ponzi schemes
-
పోంజీ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త!
పోంజీ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పెట్టుబడి దారుల్ని హెచ్చరించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తం రాబడి అందిస్తామని నమ్మించే ఇలాంటి యాప్స్ నుంచి పెట్టుబడి దారుల్ని సురక్షితంగా ఉంచేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్బీఐతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. తుమకూరు (కర్ణాటక)లో జరిగిన థింకర్స్ ఫోరమ్‌లో ఆమె మాట్లాడుతూ.. కొద్ది మొత్తంలో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో రాబడులు అందిస్తామని హామీల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. డబ్బు ఆశ చూపిస్తూ అది చేస్తాం. ఇది చేస్తామని ప్రజలకు చేరువయ్యేందుకు రకరకాల ప్రయాత్నాలు చేసే పోంజీ యాప్స్ ఉన్నాయని, వాటిని నియంత్రించాలని అన్నారు. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు, ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు అనధికారిక యాప్స్ నుంచి ప్రజల్ని కాపాడాలని కోరారు. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు, ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లను నియంత్రిస్తున్నారా? అని ప్రశ్నించినప్పుడు..ప్రస్తుతం వారిని నియంత్రించేలా ఎలాంటి ప్రతిపాదనలు లేవని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు. అయితే సోషల్ మీడియాలో అలాంటివారిని అనుసరిస్తూ.. వారి సూచనలు పాటించడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉందని , ప్రజలు దీనిపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
స్టార్టప్‌ల తీరు ‘పొంజి స్కీమ్’ మాదిరే!: నారాయణమూర్తి
ముంబై: స్టార్టప్‌లు కేవలం ఆదాయం పెంపుపైనే దృష్టి సారిస్తూ, లాభాల గురించి ఆలోచించకుండా.. అదే సమయంలో వాటి మార్కెట్ విలువను పెంచుకోవడం అన్నది పొంజి స్కీమ్ మాదిరేనని, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. అటువంటి వ్యవస్థ అభివృద్ధి చెందడంలో వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, బోర్డు డైరెక్టర్ల పాత్రను తప్పుబట్టాలే కానీ, యువ పారిశ్రామికవేత్తలను కాదన్నారు. నాస్కామ్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నారాయణమూర్తి మాట్లాడారు. దీర్ఘకాల ప్రయోజాల కోసం ఇన్ఫోసిస్ సైతం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. విషయాల పట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ పారదర్శకంగా, నిజాయితీగా మాట్లాడాలని కోరారు. నిధులు సమీకరించినప్పుడల్లా వ్యాల్యూషన్లను పెంచుకుంటూ పోవడం ప్రమాదకరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదైనా ఘటన వల్ల ఎదురుదెబ్బ లేదా ప్రతికూలతలు ఎదురైతే కంపెనీ ధర అదే మాదిరి పడిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. అంతర్జాతీయంగా ప్రతికూల స్థూల ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఐటీ కంపెనీలపై ఏ మేరకు ఉంటుందనే దానిపై మాట్లాడుతూ.. కష్ట సమయాలు ఎదురైనప్పుడల్లా భారత ఐటీ కంపెనీలు లాభపడినట్టు చెప్పారు. చాట్ జీపీటీ వంటి ఏఐ ప్లాట్‌ఫామ్‌లతో భారత ఐటీ ఉద్యోగాలపై ప్రభావం ఉండదన్నారు. గతంలో తానూ ఈ తరహా ప్లాట్‌ఫామ్‌ల కోసం ప్రయత్నించినట్టు చెప్పారు. -
ఆమ్వేకు భారీ షాక్ ! రూ.757 కోట్ల ఆస్తులు ఎటాచ్
మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీ ఆమ్వేకు భారీ షాక్ తగిలింది, మనీ లాండరింగ్ ఆరోపణలపై ఆ కంపెనికి చెందిన రూ.757 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎటాచ్ చేసింది. ఇందులో స్థిర, చర ఆస్తుల విలువ రూ.411 కోట్లు ఉండగా మిగిలిన రూ.346 కోట్ల నగదును ఎటాచ్ చేసింది. ఆమ్మేకు చెందిన దుండిగల్‌లో ఉన్న ఫ్యాక్టరీ, ఫర్నీచర్, మెషినరీలతో పాటు ఈ కంపెనీకి చెందిన 36 బ్యాంకు ఖాతాలను ఈడీ ఎటాచ్ చేసింది. మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గత డిసెంబరులో ఈ కంపెనీలకు కొత్త నియమ నిబంధనలు అమల్లోకి తెచ్చారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలు అందిస్తున్న పొడక్టులన్నీ కూడా రెగ్యులర్ మార్కెట్లో ఉన్న ఉత్పత్తుల కంటే అధిక ధరతో ఉండటం, ఈ వ్యాపారంలో భాగస్వాములకు అధిక మొత్తంలో కమిషన్లు అందివ్వడం తదితర వ్యవహరాలపై అనేక విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంఎల్‌ఎంలో అతి పెద్ద సంస్థ అయిన ఆమ్వేకు భారీ షాక్ ఇచ్చింది ఈడీ. ED has provisionally attached assets worth Rs. 757.77 Crore belonging to M/s. Amway India Enterprises Private Limited, a company accused of running a multi-level marketing scam. — ED (@dir_ed) April 18, 2022 చదవండి: ఆమ్వే, ఓరిఫ్లేమ్, టప్పర్‌వేర్.. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకు షాక్ ! -
80 మందిని రూ.8 కోట్లకు ముంచాడు
ఢిల్లీ: మోసపూరిత పెట్టుబడి పథకాల పేరుతో 80 మందికి పైగా వ్యక్తుల వద్ద రూ.8 కోట్ల మేర మోసగించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. వివరాలు.. 41ఏళ్ల గోపాల్ దళపతి, వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్, వైర్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నాడు. తమ సంస్థ పోంజీ పథకాల్లో పెట్టుబడిపెడితే అధిక డబ్బును తిరిగి పొందవచ్చని 80 మందికి పైగా ప్రజలను నమ్మించాడు. హామీ కోసం సంస్థ డిబెంచర్ సర్టిఫికేట్లను వారికి ఇచ్చాడు. ఇలా సుమారు రూ.8 కోట్ల మేర డబ్బులు సేకరించాడు. మూడేండ్ల కిందట ఢిల్లీ, కోల్‌కతాలోని కార్యాలయాలను మూసివేసి అదృశ్యమయ్యాడు. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గోపాల్ అనుచరులైన అమరేంద్ర ప్రసాద్ సింగ్, భారత్ కుమార్, సంజయ్ కుమార్ దాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే సంస్థ డైరెక్టరైన గోపాల్ దళపతి తరచుగా వేషాలు, అడ్రస్‌లు మారుస్తూ 3ఏళ్ల నుంచి పోలీసుల కళ్లుగప్పుతున్నాడు. అప్పటినుంచి గోపాల్ కోసం గాలిస్తున్న ఆర్థిక నేరాల విభాగం బృందం ఎట్టకేలకు సాకేత్ కోర్ట్ కాంప్లెక్స్ సమీపంలో గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: చచ్చిపోదామనుకున్నాడు.. మనసు మార్చుకుని ‘పెళ్లి లేదు, ఏమీ లేదు.. పో!’ -
హీరాగ్రూప్ కుంభకోణంలో ఈడీ ముందడుగు..!
సాక్షి, హైదరాబాద్ : చిన్న మొత్తాలకు భారీ పెద్ద మొత్తాలను తిరిగిస్తామని చెప్పి వేల కోట్ల రూపాయలు కాజేసిన హీరాగ్రూప్ పెట్టుబడిదారులకు కుచ్చుటోపీ పెట్టిన హీరాగ్రూప్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్డైరెక్టరేట్ ముందుడుగు వేసింది. ఈ బోగస్ సంస్థకు చెందిన రూ.299.98 కోట్ల ఆస్తులను ఈడీ శుక్రవారం అటాచ్ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో హీరాగ్రూప్‌నకు చెందిన రూ.277.29 కోట్ల విలువైన స్థిరాస్తులను, బ్యాంకుల్లో ఉన్న బ్యాలెన్స్ రూ.22.69 కోట్లను అటాచ్ చేస్తున్నట్టు ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది. 96 చోట్ల సంస్థ స్థిరాస్తులు ఉన్నట్టు ఈడీ పేర్కొంది. ఇళ్లు, ప్లాట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, వ్యవసాయ భూములు ఈ జాబితాలో ఉన్నాయి. హీరా గ్రూప్ పేరుతో నౌహీరా షేక్ ప్రజల వద్ద నుంచి అక్రమంగా రూ.5600 కోట్ల డిపాజిట్లు వసూలు చేసిందని వెల్లడించింది. మనీలాండరింగ్ నియంత్రణ చట్టం-2002 కింద నౌహీరాపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. (చదవండి : ఈడీ కస్టడీకి నౌహీరా ) -
వందల కోట్లు లంచంగా ఇచ్చా
యశవంతపుర (బెంగళూరు): కర్ణాటకలో ముఖ్యమైన రాజకీయ నేతలు, ప్రభుత్వాధికారులకు రూ. 400 కోట్లను లంచంగా ఇచ్చానని ఐఎంఏ జ్యువెల్స్ సంస్థ యజమాని మహ్మద్ మన్సూర్ ఖాన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో వెల్లడించినట్లు సమాచారం. రూ. 4 వేల కోట్ల డిపాజిట్లను మన్సూర్ ఖాన్ ప్రజల నుంచి సేకరించి మోసం చేయడం తెలిసిందే. ఈ కేసులో మన్సూర్‌ను ఈడీ శనివారం కస్టడీకి తీసుకుని విచారణ ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలో పలువురు నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ కేసులో తాము ఇరుక్కుపోతామా? అని భయాందోళనకు గురవుతున్నట్లు సమాచారం. ఈ కేసులో ఒక ఐఏఎస్ అధికారిని సిట్ ఇప్పటికే అరెస్టు చేసింది. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే రోషన్‌బేగ్‌ను విచారించింది. కాగా, ఛాతిలో నొప్పి రావడంతో మన్సూర్ ఖాన్‌ను ఆదివారం రాత్రి సర్ జయదేవ ఆస్పత్రికి తరలించారు. దుబాయ్ నుంచి వచ్చిన మన్సూర్ ఖాన్‌ను శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. జూలై 23 వరకు ఆయన ఈడీ కస్టడీలో ఉండనున్నారు. (చదవండి: జువెల్లరీ గ్రూప్ యజమాని రూ. 209 కోట్ల ఆస్తి జప్తు!) -
‘గాలి’ అరెస్ట్ వెనక కుమారస్వామి?
సాక్షి, న్యూఢిల్లీ : కొందరు పోంజి స్కీమ్‌గా అభివర్ణించే పాన్సీ స్కీమ్ స్కామ్‌లో బీజేపీ మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అరెస్టై జైలుకు వెళ్లడం వెనక కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రతీకారం ఉందా? 1600 కోట్ల రూపాయల మైనికంగ్ కుంభకోణం కేసులో 2011లో అరెస్టైన గాలి జనార్ధన్ రెడ్డి నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలైన విషయం తెల్సిందే. 600 కోట్ల రూపాయల పాన్సీ స్కీమ్ నుంచి నిందితులను తప్పించేందుకు 18 కోట్ల రూపాయల విలువైన బంగారు కడ్డీలను స్వీకరించారన్నది గాలి జనార్దన్ రెడ్డిపై తాజా ఆరోపణ. ముఖ్యమంత్రి కుమార స్వామికి, గాలి జనార్దన్ రెడ్డి మధ్య కొనసాగుతున్న గొడవ 2006 నాటిది. ఆ నాడు అసెంబ్లీ శాసన సభ్యుడైన కుమార స్వామి ముఖ్యమంత్రి అవడం కోసం ఇద్దరు బీజేపీ నాయకులు, తన జేడీఎస్ పార్టీకి చెందిన ఓ యువజన నాయకుడి కోటరీతో కుట్ర పన్ని అప్పటి ధరమ్‌సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. బీజేపీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే బీజేపీకి నిధులు సమకూర్చే నాయకుడిగా ముద్రపడిన గాలి జనార్దన్ రెడ్డిని ఆయన తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కుమార స్వామి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కూడా కాకముందే మైనింగ్ లాబీ నుంచి ఆయన 150 కోట్ల రూపాయల ముడుపులు స్వీకరించారంటూ గాలి జనార్దన్ ఆరోపించారు. ఆ తర్వాత కొంతకాలానికే బీజేపీతో చేసుకున్న అధికార మార్పిడి ఒప్పందం ప్రకారం సీఎం పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ‘నేను ముఖ్యమంత్రి పదవిని చేపట్టి పట్టుమని ఐదు నెలలు కూడా కాలేదు. నా సంకీర్ణ భాగస్వామ్య పక్షం నాయకుడే నాపై అవినీతి ఆరోపణలు చేశారు. నేనా విషయాన్ని నా జీవిత కాలంలో ఎన్నడూ మరవను’ అని ఈ ఏడాది కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి కొన్ని రోజుల ముందు విలేకరులతో వ్యాఖ్యానించారు. గాలిపైనున్న ప్రతీకార జ్వాలల కారణంగానే కుమార స్వామి బీజేపీతోని కాకుండా కాంగ్రెస్ పార్టీతోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని రాజకీయ విశ్లేషకులు నేటికీ భావిస్తున్నారు. అంతే కాకుండా గత ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డి లాబీకి వ్యతిరేకంగా తీవ్ర ప్రచారం చేశారు. దాంతో బీజేపీ నాయకులు శ్రీరాములు తరఫున గాలి జనార్దన్ రెడ్డి చేసిన ప్రచారానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆమోద ముద్ర వేయలేక పోయారు. పార్టీ కార్యకర్తగా కాకుండా వ్యక్తిగత హోదాలో శ్రీరాములుకి గాలి జనార్దన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని అమిత్ షా చెప్పాల్సి