పోంజీ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పెట్టుబడి దారుల్ని హెచ్చరించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తం రాబడి అందిస్తామని నమ్మించే ఇలాంటి యాప్స్ నుంచి పెట్టుబడి దారుల్ని సురక్షితంగా ఉంచేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్‌బీఐతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు.
తుమకూరు (కర్ణాటక)లో జరిగిన థింకర్స్ ఫోరమ్‌లో ఆమె మాట్లాడుతూ.. కొద్ది మొత్తంలో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో రాబడులు అందిస్తామని హామీల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. డబ్బు ఆశ చూపిస్తూ అది చేస్తాం. ఇది చేస్తామని ప్రజలకు చేరువయ్యేందుకు రకరకాల ప్రయాత్నాలు చేసే పోంజీ యాప్స్ ఉన్నాయని, వాటిని నియంత్రించాలని అన్నారు.
సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అనధికారిక యాప్స్ నుంచి ప్రజల్ని కాపాడాలని కోరారు. సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లను నియంత్రిస్తున్నారా? అని ప్రశ్నించినప్పుడు..ప్రస్తుతం వారిని నియంత్రించేలా ఎలాంటి ప్రతిపాదనలు లేవని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు. అయితే సోషల్ మీడియాలో అలాంటివారిని అనుసరిస్తూ.. వారి సూచనలు పాటించడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉందని , ప్రజలు దీనిపై అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment