హవాలా మార్గంలో విదేశాలకు భారీగా నగదు తరలించేందుకు యత్నించిన ఓ ముఠాను హైదరాబాద్ నగర టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హవాలా మార్గంలో విదేశాలకు భారీగా నగదు తరలించేందుకు యత్నించిన ఓ ముఠాను హైదరాబాద్ నగర టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 84 లక్షలతోపాటు ఆ ముఠాలోని ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి హిమాయిత్ నగర్లోని టీటీడీ కళ్యాణ మండపంలో సమీపంలో నగరానికి చెందిన హీరా గ్రూప్ సంస్థలకు చెందిన వ్యక్తుల నుంచి రూ. 84 లక్షలు తీసుకునేందుకు నలుగురు వ్యక్తులు అక్కడికి చేరుకున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది.
దాంతో పోలీసులు హుటాహుటిన హిమాయిత్ నగర్ చేరుకుని సదరు వ్యక్తులపై దాడి చేసి... వారి వద్ద నుంచి రూ. 84 లక్షల నగదును సీజ్ చేశారు. ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేయడంతోపాటు వారికి చెందిన రెండు కార్లను టాస్క్ఫోర్స్ పోలీసులు నారాయణ గూడా పోలీస్ స్టేషన్కు తరలించారు. హవాల సొమ్మును దుబాయి తరలించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఆ ముఠాపై పోలీసుల దాడి చేశారు.