మార్మోగిన పేరిది. రూ.6 వేల కోట్ల డిపాజిట్లు, దేశవ్యాప్తంగా 1.35 లక్షల మందికి పైగా వినియోగదారులున్న సంస్థను హీరా ఒంటి చేత్తో నడిపించింది. అయితే కాలక్రమంలో చెల్లింపుల విషయంలో జిల్లాలోని పలువురు డిపాజిటర్ల నమ్మకం కోల్పోయింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశ వ్యాప్తంగా ఇదే తరహా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర పోలీసులు హీరాను అరెస్టు చేశారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో నమోదైన కేసులు రాష్ట్ర సీబీసీఐడీ పోలీసులకు బదిలీ అయ్యాయి. హీరా ను విచారణ నిమిత్తం మూడు రోజుల పాటు సీబీసీఐడీ పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ చిత్తూరు జిల్లా సెషన్స్ న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొం ది. పోలీసుల విచారణలో హీరా పెదవి విప్పుతుం దా? డిపాజిట్ల సేకరణ ఎలా సాధ్యం..? ఇందులో విదేశీ సంస్థలున్నాయా..? అనే కోణాల్లో సమాచారం రాబట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కరువు మండలం నుంచి అంచెలంచెలుగా.. జిల్లాలోని పులిచెర్ల మండలం కరువుతో సతమతవుతోంది. డార్క్ ఏరియాలో ఉన్న ఈ మండలంలోని కోటపల్లెలో నౌహీరా తన తొలి మనీ సర్క్యులేషన్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆమె స్వస్థలం అదే కావడంతో పులిచెర్లతోపాటు కలకడ, వాల్మీకిపురం, బి.కొత్తకోట, సదుం, కలికిరి, పీలేరు మండలాలతోపాటు తిరుపతి ప్రాంతాలకు వ్యాపారం విస్తరించింది. తక్కువ కాలంలోనే ఈ వ్యాపారం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు పాకింది. విదేశాల్లోని పలు సంస్థలు సైతం హీరా గ్రూపులో పెట్టుబడులు పెట్టేంత నమ్మకాన్ని చూరగొంది. బంగారంపై డిపాజిట్లు పెడితే వడ్డీ ఇస్తామని చెప్పిన హీరా మాటలకు అన్ని ప్రాంతాల ప్రజలు నమ్మారు. చెప్పినట్లుగానే ప్రతినెలా డిపాజిటర్ల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేవి. అయితే దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి రావడంతో డిపాజిటర్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఆలస్యమయ్యాయి. ప్రతినెలా ఖాతాల్లో జమ అయ్యే డబ్బులు మూడు నెలలైనా వాటి ఊసే లేకపోవడంతో డిపాజిట్ చేసినవాళ్లు అనుమానించారు. కలకడలో నౌహీరాపై గత ఏడాది సెప్టెంబర్ 25న పోలీసులకు ఫిర్యాదు అందడంతో హీరా సంస్థకు తొలిదెబ్బ తగిలింది. ఆ తరువాత తిరుపతిలో సైతం బాధితులు కేసు పెట్టారు. ఇలా వరుసగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలుచోట్ల హీరా సంస్థల్లో డిపాజిట్లు చేసినవాళ్లు పోలీసులకు ఆశ్రయించారు. కేసు దర్యాప్తును సీబీసీఐడీ పోలీసులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లోని కేసులను విచారణ చేస్తున్నారు. ఉగ్ర సంస్థల పెట్టుబడులు ఉన్నాయా? రూ.వేల కోట్ల పెట్టుబడితో సాగుతున్న హీరా గ్రూపు వ్యాపారాల్లో భారీగా విదేశీ సంస్థలున్నట్లు సీబీసీఐడీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హీరా గ్రూపు కంపెనీలకు చెందిన బ్యాంకుల్లో జరిగిన లావాదేవీలే ఇందుకు సాక్ష్యమని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో ఐఎస్ఐ, ఇతర ఉగ్రవాద సంస్థలు ఏదైనా హీరా గ్రూపులో పెట్టుబడులు పెట్టాయా? అనే కోణంలో పోలీసులు కూపీ లాగే పనిలో పడ్డారు. గతేడాది అక్టోబర్ 17న హైదరాబాద్ పోలీసులు హీరాను అరెస్టు చేయగా.. మహారాష్ట్రలో నమోదైన కేసులో ఆమె ముంబయ్ మహిళా సెంట్రల్ జైలులో రిమాండు ఖైదీగా ఉన్నారు. ప్రిజనర్ ట్రాన్స్ఫర్ (పీటీ) వారెంటు కింద కడకడలో నమోదైన కేసులో హీరాను చిత్తూరు జిల్లా కోర్టుకు తీసుకురాగా, ప్రస్తుతం ఈమె చిత్తూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఈమెతో పాటు మరో ఇద్దరు నిందితులు థామస్, బిజూ థామస్‌ను సైతం మూడు రోజుల సీబీసీఐడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. మరి హీరా సీబీసీఐడీ విచారణలో ఏం చెబుతుందో వేచి చూడాలి. -
చిత్తూరు జిల్లా జైలుకు నౌహీరా
