
సాక్షి, హైదరాబాద్: నగరంలో భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. 3 కోట్ల 75 లక్షల హవాలా డబ్బును టాస్క్ ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్‌లో మంగళవారం పట్టుకున్నారు. వెస్ట్‌జోన్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఓ కారులో నలుగురు వ్యక్తులు డబ్బులను తరలిస్తుండగా పట్టుకున్నామని హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈశ్వర్ దిలీప్ జీ, హరీష్ రామ్ బాయ్, అజిత్ సింగ్, రాథోడ్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఈ డబ్బులు ఎక్కడ నుండి తీసుకొచ్చారు, ఎక్కడ ఇవ్వాలని అనుకుంటున్నారు అనేది దర్యాప్తు చేస్తున్నామన్నారు. హవాలా డబ్బు తో పాటు నిందితులను ఆదాయపన్ను శాఖ కు అప్పగిస్తున్నామని చెప్పారు. ఆదాయపు పన్ను అధికారుల విచారణలో మరిన్ని విషయాలు బయట పడే అవకాశం ఉందని సీపీ తెలిపారు.
(చదవండి: ఎస్‌ఐ.. మై హీరో ఆఫ్ ది డే)
Comments
Please login to add a commentAdd a comment