వచ్చింది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు బలంగా ఉన్న బళ్లారి ప్రాంతంలో బీజేపీ బలపడడానికి శ్రీరాములుతో కలిసి గాలి జనార్దన్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారు. ఒకప్పుడు అంటే 1999లో బీజేపీ తరఫున విస్తృత ప్రచారం సాగించిన సుష్మా స్వరాజ్‌పై సోనియా గాంధీ బళ్లారి నుంచి విజయం సాధించారంటే కాంగ్రెస్ బలాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ స్థితి నుంచి బళ్లారి నుంచి అన్ని సీట్లు బీజేపీ గెలుచుకునే స్థాయికి బీజేపీ బలపడింది. గత మే నెలలో జరిగిన ఎన్నికల్లో బళ్లారి ప్రాంతంలోని 9 అసెంబ్లీ సీట్లకు గాను ఆరు సీట్లను కాంగ్రెస్ పార్టీ తిరిగి గెలుచుకుంది. మొన్న బళ్లారి లోక్‌సభకు జరిగి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌లోకి కొత్తగా వచ్చిన ఉగ్రప్ప చేతిలో శ్రీరాములు సోదరి శాంత ఓడిపోయారంటే మళ్లీ కాంగ్రెస్ ఎంత పుంజుకుందో అర్థం చేసుకోవచ్చు. గాలిపై దాఖలైన అవినీతి కేసుల్లో ముఖ్యమంత్రి కుమార స్వామి పంతం పట్టి ముందుకు తీసుకెళుతుండడం, ప్రస్తుతం గాలిని దగ్గర తీయడం నష్టమే ఎక్కువని, ఆయన్ని బీజేపీ దూరంగా ఉంచడం వల్ల అవినీతి కేసులో గాలి అరెస్టైయ్యారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
భారీగా డబ్బులు పోగొట్టుకున్న క్రికెటర్ తల్లి
పోంజి స్కీమ్‌ల పేరిట జరుగుతున్న మోసాలు ఇటీవల బాగా వెలుగులోకి వస్తున్నాయి. తెలుసో తెలియకో చాలా మంది వీటి బారిన పడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి క్రికెటర్ యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్ సింగ్ కూడా వచ్చి చేరారు. ఆమెతో పాటు చాలా మంది ఇన్వెస్టర్లు భారీగా డబ్బులు పోగొట్టుకుని నెత్తి పట్టుకున్నారు. సాధన ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన పోంజి స్కీమ్ మేనేజర్లు యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్ సింగ్‌తో పాటు మరికొంత పెట్టుబడిదారులకు, దాదాపు 84 శాతం రిటర్నులు ఇస్తామంటూ నమ్మబలికారు. వారి మాటలను నమ్మిన వీరు, సాధన ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన పోంజి స్కీమ్‌లో పెట్టుబడులు పెట్టారు. యువరాజ్ సింగ్ తల్లి సుమారు కోటి రూపాయలు దీనిలో ఇన్వెస్ట్ చేశారు. కానీ వీరెవరికీ వాగ్దానం చేసినంత డబ్బులు ఇవ్వకుండా.. ఆ ఫండ్స్‌ను షెల్ కంపెనీలో తరలించారు ఆ పోంజి స్కీమ్ మేనేజర్లు. ఈ స్కామ్ విలువ దాదాపు రూ.700 కోట్ల మేర ఉంటుందని అధికారులు గుర్తించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద పోంజి స్కీమ్ మేనేజర్లపై ఈడీ ఫిర్యాదు దాఖలు చేసింది. ఇన్వెస్టర్లు మోసం చేస్తూ.. వారు జరిపిన లావాదేవీలన్నింటిన్నీ ఈడీ పరిశీలిస్తోంది. మరోవైపు యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్ పెట్టిన కోటి రూపాయల పెట్టుబడిని కూడా ఈడీ విచారిస్తోంది. ఆమె చెక్‌ల ద్వారా దానిలో పెట్టుబడులు పెట్టినట్టు తెలిసింది. అయితే ఆమె పెట్టుబడులకు వారు ప్రతినెలా రూ.7 లక్షల ఇస్తారని చెప్పినట్టు షబ్నమ్ చెప్పారు. దానిలో సగం మేర రిటర్నులను అధికారిక బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా ఆమెకు చెల్లించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. కానీ మిగతా రూ.50 లక్షలను మాత్రం చెల్లించలేదు. అయితే ఈ కేసులో ఆమె జరిపిన లావాదేవీలన్నింటిన్నీ వారం రోజుల్లో తమకు తెలుపాలని ఈడీ, షబ్నమ్‌కు నోటీసులు జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ తనకు ఎలాంటి నోటీసులు రాలేదని షబ్నమ్ కొట్టిపారేశారు. పోంజి స్కీమ్‌లో, బిట్‌కాయిన్ ట్రేడింగ్, హవాలా లావాదేవీల్లో భాగమైన సాధన ఎంటర్‌ప్రైజస్, ఇతర షెల్ కంపెనీల లావాదేవీలన్నింటిన్నీ ఈడీ పరిశీలిస్తోంది. అయితే దీనిలో యువరాజ్‌కు ఎలాంటి ప్రమేయం లేదని తెలిసింది. -
ద్రవిడ్, సైనా నెహ్వాల్‌కు టోకరా!
సాక్షి, బెంగుళూరు: అతిగా ఆశ పడితే ఎంతటి వారికైనా తిప్పలు తప్పవు. అసాధ్యమైన హామీలిచ్చి దాదాపు 800 మంది నుంచి రూ.300 కోట్ల వరకు పెట్టుబడుల పేరుతో రాబట్టిన విక్రం ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బోర్డు తిప్పేసింది. మోసపోయిన వారిలో మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, ప్రకాశ్ పదుకొనె వంటి వారున్నట్టు సమాచారం. పెట్టుబడులపై 40 శాతం వరకు లాభాలు ఆర్జించి పెడతామని నమ్మబలికిన సదరు సంస్థ అందరికీ శఠగోపం పెట్టింది. మోసానికి పాల్పడిన విక్రం ఇన్వెస్ట్మెంట్ కంపెనీ చాలా తెలివిగా పేరు మోసిన వ్యక్తులను ఏజెంట్లుగా నియమించుకుంది. వారిలో బెంగుళూరులోని ప్రముఖ క్రీడా పాత్రికేయుడు సుత్రం సురేష్ ఒకరు. ఈయన క్రీడా ప్రముఖుల నుంచి పెట్టుబడలను ఆకర్షించడంలో కీలకంగా పనిచేసినట్టు తెలుస్తోంది. పలుకుబడి గల ఏజెంట్లతో సినిమా, క్రీడా, రాజయకీయ, వ్యాపార రంగాల్లోని ప్రముఖులను ఈ సంస్థ బురిడీ కొట్టించింది. సంస్థ యజమాని రాఘవేంద్ర శ్రీనాథ్, ఏజెంట్లు సురేష్, నరసింహమూర్తి, కేసీ నాగరాజ్, ప్రహ్లాద్‌లను పోలీసులు అరెస్టు చేసి 14 రోజుల కస్టడీకి తరలించారు. నిందితులు తెలిపిన వివరాల ప్రకారం సదరు సంస్థలో పెట్టుబడి పెట్టిన వారి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా రాహుల్ ద్రవిడ్, సైనా నెహ్వాల్ నుంచి ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని పోలీసులు చెప్పారు. దీనిపై పత్రికల వాళ్లతో మాట్లాడేందుకు ప్రకాశ్ పదుకొనే సహాయకుడు నిరాకరించారు. -
ఇక ప్రైవేటుకూ బొగ్గు మైనింగ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ బొగ్గు రంగంలో కేంద్రం మరిన్ని సంస్కరణలకు తెరతీసింది. ఇకపై వాణిజ్య అవసరాల కోసం బొగ్గును ఉత్పత్తి చేసేందుకు ప్రైవేట్ కంపెనీలకు కూడా కాంట్రాక్టులివ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలు సొంత అవసరాల కోసం బొగ్గును ఉత్పత్తి చేయడానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో మంగళవారం జరిగిన సమావేశంలో కేంద్ర క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది. 1973లో బొగ్గు రంగాన్ని జాతీయం చేశాక మళ్లీ ఇన్నాళ్లకు ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. ఇది బొగ్గు రంగంలో అత్యంత కీలక సంస్కరణ అని సమావేశానంతరం బొగ్గు, రైల్వే శాఖల మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. దీంతో బొగ్గు రంగంలో సమర్ధత మరింత పెరుగుతుందని, గుత్తాధిపత్య (కోల్ ఇండియా) ధోరణులకు చెక్ పెట్టినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. బొగ్గు రంగంలో పోటీతత్వం పెరిగేందుకు, చౌక విద్యుత్ టారిఫ్‌లు సాకారమయ్యేందుకు ఇది దోహదపడగలదని గోయల్ వివరించారు. ‘బొగ్గు రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడాన్ని ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడుతుంది. భారీ పెట్టుబడులు రావడం వల్ల బొగ్గు నిల్వలున్న ప్రాంతాల్లో.. ముఖ్యంగా మైనింగ్ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మందికి ఉపాధి కలుగుతుంది. ఆయా ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుంది‘ అని గోయల్ పేర్కొన్నారు. బొగ్గు గనుల చట్టం (స్పెషల్ ప్రొవిజన్స్) 2015, గనులు.. ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957 కింద బొగ్గు గనులు/బ్లాకుల వేలంలో ఉపయోగించే ప్రక్రియను సీసీఈఏ ఆమోదించినట్లు కేంద్ర బొగ్గు శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పోటీతో కోల్ ఇండియాకూ ప్రయోజనం.. బొగ్గు రంగాన్ని జాతీయం చేసిన అనంతరం బొగ్గు విక్రయించే అధికారాలు ప్రభుత్వ రంగ కోల్ ఇండియాకి (సీఐఎల్) మాత్రమే కట్టబెట్టారు. దేశీయంగా ఉత్పత్తయ్యే మొత్తం బొగ్గులో సీఐఎల్ వాటా 80 శాతం ఉంటుంది. తాజా సంస్కరణలతో కోల్ ఇండియా గుత్తాధిపత్యం తగ్గినప్పటికీ.. ఈ రంగంలో పోటీతత్వం పెరగడం ద్వారా ఆ సంస్థకూ ప్రయోజనం చేకూరగలదని మంత్రి గోయల్ వ్యాఖ్యానించారు. బొగ్గు ఉత్పత్తి దేశీయంగా పెరిగితే దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని.. తద్వారా విలువైన విదేశీ మారక నిల్వలూ కూడా ఆదా చేసుకోవచ్చని ఆయన వివరించారు. పారదర్శకతకు పెద్ద పీట.. బొగ్గు తవ్వకాల కోసం చిన్న, మధ్య స్థాయి, భారీ స్థాయి గనులన్నింటినీ కూడా ప్రైవేట్ కంపెనీలకు ఆఫర్ చేయడం జరుగుతుందని మంత్రి చెప్పారు. పారదర్శకతకు, సులభతరంగా వ్యాపారాల నిర్వహణ విధానాలకు పెద్ద పీట వేసేలా వేలం ప్రక్రియ ఉంటుందన్నారు. సహజ వనరులు దేశాభివృద్ధికే ఉపయోగపడేలా చూసేందుకు ఇది ఉపయోగపడగలదన్నారు. ఈ సంస్కరణలు బొగ్గు సరఫరాపై ఖచ్చితత్వం.. కేటాయింపుల్లో జవాబుదారీతనం పెరిగేందుకు, చౌకగా బొగ్గు లభ్యతకు దోహదపడగలవని, ఇంధన భద్రత సాధించేందుకు తోడ్పడగలవని గోయల్ పేర్కొన్నారు. ప్రతి టన్ను బొగ్గు ఉత్పత్తిపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు కంపెనీలు ఎంతెంత అధికంగా చెల్లిస్తాయన్న ప్రాతిపదికన వేలం ఉంటుందని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. ఆయా గనుల నుంచి ఉత్పత్తి చేసే బొగ్గు విక్రయం/వినియోగంపై ఎలాంటి ఆంక్షలు ఉండవని వివరించింది. దేశీయంగా 70 శాతం విద్యుదుత్పత్తి బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచే జరుగుతున్న నేపథ్యంలో ఇంధన భద్రత సాధించేం దుకు ఈ సంస్కరణలు దోహదపడగలవని తెలిపింది. అయిదు బొగ్గు రాష్ట్రాలకు అత్యధిక లబ్ధి .. బొగ్గు గనుల వేలం, విక్రయం ద్వారా వచ్చే మొత్తం ఆదాయం అంతా బొగ్గు నిల్వలున్న ఆయా రాష్ట్రాలకే చెందుతుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. ఆర్థిక వృద్ధికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సదరు రాష్ట్రాలు ఈ ఆదాయాలను ఉపయోగించుకోవడం ద్వారా లబ్ధి పొందవచ్చని వివరించింది. ముఖ్యంగా తూర్పు రాష్ట్రాలకు అత్యధికంగా ప్రయోజనం చేకూరగలదని పేర్కొంది. భారత్‌లో 300 బిలియన్ టన్నుల మేర బొగ్గు నిల్వలు ఉన్నాయని అంచనా. వీటిలో అత్యధికంగా నిల్వలు అయిదు రాష్ట్రాల్లో.. పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లకు తాజా సంస్కరణలు ప్రయోజనం చేకూర్చనున్నాయి. పోంజీ స్కీములపై కొరడా ♦ నిషేధానికి సమగ్ర చట్టం ♦ పథకాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు ♦ ప్రత్యేక బిల్లుకు క్యాబినెట్ ఆమోదం చిట్టీలు, డిపాజిట్ల పేరుతో సామాన్యులు మోసపోకుండా ఉండేందుకు కేంద్రం రెండు కొత్త బిల్లులు తేనుంది. ఈమేరకు నియంత్రణ లేని డిపాజిట్ల వసూళ్లను నిషేధిస్తూ ప్రతిపాదించిన నూతన బిల్లును కేంద్ర కేబినెట్ మంగళవారం ఇక్కడ ఆమోదించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ‘నియంత్రణ లేని డిపాజిట్ స్కీముల నిషేధ బిల్లు, 2018’, ‘చిట్‌ఫండ్స్(సవరణ) బిల్లు, 2018’ని ఆమోదించింది. అన్‌రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్ నిషేధ బిల్లు 2018ని త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ‘కొన్ని సంస్థలు, కంపెనీలు..నియంత్రణ చట్టాల్లోని లొసుగులను వాడుకుంటూ, మోసపూరిత పథకాలతో సామాన్య ప్రజల కష్టార్జితాన్ని దోచుకుంటున్నాయి. దేశీయంగా ఇలాంటి అక్రమ డిపాజిట్ల సమీకరణ కార్యకలాపాల సమస్యను పరిష్కరించడం ఈ బిల్లు ప్రధానోద్దేశం‘ అని ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి స్కీముల వల్ల మోసపోయే వారిలో అత్యధికులు పేదలు ఉంటున్నారు. నియంత్రణ సంస్థల కంటబడకుండా పోంజీ స్కీములు పలు రాష్ట్రాల్లో విస్తరించి ఉంటున్నాయి. కఠిన శిక్షలు.. జరిమానాలు: తాజాగా రూపొం దించిన బిల్లు ప్రకారం .. ఇలాంటి అనధికారిక డిపాజిట్ల సమీకరణపై పూర్తి నిషేధం అమల్లోకి రావడంతో పాటు, నిధులు సమీకరించే వారిపై కఠిన శిక్షలు ఉంటాయి. ఒకవేళ డిపాజిట్లు సమీకరించిన సంస్థ మూతబడితే.. ఇన్వెస్టర్లకు సక్రమంగా తిరిగి చెల్లింపులు జరిగేలా చూ సేందుకు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేకంగా అధికార యంత్రాంగాన్ని నియమించాల్సి ఉంటుంది. ఈ బిల్లు ప్రధానంగా మూడు రకాల నేరాలను ప్రస్తావించింది. అనధికారిక డిపాజిట్ల పథకాల నిర్వహణ, నియంత్రిత డిపాజిట్ స్కీములలో మోసపూరిత డిఫాల్ట్, అనధికారిక డిపాజిట్ పథకాల్లో చేరేలా ప్రేరేపించడం మొదలైన వాటిని నేరాలుగా పరిగణించడం జరుగుతుంది. ఇలాంటి విషయాల్లో కఠిన శిక్షలతో పాటు జరిమానాలు కూడా ఉంటాయి. స్కీము నడిపే సంస్థ గానీ మూతబడితే .. దాని ఆస్తులను అటాచ్ చేసి, డిపాజిటర్లకు తిరిగి చెల్లింపులు జరిపేందుకు స్పష్టమైన గడువు ఉం టుంది. దేశం మొత్తం మీద డిపాజిట్స్ సమీకరణ కార్యకలాపాల వివరాలను సమీకరించేందుకు, దర్యాప్తు సంస్థలతో పంచుకునేందుకు ఆన్లైన్ సెంట్రల్ డేటా బేస్ ఉంటుంది. -
‘పోంజీ’ బాధితులకు పరిహారం!
చట్ట సవరణ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ: మోసపూరిత పథకాల్లో(పోంజీ స్కీమ్స్) నష్టపోయిన వారికి ఊరట కలిగించే కీలక సంకేతాన్ని కేంద్రం ఇచ్చింది. శారద తరహా పథకాల్లో మోసానికి గురైన వారికి నష్టపరిహారం అందేలా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)కు సవరణలు చేస్తున్నట్లు రెవెన్యూ కార్యదర్శి శక్తికాంత దాస్ శుక్రవారం ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ (ఈడీ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో వెల్లడించారు. మోసపూరిత పథకాల్లో నష్టపోయిన మదుపుదారుల సంఖ్య దాదాపు 6 కోట్లు ఉంటుందని అంచనా. నష్టపోయిన విలువ దాదాపు రూ.80,000 కోట్లుగా భావిస్తున్నారు. ఆయా అంశాలను శక్తికాంత దాస్ ప్రస్తావిస్తూ... ఐబీ, సీబీఐ, కస్టమ్స్, డీఆర్ఐ, ఆదాయపు పన్ను శాఖ, ఈడీ వంటి వివిధ విచారణా సంస్థల మధ్య చక్కటి సమన్వయం, సహకారం ద్వారా మోసపూరిత పథకాలను నిరోధించవచ్చని అన్నారు. ఫైనాన్స్ బిల్లులో చొరవ... ఫైనాన్స్ బిల్లులో పోంజీ స్కీమ్‌ల నిరోధానికి సంబంధించి నిబంధనలు ఉన్నట్లు పేర్కొంటూ, అయితే ఈ విషయం తగినంత ప్రచారం కాలేదని అన్నారు. పోంజీ స్కీమ్‌ల బాధితులకు పరిహారం కల్పించేలా చర్యలకు ఒక నిబంధన ఫైనాన్స్ బిల్లులో ఉందన్నారు. మోసపూరిత పథకాల్లో నష్టపోయిన వారికి పరిహారం అందించడం... కోర్టుల పర్యవేక్షణ వంటి అంశాలకు సంబంధించి రానున్న కాలంలో తగిన మార్గదర్శకాలు, నిబంధనలను వెలువరించనున్నట్లు రెవెన్యూ కార్యదర్శి వెల్లడించారు. ప్రత్యక్ష, పరోక్ష పన్ను చట్ట నిబంధనలను ఉల్లంఘించినవారిపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేటే కఠిన చర్యలు తీసుకునేలా పీఎంఎల్ఏలో సవరణల అంశం ఫైనాన్స్ బిల్లులో మరో ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు. -
సెబీ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర
న్యూఢిల్లీ: పెట్టుబడులపై అధిక ఆదాయాన్ని ఆశచూపి ఇన్వెస్టర్లను మోసగించే పోంజీ స్కీములను అరికట్టేందుకు సెబీకి మరిన్ని అధికారాలనిచ్చే సెక్యూరిటీల చట్టాల (సవరణ) బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. ప్రజలు మోసగాళ్ల బారినపడకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోడీ త్వరలోనే ఓ పథకాన్ని ప్రకటిస్తారని కేంద్రం వెల్లడించింది. సందేహాస్పద సంస్థలకు చెందిన దేశ, విదేశీ కార్యాలయాల్లో సోదాల నిర్వహణకు, వాటినుంచి సమాచారం కోరడానికి కొత్త చట్టం ద్వారా సెబీకి అధికారాలు సమకూరుతాయి. సెబీ ప్రధాన కార్యాలయం ఉన్న ముంబైలోని సంబంధిత న్యాయస్థానం అనుమతించిన తర్వాతే తనిఖీలను నిర్వహించాల్సి ఉంది. సొమ్మున్న చోటే సొరచేపలుంటాయి... పటిష్టమైన శాసన వ్యవస్థతోనే మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. మోసపూరిత పథకాల నుంచి అమాయక ఇన్వెస్టర్లను కాపాడడానికి ఉన్న ఒక మార్గం మారుమూల ప్రాంతాలకు సైతం బ్యాంకుల విస్తరణ (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) అని తెలిపారు. దీనికి సంబంధించి ప్రధాని త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు. దేశంలో సాధ్యమైనంత ఎక్కువ మందికి బ్యాంకింగ్ కార్యకలాపాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు బ్యాంకు అకౌంట్లు లేని 7.5 కోట్ల కుటుంబాలకు కనీసం రెండేసి చొప్పున ఖాతాలుండాలనేది తమ లక్ష్యమని వివరించారు. అత్యధిక జనాభాకు బ్యాంకులను చేరువచేస్తే పోంజీ స్కీములవైపు ప్రజలు ఆకర్షితులు కావడం దానంతట అదే తగ్గిపోతుందని చెప్పారు.