చిత్తూరు అర్బన్: హీరా గ్రూపుల సంస్థ అధినేత్రి నౌహీరా షేక్‌ను ఏపీ సీబీసీఐడీ పోలీసులు గురువారం చిత్తూరు జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. మదన పల్లెకు చెందిన నౌహీరా.. హీరా గ్రూపుల్లో అక్రమ మార్గాల ద్వారా ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించి, వినియోగదారులను మోసం చేశారంటూ గతే డాది అక్టోబర్‌లో చిత్తూరు జిల్లా కలకడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల హీరా మోసాలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో కేసు విచారణను ప్రభుత్వం సీబీసీఐడీ పోలీసులకు అప్పగించింది. హైదరాబాద్‌లోని నాంపల్లిలోనూ ఇదే తరహా ఫిర్యాదు అందడంతో తెలంగాణ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. దాని తర్వాత మనీ లాండరింగ్ కింద ముంబైకు చెందిన పలువురు హీరాపై పోలీసులు ఫిర్యాదు చేయగా.. వారెంటుపై నాంపల్లి నుంచి హీరాను ముంబై మహి ళా సెంట్రల్ జైలుకు తరలించారు. తాజాగా కలకడలో ఉన్న కేసులో సీబీసీఐడీ పోలీసులు హీరాను ముంబై నుంచి చిత్తూరులోని జిల్లా న్యాయస్థానంలో హాజరుపరిచారు. దీంతో నౌహీరాకు ఈ నెల 10 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి కబర్ది ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమెను జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు రూ. వేల కోట్లలో జరిగిన హీరా గ్రూపు లావాదేవీల్లో ఉగ్రవాద సంస్థల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో నౌహీరాను తమ కస్టడీకి అప్పగించాలని సీబీసీఐడీ పోలీసులు చిత్తూరు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టనుంది. -
హీరా గ్రూపు కేసు.. 6వేల కోట్ల స్కామ్
సాక్షి, హైదరాబాద్ : గొలుసు కట్టు వ్యాపారం పేరిట హీరా గ్రూపు మొత్తం ఆరు వేల కోట్ల రూపాయల స్కామ్‌కు పాల్పడినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు సీసీఎస్ పోలీసులు లేఖ రాశారు. డిపాజిట్ల సేకరణలో ఉగ్రవాదులతో సంబంధాలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హవాలా ద్వారా అరబ్ దేశాలకు భారీగా డబ్బు తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయంపై ఫైనాన్స్ ఇంటెలిజెన్స్, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆరాతీస్తున్నారు. -
‘హీరా’ ఇన్వెస్టర్లలో ఉగ్రవాదులు?
సాక్షి, హైదరాబాద్: స్కీముల పేరుతో రూ.వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేసు దర్యాప్తులో అనేక చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. నౌహీరా షేక్ నేతృ త్వంలో నడిచిన ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో ఉగ్రవాదులూ ఉన్నట్లు సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అనుమానితుల జాబితా రూపొందించిన దర్యాప్తు అధికారులు ఈ అనుమానం నివృత్తి చేసుకోవడానికి ఆయా ఏజెన్సీలకు లేఖలు రాశారు. మరోపక్క విదేశీ డిపాజిట్ల విషయంలో ఫెమా చట్టం ఉల్లంఘన జరిగినట్లు దర్యాప్తు అధికా రులు తేల్చారు. దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసుల వద్ద ఉన్న నౌహీరా షేక్‌ను ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సర్వర్ విశ్లేషణతో కీలకాంశాలు... అనేక ప్రయత్నాలు చేసిన సీసీఎస్ పోలీసులు హీరా గ్రూప్‌నకు చెందిన సర్వర్‌ను బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో గుర్తించారు. దీంతో పాటు స్వాధీనం చేసుకున్న కొన్ని హార్డ్‌డిస్క్‌లను విశ్లేషించారు. ఇందులోని వివరాల ఆధారంగా డిపాజిటర్లకు చెందిన జాబితాను సేకరించిన విషయం విదితమే. కాగా దర్యాప్తు అధికారులకు నిఘా వర్గాల నుంచిఓ జాబితా అందింది. అందులో దేశ వ్యాప్తంగా వివిధ ఉగ్రవాద సంబంధ కేసుల్లో అరెస్టయిన, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పేర్లను ఉన్నాయి. హీరా గ్రూప్‌లో ఉన్న డిపాజిట్‌దారుల జాబితాలో వీరి పేర్లు ఉండే అవకాశం ఉందంటూ నిఘా వర్గాలు ఉప్పందించాయి. దీంతో ఈ కోణంలో విశ్లేషించిన సీసీఎస్ పోలీసులు ఆయా ఉగ్రవాదుల పేర్లను పోలిన వాటిని డిపాజిట్‌దారుల జాబితాలో గుర్తించారు. ఆ ఉగ్రవాదులు, ఈ డిపాజిట్దారులూ ఒకరేనా అనేది నిర్థారించడం కోసం ఆయా కేసుల్ని పర్యవేక్షిస్తున్న అంతరాష్ట్ర, జాతీయ ఏజెన్సీలకు లేఖలు రాశారు. వారిచ్చే సమాధానాలను బట్టి ఈ కీలకాంశం ధ్రువీకరించే ఆస్కారముందని ఓ అధికారి పేర్కొన్నారు. విదేశీ డినామినేషన్లలోనే లావాదేవీలు... హీరా గ్రూప్‌ది దాదాపు రూ.8 వేల కోట్ల స్కామ్‌గా అనుమానిస్తున్న సీసీఎస్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తూ సేకరించిన రికార్డులను విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ గ్రూప్ ఫెమా చట్టాన్ని ఉల్లంఘిచినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం విదేశీ పెట్టుబడుల్ని అవసరమైన అనుమతులు తీసుకున్న తర్వాత కేవలం భారత కరెన్సీలోనే స్వీకరించాలి. అయితే హీరా గ్రూప్ రూ.5,647 కోట్లు భారత కరెన్సీలో భారతీయుల నుంచి డిపాజిట్లు సేకరించింది. దీనికి తోడు ఆరు లక్షల అమెరికా డాలర్లు, 132 కోట్ల యూఏఈ దిరమ్స్, 45 కోట్ల సౌదీ రియాల్స్, 10 కోట్ల కువైడ్ దీనార్స్ పెట్టుబడులుగా వచ్చాయి. ఇలా విదేశీ కరెన్సీలో పెట్టుబడులు సేకరించడం ఫెమా చట్టానికి వ్యతిరేకం. మరోపక్క ఇప్పటి వరకు హీరా గ్రూప్ భారత్ కరెన్సీలో రూ.2,500 కోట్లు, 2 లక్షల అమెరికా డాలర్లు, 120 కోట్ల యూఏఈ దిరమ్స్, 1.36 లక్షలు సౌదీ రియాల్స్ డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించినట్లు తేలింది. వీటితో పాటు విదేశీ బ్యాంకుల్లో ఈ సంస్థకు చెందినవిగా అనుమానిస్తున్న 8 బ్యాంకు ఖాతాలను సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఈ వివరాలన్నీ క్రోడీకరిస్తూ ఈడీ, ఆదాయపుపన్ను శాఖ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌కు లేఖలు రాశారు. సకుటుంబ సపరివార సమేతంగా... హీరా స్కామ్ కేసులో నిందితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. నౌహీరాతో పాటు ఆమె కుటుంబీకులకు ఇందులో భాగమున్నట్లు పోలీసులు గుర్తించారు. తొలుత హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, సీఈఓ నౌహీరా షేక్ నిందితులుగా ఉన్నారు. తర్వాత దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలను బట్టి ఆ సంస్థకు చెందిన బిజూ థామస్, మోల్లీ «థామస్‌ను అరెస్టు చేశారు. దర్యాప్తు సాగుతున్న కొద్దీ నిందితుల సంఖ్య పెరుగుతోంది. నౌహీరా కుమారుడైన అబు బకర్‌ను నిందితుడిగా పరిగణించిన సీసీఎస్ పోలీసులు సీఆర్పీసీ 41 (ఏ) నోటీసులు జారీ చేశారు. చేవెళ్లలో ఓ కళాశాలను నిర్వహిస్తున్న ఇతడు దుబాయ్‌లో హీరా గ్రూప్ వ్యవహారాల పర్యవేక్షణలో కీలకంగా వ్యవహరించినట్లు తేలింది. ఇదే కేసులో నౌహీరా సోదరి ముబారక్ జాన్ షేక్, సోదరుడు షేక్ ఇస్మాయిల్, ఇతడి భార్య కమర్ జాన్ షేక్, నౌహీరా బంధువులు షేక్ నఫీనా, షేక్ మహ్మద్ అష్రఫ్‌లను నిందితులుగా చేరుస్తున్నారు. దీనికి అనుమతి కోరుతూ సీసీఎస్ పోలీసులు ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మిస్టరీగా కొచ్చిన్‌లోని హోటల్ వ్యవహారం... ఇప్పటి వరకు లభించిన ఆధారాలను బట్టి హీరా గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన వారి సంఖ్య దాదాపు 2 లక్షల వరకు ఉంటుంది. ఈ సంస్థకు ఉన్న వివిధ బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.25 కోట్లు మాత్రమే నగదు నిల్వ ఉంది. 12 వేల మంది ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించాల్సిన మొత్తమే రూ.300 కోట్లుగా బయటపడింది. దీనికి తోడు ఇప్పటి వరకు మరో 10 వేల మంది తమకు రూ.350 కోట్లు రావాల్సి ఉందంటూ పోలీసులకు నివేదించారు. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు హీరా గ్రూప్‌నకు చెందిన ఆస్తుల వివరాలు సేకరించడంపై దృష్టిపెట్టారు. దీంతో కేరళలోని కొచ్చిన్‌లో ఉన్న ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌ను నౌహీరా షేక్ రూ.60 కోట్లు వెచ్చించి ఖరీదు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఆ హోటల్లో ఎలాంటి బుకింగ్స్ జరగట్లేదు. దీంతో దాని కార్యకలాపాలు ఆరా తీయాల్సిందిగా కోరుతూ సీసీఎస్ పోలీసులు కేరళ అధికారులకు లేఖ రాశారు. 2 రోజుల క్రితం ముంబై వెళ్లిన సీసీఎస్ టీమ్ అక్కడి అధికారులతో తమ దర్యాప్తు పురోగతిని చర్చించి వచ్చింది. -
పెట్టుబడిదారుల చిట్టా దొరికింది!
సాక్షి, సిటీబ్యూరో: ఆరేళ్లల్లో వేల కోట్ల టర్నోవర్ సాగించిన, బ్యాంకు ఖాతాల్లో కనీసం వంద కోట్లు కూడా లేని హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవహారంలో సీసీఎస్ పోలీసుల కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ గ్రూప్‌నకు సంబంధించిన సర్వర్‌ను గుర్తించిన పోలీసులు అందులో ఉన్న డేటాను విశ్లేషిస్తున్నారు. ప్రాథమికంగా 1.7 లక్షలు మంది ఇన్వెస్టర్ల జాబితాను సేకరించారు. దీనిని విశ్లేషించేందుకు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపిన సీసీఎస్ టీమ్ అవసరమైతే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) సహకారం తీసుకోవాలని భావిస్తోంది. మరోపక్క తమకు మంజూరైన బెయిల్‌ను హైకోర్టు రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ నౌహీరా షేక్ శుక్రవారం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసింది. తిరుపతికి చెందిన నౌహీరా షేక్ హైదరాబాద్‌కు వచ్చి బంజారాహిల్స్ ప్రాంతంలో నివసిస్తున్నారు. గతంలో కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు చేసిన ఈమె 2010–11లో హీరా ఇస్లామిక్ బిజినెస్ గ్రూప్ పేరుతో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో ఉన్న 15 సంస్థలకూ నౌహీరానే నేతృత్వం వహిస్తున్నారు. తన సంస్థల వ్యాపార లావాదేవీలకు సంబంధించి నౌహీరా షేక్ ఏ విభాగానికీ సరైన రికార్డులు సమర్పించలేదు. ఈమెపై నమోదైన కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు అనేక మార్గాల్లో కీలక సమాచారం సేకరించారు. దీని ప్రకారం హీరా గ్రూప్ వార్షిక టర్నోవర్ ఆరేళ్లల్లో కొన్ని వందల రెట్లు పెరిగినట్లు గుర్తించారు. 2010–11లో కేవలం రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్ టర్నోవర్... 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటేసింది. ఇప్పటి వరకు దాదాపు రూ.6 వేల కోట్ల వ్యాపారం చేసినట్లు నివేదికలు ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించి రికార్డులు ఎక్కడా అందుబాటులో లేవు. నౌహీరా అరెస్టు సందర్భంలో పోలీసులు ఆమెతో పాటు గ్రూప్‌నకు సంబంధించిన 160 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. వాటిలో 130 ఖాతాల వివరాలు సేకరించగా... వాటిలో కేవలం రూ.25 కోట్లు మాత్రమే ఉన్నట్లు తేలింది. దీంతో డబ్బు ఎక్కడకు పోయిందనే విషయంపై దృష్టి కేంద్రీకరించారు. వీటిపై నౌహీరా షేక్ నోరు మెదపకపోవడంతో సాంకేతికంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. లోతుగా ఆరా తీసిన సీసీఎస్ పోలీసులు బంజారాహిల్స్ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో సర్వర్ ఉన్నట్లు గుర్తించారు. ఈ సర్వర్‌ను ప్రాథమికంగా అధ్యయనం చేసిన సీసీఎస్ పోలీసులు 1.7 లక్షల మంది ఈ గ్రూప్‌లో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. వీరిలో అత్యధికులు మహారాష్ట్రతో పాటు ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే. ఈ పెట్టుబడులకు సంబంధించి 160 బ్యాంకు ఖాతాల ద్వారా లావాదేవీలు జరిగాయి. వీటిని విశ్లేషించడానికి సాంకేతిక నిపుణుల సాయం తీసుకోవాలని సీసీఎస్ భావిస్తోంది. ఈ ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలను విశ్లేషిస్తేనే ఆ 1.7 లక్షల మంది నిజంగా ఉన్నారా? లేక బోగస్ వ్యక్తులా? వీరు పెట్టిన పెట్టుబడులు ఎటు వెళ్లాయి? తదితర అంశాలు తెలుస్తాయని సీసీఎస్ అధికారులు తెలిపారు. దీనికోసం డేటాను ప్రాథమికంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపిన అధికారులు ఆ నివేదిక ఆధారంగా బ్యాంకుల నుంచి వివరాలు సేకరించాలని నిర్ణయించారు. ఆపై ఎస్ఎఫ్ఐఓ సహకారంతో లోతుగా దర్యాప్తు చేపట్టాలని భావిస్తున్నారు. మరోపక్క నౌహీరాను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత నాంపల్లి కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో వచ్చిన ముంబై పోలీసులు ఆమెను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ప్రస్తుతం కింది కోర్టు నౌహీరాకు ఇచ్చిన బెయిల్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఆమె తరఫు న్యాయవాదులు శుక్రవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తమ బెయిల్ రద్దు చేయడానికి సవాల్ చేస్తూ ఎస్ఎల్పీ దాఖలు చేశారు. ప్రస్తుతం పుణేలో ఉన్న నౌహీరాను కంటోన్మెంట్ పోలీసులు గురువారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఆమె పోలీసు కస్టడీ గడువు ముగియడంతో న్యాయస్థానం ఈ నెల 27 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అయితే రూ.165 కోట్ల స్కామ్‌లో మరిన్ని వివరాలు సేకరించడానికి ఈమెను మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ కంటోన్మెంట్ పోలీసులు అక్కడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నౌహీరాను సిటీకి తీసుకువచ్చి, కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు. దీనికోసం నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్ కూడా పొందారు. ఓ ప్రత్యేక బృందం ముంబై కోర్టులో పిటీషన్ దాఖలు చేసి నౌహీరాను తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరింది. అయితే నౌహీరా అరెస్టు తర్వాత ఆమెపై ముంబై, పుణేలతో పాటు అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. వారంతా తమ కస్టడీల్లోకి తీసుకోవడానికి పీటీ వారెంట్లతో ముంబై చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కీలక కేసుల్లో ఆయా పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం పూర్తయిన తర్వాతే హైదరాబాద్ తీసుకువెళ్లాలంటూ ప్రత్యేక బృందానికి ముంబై కోర్టు న్యాయమూర్తి సూచించారు. -
ఆ ముగ్గురి మధ్యే.. గూడుపుఠాణి!
సాక్షి, సిటీబ్యూరో: ఆరేళ్లల్లో రూ.వేల కోట్ల టర్నోవర్ సాగించిన, బ్యాంకు ఖాతాల్లో కనీసం రూ.వంద కోట్లు కూడా లేని హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవహారంలో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ గ్రూప్ వ్యవహారాలన్నీ సీఈఓ నౌహీరా షేక్‌తో పాటు ఆమెకు అత్యంత సన్నిహితులైన బిజూ థామస్, మోలీ థామస్లకే తెలిసి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. వీరితో పాటు కీలక సూత్రధారిగా ఉన్న మరో అజ్ఞాత వ్యక్తి విదేశాల్లో ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ కేసు విచారణకు సంబంధించి ప్రస్తుతం ముంబైలో ఉన్న నౌహీరా షేక్‌ను సిటీకి తీసుకువచ్చేందుకు అవసరమైన అనుమతులు పొందటంపై సీసీఎస్ పోలీసులు దృష్టి సారించారు. తిరుపతికి చెందిన నౌహీరా షేక్ హైదరాబాద్‌కు వచ్చి బంజారాహిల్స్ ప్రాంతంలో నివసిస్తున్నారు. గతంలో కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు చేసిన ఈమె 2010–11లో హీరా ఇస్లామిక్ బిజినెస్ గ్రూప్ పేరుతో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో ఉన్న 15 సంస్థలకూ ఆమే నేతృత్వం వహిస్తున్నారు. తన సంస్థల వ్యాపార లావాదేవీలకు సంబంధించి నౌహీరా షేక్ ఏ విభాగానికీ సరైన రికార్డులు సమర్పించలేదు. అయినా ఈమెపై నమోదైన కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు అనేక మార్గాల్లో కీలక సమాచారం సేకరించారు. దీని ప్రకారం హీరా గ్రూప్ వార్షిక టర్నోవర్ ఆరేళ్లల్లో కొన్ని వందల రెట్లు పెరిగిందని గుర్తించారు. 2010–11లో కేవలం రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్ టర్నోవర్... 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటేసింది. ఇప్పటి వరకు దాదాపు రూ.6 వేల కోట్ల వ్యాపారం చేసినట్లు నివేదికలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఎక్కడా రికార్డులు లేవు. నౌహీరా అరెస్టు సందర్భంలో పోలీసులు ఆమెతో పాటు గ్రూప్‌నకు సంబంధించి 160 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. వీటిలో 130 ఖాతాల వివరాలు సేకరించగా... వాటిలో కేవలం రూ.25 కోట్లు మాత్రమే ఉన్నట్లు తేలింది. దీంతో డబ్బు ఎక్కడికి వెళ్లిందనే విషయంపై దృష్టి సారించారు. ఈ వివరాలన్నీ ఆ ముగ్గురికే తెలిసి ఉంటాయని, నగదు దేశం దాటిందనే అనుమానాల నేపథ్యంలో అక్కడా ఓ కీలక వ్యక్తి ఉంటారని భావిస్తూ ఆ వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రాథమిక విచారణలో నిందితులు తాము భారీ స్థాయిలో బంగారం ఖరీదు చేస్తామని, ఈ నేపథ్యంలోనే మార్కెట్ ధరకు గరిష్టంగా 20 శాతం తక్కువకు పసిడి వస్తుందని చెప్పుకొచ్చారు. విపణిలో బంగారు ధరలు పెరిగిన వెంటనే ఆ మొత్తం అమ్మేసి భారీ లాభాలు పొందుతామంటూ పేర్కొన్నారు. ఈ పసిడి క్రయవిక్రయాల రికార్డులు సమర్పించనందున ఈ విషయాన్నీ పూర్తిగా నమ్మలేమని అధికారులు పేర్కొన్నారు. నౌహీరా కొన్నేళ్ల క్రితం కేరళలో ఓ ఈవెంట్ నిర్వహణకు వెళ్లినప్పుడు మోలీ థామస్‌తో పరిచయమైంది. ఆమెను హైదరాబాద్ తీసుకువచ్చిన నౌహీరా తన కంపెనీలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఈమె ద్వారానే బిజూ సైతం నౌహీరాకు పరిచయమయ్యాడు. అప్పటి నుంచీ ఈ ముగ్గురూ కలిసి పని చేయడంతో పాటు తమ వ్యాపార కార్యకలాపాలు బయటకు పొక్కకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆయా కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల్లో 95 శాతం మందిని మోలీ కేరళ నుంచే తీసుకువచ్చారు. వీరికైతే ఇక్కడి వారితో సంబంధాలు ఉండవని, తమ గుట్టు బయటపడదనే ఉద్దేశంతో జాగ్రత్తలు తీసుకున్నారు. మరోపక్క కేరళలో నౌహీరా షేక్ కార్యాలయం బిజూ థామస్‌కు చెందిన భవనంలోనే ఉంది. ఈ కేసులో తెరవెనుక ఉన్న కీలక నిందితులు, వారితో నిందితులకు ఉన్న సంబంధాలు నిర్థారించేందుకు వారి కాల్ డేటా సేకరించి విశ్లేషించాలని భావించారు. హీరా గ్రూప్ సీఈఓగా, వేల కోట్ల టర్నోవర్ కలిగిన నౌహీరా షేక్‌కు సొంతంగా సెల్‌ఫోన్ కూడా లేదని తేలింది. అవసరాన్ని బట్టి అందుబాటులో ఉన్న వారి ఫోన్లతో మాట్లాడుతుందే తప్ప ఆమెకు సొంతంగా సెల్‌ఫోన్, సిమ్‌కార్డులు లేవని వెల్లడైంది. మరోపక్క ప్రస్తుతం ముంబైలో ఉన్న నౌహీరాను సిటీకి తీసుకువచ్చేందుకు అధికారులు పీటీ వారెంట్ పొందారు. త్వరలో ఓ బృందం ముంబై వెళ్లి ఈమెను తీసుకురానుంది. బిజూ థామస్‌ను పీటీ వారెంట్‌పై కస్టడీలోకి తీసుకున్న కూకట్పల్లి పోలీసులు విచారణ పూర్తి కావడంతో జైలుకు పంపారు. న్యాయస్థానం అనుమతితో మోలీ థామస్‌ను విచారించిన సీసీఎస్ పోలీసులు ఆమె కస్టడీ గడువు సోమవారంతో ముగియడంతో మళ్లీ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
ఏడాదికో అకౌంటెంట్ మార్పు..!
సాక్షి, హైదరాబాద్: ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండే వ్యాపార రంగంలో ఉన్న కంపెనీలు... ప్రధానంగా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సాధారణంగా వారి లెక్కలు చూసే చార్టర్డ్ అకౌంటెంట్లను (సీఏ) మార్చవు. ఏదైనా తీవ్రమైన ఇబ్బంది వస్తే తప్ప కనీసం ఐదేళ్ల వరకు ఒకరినే కొనసాగిస్తుంటారు. అయితే హీరా గ్రూప్ వ్యవహారశైలి మాత్రం దీనికి భిన్నం. తమ గ్రూప్‌లో దాదాపు 15 కంపెనీలు ఉన్నప్పటికీ ప్రతి ఆర్థిక సంవత్సరం సీఏలను మారుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ గ్రూప్ సీఈఓ నౌహీరా షేక్ ఆలోచనల మేరకు ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. ఏటా రూ.800 కోట్ల టర్నోవర్ ఉందంటూ చూపించి, వివిధ స్కీముల కింద సాలీనా 36 నుంచి 46 శాతం వడ్డీ పేరుతో నౌహీరా షేక్ దేశ వ్యాప్తంగా అనేక మంది నుంచి డిపాజిట్లు సేకరించింది. నౌహీరా షేక్ 2010–11లో హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో ఉన్న 15 సంస్థలకూ నౌహీరానే నేతృత్వం వహిస్తున్నారు. తన వ్యాపార లావాదేవీలకు సంబంధించి నౌహీరా షేక్ ఏ విభాగానికీ సరైన రికార్డులు సమర్పించలేదు. అయినప్పటికీ ఈమెపై నమోదైన కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు అనేక మార్గాల్లో కీలక సమాచారం సేకరించారు. దీని ప్రకారం హీరా గ్రూప్ వార్షిక టర్నోవర్ ఆరేళ్ళల్లో కొన్ని వందల రెట్లు పెరిగిందని గుర్తించారు. 2010–11లో కేవలం రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్ టర్నోవర్... 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటేసింది. అయితే వీటికి ఆమె లెక్కలు చూపించలేదని అధికారులు చెప్తున్నారు. ఆయా కంపెనీల లావాదేవీలు, వాటికి చెందిన డాక్యుమెంట్లను హీరా కనీసం ఐటీ విభాగానికీ, ఆర్వోసీకి సమర్పించలేదని పోలీసులు గుర్తించారు. అయినప్పటికీ ఏళ్ళుగా నౌహీరా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. ఈ వ్యవహారాల్లో సీఏలది కీలక పాత్రగా ఉంటుందని, వారిని ప్రశ్నిస్తే కొన్ని చిక్కుముడులు వీడతాయని భావించిన సీసీఎస్ పోలీసులు వివిధ రికార్డుల నుంచి వారి వివరాలు సేకరించారు. ఇప్పటి వరకు ముగ్గురిని ప్రశ్నించినా ఆశించిన ఫలితం కాలేదు. ఓ వ్యక్తిని సీఏగా నియమించుకోవడం, సంస్థ లావాదేవీలపై అతడికి పూర్తి అవగాహన వచ్చేలోగానే తీసేస్తున్నట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ గ్రూప్‌లో పని చేసిన సీఏల వివరాలను ఆరా తీయడంపై దృష్టి పెట్టారు. గతేడాది షార్జాలో ‘టీ–10’ లీగ్ క్రీడా రంగంలో కొన్నేళ్ల క్రితం వచ్చిన ‘క్రికెట్ టీ–20’ మ్యాచ్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. వీటి నేపథ్యంలో కొన్ని ఫ్రాంచైజీలు కూడా పుట్టుకు వచ్చి భారీ ఆర్థిక లావావేలకు కేంద్రంగా మారి నిర్వహణ సంస్థలకు కాసులు కురిపించాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హీరా గ్రూప్ మరో అడుగు ముందుకు వేసింది. ‘టీ–10’లీగ్ మ్యాచ్ పేరుతో కొత్త ఒరవడికి నాంది పలికింది. దీని ప్రకటన, లాంచింగ్ గతేడాది డిసెంబర్ తొలి వారంలో హైదరాబాద్‌లోనే జరిగింది. ప్రధానంగా హీరా గ్రూప్‌తోపాటు మరికొన్ని సంస్థలూ స్పాన్సర్ చేసిన ఈ మ్యాచ్‌లు దుబాయ్‌లో ఉన్న షార్జా స్టేడియంలో గతేడాది డిసెంబర్ 14 నుంచి 17 వరకు జరిగింది. పంజాబీ లెజెండ్స్, ఫక్తూన్స్, మరాఠా అరేబియన్స్, బెంగాల్ టైగర్స్, టీమ్ శ్రీలంక క్రికెట్, కేరళ కింగ్స్ అనే ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. అనేక మంది బాలీవుడ్ తారలు సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ మ్యాచ్‌ల నిర్వహణ, స్పాన్సర్ షిప్ తదితరాల్లో భారీ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీటిపై ఆరా తీయాలని నిర్ణయించుకున్నారు. నౌహీరా షేక్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశాక ఇక్కడ బెయిల్ మంజూరైంది. బయటకొచ్చిన ఆమెను ముంబై పోలీసులు అరెస్టు చేసి అక్కడకు తరలిం చారు. కొన్ని రోజుల క్రితమే ఇక్కడ మంజూరైన బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసింది. నౌహీరాను ముంబై నుంచి పీటీ వారెంట్‌పై తీసుకురావాలని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు. దీనికి అవసరమైన న్యాయపరమైన సన్నాహాలు చేస్తున్నారు. -
మార్ఫింగ్ షేక్
సాక్షి, సిటీబ్యూరో: హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ముసుగులో స్కీముల పేరుతో రూ.వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిన నౌహీరా షేక్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈమె తన సంస్థల అధికారిక వెబ్సైట్లో తనకు అనేక అవార్డులు వచ్చినట్లు వివరాలు పొందుపరిచారు. తన కార్యాలయంతో పాటు సోషల్ మీడియాలోనూ వాటికి సంబంధించిన అనేక ఫొటోలను అప్లోడ్ చేశారు. వీటిలో అనేక అవార్డుల పేర్లు ఇప్పటి వరకు ఎక్కడా వినపడలేదు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తులో భాగంగా ఈ కోణం పైనా పోలీసులు దృష్టి పెట్టారు. ఫలితంగా నౌహీరా షేక్ తనకు రాని అవార్డులు సైతం వచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని తేలింది. మరోపక్క ముంబైలో ఈ గ్రూప్‌పై నమోదైన కేసులను అక్కడి ఆర్థిక నేరాల దర్యాప్తు ప్రత్యేక విభాగమైన ఎకనామికల్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి పరిశీలనలో బాధితుల జాబితాలో కొందరు పోలీసులు సైతం ఉన్నట్లు గుర్తించారు. అక్కడి ఫొటో ‘ఇక్కడ’ వాడుతూ.. హీరా గ్రూప్ అధికారిక వెబ్‌సైట్‌లోని అచీవ్మెంట్స్ లింకులో నౌహీరా సాధించిన విజయాలుగా చెబుతూ చాంతాడంత జాబితా ఉంది. ఇందులో అనేక అవార్డుల పేర్లు, వాటి వివరాలను ఉంచారు. దీని ప్రకారం నౌహీరాకు 2012 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు ప్రదానం చేసినట్లు ఉంది. అంతేకాదు.. మొత్తం 11 రకాలైన జాతీయ, అంతర్జాతీయ అవార్డులను తన జాబితాలో వేసుకుంది. వీటికి సంబంధించిన కొన్ని ఫొటోలను నౌహీరా సోషల్ మీడియాతో పాటు తన కార్యాలయం, ఇళ్లల్లో ప్రదర్శించేశారు. వీటిని విశ్లేషించిన దర్యాప్తు అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. దుబాయ్ యువరాణి ఫైజల్ అల్ ఖసీమీ తనకు ‘టాప్ బిజినెస్ ఉమెన్ అవార్డు’ ప్రదానం చేసినట్లు ఆమె ఓ ఫొటో రూపొందించారు. అయితే, వాస్తవానికి దుబాయ్‌లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఖసీమీని కలిసిన నౌహీరా ఆమెతో కలిసి ఫొటో దిగారు. ఆపై దీన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఫొటోషాప్ ద్వారా తనకు ఆమె టాప్ అవార్డు ఇస్తున్నట్లు సృష్టించేశారు. 2014లో సుష్మాస్వరాజ్ తన దుబాయ్ పర్యటనలో భాగంగా ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ ఫొటోను సేకరించిన నౌహీరా ఫొటోషాప్ వినియోగించి ఆ కార్యక్రమంలో తానూ స్టేజ్ మీద ఉన్నట్టు సృష్టించేసింది. ఇలా ఇంకా అనేక ఫొటోలను మార్ఫింగ్ చేసి తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కస్టమర్లను ఆకర్షించేందుకు, భయపెట్టేందుకు.. హీరా గ్రూప్ ముసుగులో స్కాములకు శ్రీకారం చుట్టిన నౌహీరా షేక్ ఈ ఫొటోలను రెండు రకాలుగా వాడుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత వీటిని ఎరవేసి తన గ్రూప్ ఇమేజ్ను పెంచుకోవడం ద్వారా డిపాజిట్‌దార్లను ఆకర్షించారని భావిస్తున్నారు. మరోపక్క డిపాజిట్ చేసిన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ ఎవరైనా ఒత్తిడి చేస్తే తనకు పైస్థాయిలో పరిచయాలు, పలుకుబడి ఉందంటూ వారిని భయపెట్టడానికీ వాడినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ రెండు కోణాల్లోనూ నౌహీరాను ప్రశ్నించాలని యోచిస్తున్నారు. మరోపక్క నౌహీరా షేక్ తన పేరు ముందు తగిలించుకున్న ‘డాక్టర్’ను పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన నౌహారా షేక్ తండ్రి సాధారణ కూరగాయల వ్యాపారి. కేవలం పదో తరగతి మాత్రమే చదివిన నౌహీరా ప్రస్తుతం తన పేరుకు ముందు ‘డాక్టర్’ను తగిలించుకున్నారు. ఈ డాక్టరేట్ ఈమెకు దుబాయ్‌కు చెందిన ఓ యూనివర్శిటీ ఇచ్చిందంటూ అనుచరులు ప్రచారం చేస్తున్నా.. పోలీసులు మాత్రం దీన్ని విశ్వసించట్లేదు. అవార్డుల మాదిరిగానే ఇదీ ఓ స్కామ్‌గా అనుమానిస్తున్నారు. సదరు డాక్టరేట్‌పై ఎలాంటి ఆధారాలు లభించలేదని, నౌహీరా నుంచీ సమాచారం లేదని పోలీసులు చెబుతున్నారు. టెక్నాలజీతో తేలనున్న నిజం నౌహీరా షేక్‌ను సిటీ సీసీఎస్ పోలీసులు అక్టోబర్ 16న అరెస్టు చేశారు. ఆపై ముంబైలోని ఈఓడబ్ల్యూ అధికారులు పీటీ వారెంట్‌పై అక్కడకు తీసుకెళ్లారు. నాటి నుంచి ఈఓడబ్ల్యూ అధికారులను దాదాపు 150 మంది బాధితులు సంప్రదించారు. వీటిలో కొన్ని కేసులుగా నమోదయ్యాయి. బాధితుల జాబితాలో ముంబైకి చెందిన కొందరు పోలీసు అధికారులు ఉన్నట్లు తెలిసింది. డిపాజిట్లపై సరాసరిన 36 నుంచి 42 శాతం వడ్డీ ఎర చూపడంతో నలుగురు అధికారులు రూ.20 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టారని సమాచారం. ఒక్క మహారాష్ట్రలోనే హీరా గ్రూప్ స్కామ్ రూ.1000 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. గడిచిన ఆరేళ్లలో అక్షరాలా రూ.5 వేల కోట్ల టర్నోవర్ చేసిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గుట్టును సాంకేతికంగా విప్పాలని సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. గత వారం ఈ సంస్థ ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహించిన సీసీఎస్ పోలీసులు సర్వర్‌తో పాటు హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించడం ద్వారా కీలక సమాచారం వెలుగులోకి వస్తుందని భావిస్తున్నారు.