హీరాగ్రూప్‌ కుంభకోణంలో ఈడీ ముందడుగు..! | Enforcement Directorate Attaches Heera Group Assets In Five States | Sakshi
Sakshi News home page

299.98 కోట్ల హీరాగ్రూప్‌ ఆస్తులు అటాచ్‌

Published Fri, Aug 16 2019 6:14 PM | Last Updated on Fri, Aug 16 2019 6:47 PM

Enforcement Directorate Attaches Heera Group Assets In Five States - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చిన్న మొత్తాలకు భారీ పెద్ద మొత్తాలను తిరిగిస్తామని చెప్పి వేల కోట్ల రూపాయలు కాజేసిన హీరాగ్రూప్‌ పెట్టుబడిదారులకు కుచ్చుటోపీ పెట్టిన హీరాగ్రూప్‌ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌డైరెక్టరేట్‌ ముందుడుగు వేసింది. ఈ బోగస్‌ సంస్థకు చెందిన రూ.299.98 కోట్ల ఆస్తులను ఈడీ శుక్రవారం అటాచ్‌ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో హీరాగ్రూప్‌నకు చెందిన రూ.277.29 కోట్ల విలువైన స్థిరాస్తులను, బ్యాంకుల్లో ఉన్న బ్యాలెన్స్‌ రూ.22.69 కోట్లను అటాచ్‌ చేస్తున్నట్టు ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది. 96 చోట్ల సంస్థ స్థిరాస్తులు ఉన్నట్టు ఈడీ పేర్కొంది. ఇళ్లు, ప్లాట్లు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, వ్యవసాయ భూములు ఈ జాబితాలో ఉన్నాయి. హీరా గ్రూప్‌ పేరుతో నౌహీరా షేక్‌ ప్రజల వద్ద నుంచి అక్రమంగా రూ.5600 కోట్ల డిపాజిట్లు వసూలు చేసిందని వెల్లడించింది. మనీలాండరింగ్‌ నియంత్రణ చట్టం-2002 కింద నౌహీరాపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

(చదవండి : ఈడీ కస్టడీకి నౌహీరా )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement