నౌహీరా షేక్
సాక్షి, హైదరాబాద్ : హీరాగోల్డ్ కేసులో హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ నౌహీరా షేక్‌కు ఊరట లభించింది. నౌహీరా షేక్‌పై సీసీఎస్ పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ప్రాసిక్యూషన్ వాదనలతో సంతృప్తి చెందని నాంపల్లి కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
నౌహీరా షేక్ ఐదు లక్షలతో రెండు షూరిటీలు కోర్టుకు చెల్లించాలని, 29వ తేదీలోపు 5 కోట్ల రూపాయలు కోర్టులో డిపాజిట్ చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. పాస్‌పోర్ట్ స్వాధీనం చేసి, కోర్టు అనుమతి లేకుండా బయటి దేశాలకు వెళ్లకూడదన్న నిబంధనలు విధించింది. కోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ వీడి వెల్లొద్దని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment