ఈడీ దూకుడు.. మరోసారి హీరా గ్రూప్‌పై దాడులు | Ed Raids On Heera Group In Hyderabad, More Details Inside | Sakshi
Sakshi News home page

ఈడీ దూకుడు.. మరోసారి హీరా గ్రూప్‌పై దాడులు

Aug 3 2024 6:15 PM | Updated on Aug 3 2024 8:09 PM

Ed Raids On Heera Group In Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మరోసారి హీరా గ్రూప్‌పై ఈడీ దాడులు చేపట్టింది. తెల్లవారుజాము నుంచి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. నౌహిరా షేక్‌ ఇల్లు,ఆఫీసుల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కోట్ల  రూపాయలు నిధులు గోల్‌మాల్‌ జరిగినట్లు ఈడీ గుర్తించింది. విదేశీ పెట్టుబడులపై అధికారులు ఆరా తీస్తున్నారు.

నౌహిరా ఆస్తులను ఒక్కొక్కటిగా ఈడీ అటాచ్‌ చేస్తోంది. టోలీ చౌక్‌లోని 81 ప్లాట్‌లను స్వాధీనం చేసుకున్న ఈడీ... ఇప్పటి వరకు రూ.380 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. మరో రూ.600 కోట్లపై చిలుకు ఆస్తులపై ఈడీ విచారణ జరుపుతోంది. దేశవ్యాప్తంగా నౌహిరా షేక్‌పై 60కి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రజల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి ఆస్తులను కూడా పెట్టుకున్నారని ఆరోపణలపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నౌహీరా షేక్‌పై గతంలో కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement