
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. పాతబస్తీలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి 10 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. హవాలా నగదును తరలిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కారు, నగదు స్వాధీనం చేసుకున్నారు.
షాహినాత్‌గంజ్‌కు చెందిన కమలేశ్, అశోక్ కుమార్, రతన్‌సింగ్, గోషామహల్‌కు చెందిన రాహుల్ అగర్వాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే డబ్బు ఎవరి ఆదేశాలతో ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ హవాలా సొమ్ముతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
చదవండి: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలెన్నో.. ఆ పనిచేసిందెవరు?
Comments
Please login to add a commentAdd a comment